భోజనం స్పైసీగా ఉందని చంపేశాడు | Husband kills wife over a spicy meal in Delhi | Sakshi
Sakshi News home page

భోజనం స్పైసీగా ఉందని చంపేశాడు

Published Thu, Feb 16 2017 8:56 AM | Last Updated on Tue, Sep 5 2017 3:53 AM

భోజనం స్పైసీగా ఉందని చంపేశాడు

భోజనం స్పైసీగా ఉందని చంపేశాడు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మధు విహార్ ప్రాంతంలో సుబోధ్‌ (40) అనే వ్యక్తి.. భోజనం విషయంలో గొడవపడి భార్యను కిరాతకంగా చంపేశాడు. భోజనంలో కారం ఎక్కువగా ఉందని కారణంతో కర్రతో బాదడంతో ఆమె చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

ప్లంబర్‌గా పనిచేస్తున్న సుబోధ్‌, అతని భార్య మనీషా తరచూ గొడవపడేవారని పోలీసులు చెప్పారు. సుబోధ్‌ మునియా అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం మనీషాకు తెలియడంతో భర్తను నిలదీసింది. సుబోధ్‌కు దూరంగా రోహిణిలో ఉన్న బంధువుల దగ్గరకు వెళ్లింది. ఈ నెల 10న సుబోధ్‌ నచ్చజెప్పి మనీషాను ఇంటికి రమ్మని చెప్పాడు. ఆ రోజు ఇంట్లో సుబోధ్‌తో కలసి మునియా ఉండటం చూసి మనీషా కోప్పడింది. కాగా మునియా ఇంట్లో ఉండదని, దగ్గరలో మరో చోట ఉంటుందని సుబోధ్‌ ఆమెకు నచ్చజెప్పాడు. ఆ తర్వాత మనీషా భోజనం తయారు చేసి భర్తకు వడ్డించింది. భోజనంలో కారం ఎక్కువగా ఉందని గొడవపడిన సుబోధ్  కర్ర తీసుకుని బాదడంతో మనీషా చనిపోయింది. ఆమె ఒంటిపై 22 చోట్ల గాయాలున్నట్టు పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement