పర్లాకిమిడి(ఒడిశా): జిల్లా అటవీశాఖ ఏసీఎఫ్(అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) సౌమ్యనంజన్ మహాపాత్రొ 2021 జూలై 21న అనుమానాస్పదంగా మృతిచెందిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసు మిస్టరీని ఛేదించడంలో దర్యాప్తు(సిట్) అధికారులు విఫలమయ్యారు. అయితే మృతుడు తండ్రి అభిరాం మహాపాత్రొ కేసుపై పునః విచారణ చేయాలని పర్లాకిమిడి ఎస్‌డీజేఎం కోర్టులో కోరారు.
దీనిని స్వీకరించిన న్యాయస్థానం.. ఏప్రిల్ 27కు విచారణకు రావాల్సిందిగా నిందితులకు నోటీసులు పంపారు. కేసులో అప్పటి డీఎఫ్‌ఓ సంగ్రాంకేసరి బెహరా, భార్య విద్యాభారతీ పండా, వంటవాడు మన్మథ ఖంబలకు నిందితులుగా చేర్చారు. 95శాతం శరీర భాగాలు కాలిన మృతదేహాన్ని ఆస్పత్రిలో చేర్చగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు.
Comments
Please login to add a commentAdd a comment