ఉక్రెయిన్‌ గడ్డపై పౌరుషం ఎంతలా అంటే.. | 98 Year Old Woman Offering To Join Ukraines Military | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌: రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఆమె.. ఇప్పుడు మాతృభూమి కోసం సై అంటోంది మరి!

Published Sat, Mar 19 2022 7:43 PM | Last Updated on Sat, Mar 19 2022 8:12 PM

98 Year Old Woman Offering To Join Ukraines Military - Sakshi

world war two veteran was ready to defend: ఉక్రెయిన్‌ గడ్డ పోరు ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి ముఖ్యకారణం.. ప్రాణాలకు తెగించి దేశం కోసం సామాన్యుడు తుపాకీ పట్టడం.. యుద్ధ భూమిలో ప్రాణాలను ఎదురొడ్డి పోరాడడం. రష్యా బలగాలు.. విరుచుకుపడుతున్నా, పిట్టల్లా ప్రజలు రాలుతున్నా దేశభక్తితో ముందుకు వస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో..  ఉక్రెయిన్‌లోని మాజీ సైనికురాలు ఓల్హా ట్వెర్డోఖ్లిబో తాను సైన్యంలోకి చేరతానుంటూ ఉత్సాహంగా ముందుకు వచ్చింది.

ఓల్హా.. రెండో ప్రపచంలో యుధంలో పాల్గొన్న అనుభవజ్ఞురాలు కూడా. పైగా ఇప్పుడామె రెండోసారి యుద్ధాన్ని ఎదుర్కొడానికి సిద్ధంగా ఉంది. యుద్ధంలో దెబ్బతిన్న తన మాతృభూమిని రక్షించుకోవాడానికి తాను పోరాడుతానని చెబుతోంది. ఈ మేరకు ఆమె ఉక్రెయిన్‌ మిలటరీకి దరఖాస్తు చేసుకుంది. కానీ ఉక్రెయిన్‌ అధికారులు ఆమె వయసు రీత్యా ఆమె దరఖాస్తును తిరస్కరించారు. కానీ, ఆమె మాత్రం దేశం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమని అంటోంది. 

ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ ట్విట్టర్‌లో పేర్కొంది. ఆమెకు అన్ని అర్హతలు, అనుభవం ఉన్నప్పటికీ వయసు రీత్యా తీసుకోలేదని వివరించింది. అయితే "ఆమె కచ్చితంగా త్వరలో కైవ్‌లో మరో యుద్ధ విజయాన్ని జరుపుకుంటుందని అనుకుంటున్నాం" అనే క్యాప్షన్‌ జోడించి మరీ ఉక్రెయిన్‌ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో నెటిజన్లు ఉక్రెయిన్‌ మహిళలు అత్యంత ధైర్యవంతులు అని ఒకరు, ఒక సైనికుడు ఎప్పటికీ సైనికుడే అని మరోకరు ట్వీట్‌ చేశారు.

(చదవండి: పీల్చే గాలిని సైతం విషంగా మార్చిన ఉక్రెయిన్‌ యుద్ధం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement