ఉక్రెయిన్ పై రష్యా మొదలుపెట్టిన మిలిటరీ ఆపరేషన్ రోజుకో మలుపు తిరగుతోంది. యుద్ధం మొదలై ఎనిమిది రోజులైనప్పటికీ ఉక్రెయిన్‌లో విధ్వంసం మాత్రం ఆగడం లేదు. అయితే రష్యా తరపున సైనికులు, ఉక్రెయిన్ తరపున సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా భారీ సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. యుధ్ధం మొదట్లో రష్యా ఆధిపత్యం చెలాయించినట్లు కనిపించినా, గత నాలుగు రోజులుగా ఉక్రెయిన్‌తో పాటు రష్యా కూడా తీవ్ర నష్టాలను చవి చూస్తోంది.
తాజాగా రష్యా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యన్ మేజర్ జనరల్ హతమైనట్లు స్థానిక మీడియా తెలిపింది. ఎనిమిదో రోజు జరుగుతున్న యుద్ధంలో రష్యన్ మేజర్ జనరల్ అండ్రీ సుఖోవిట్‌స్కీ హతమైనట్లు బెలారస్ మీడియా వెల్లడించింది. దీనిపై రష్యన్ అధికారులు స్పందించాల్సి ఉంది. ఇప్పటికే ఆర్థిక ఆంక్షలతో అల్లాడుతున్న రష్యాకు, తాజా పరిణామం భారీ ఎదురు దెబ్బే అని చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment