Zelenskyy receives a standing ovation from the US lawmakers: ఉక్రెయిన్ పై రష్యా గత 21 రోజులుగా నిరవధిక దాడి చేస్తూనే ఉంది. ఉక్రెయిన్ ఆక్రమణే ద్యేయంగా రష్యా మరింత దుశ్చర్యలకు ఒడిగడుతోంది. ఈ మేరకు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ యూఎస్ కాంగ్రెస్‌తో వీడియో కాన్ఫరెన్స్ కాల్‌లో ఉక్రెయిన్ పరిస్థితి గురించి మాట్లాడారు. వ్లోదిమిర్ జెలెన్ స్కీ స్క్రీన్ పై కనబడగానే యూఎస్ కాంగ్రెస్ సభ్యుల నిలబడి ప్రశంసించారు. జెలెన్‌స్కీ అమెరికా కాంగ్రెస్‌ని మరింత సైనిక సాయం చేయమని కోరారు.
రష్యా పై మరిన్ని ఆంక్షలు విధించే దిశగా రష్యాతో సాగిస్తున్న వ్యాపారాలను ఉపసంహరించవల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ఆదాయం కంటే శాంతికి పెద్ద పీట వేస్తూ అమెరికా తప్పనిసరిగా దిగుమతులను నిరోధించేలా కట్టుదిట్టం చేయమని కోరారు. రష్యా ఉక్రెయిన్ ఆకాశాన్ని వేలాది మంది మరణాలకు వేదికగా చేసింది." రష్యా మా దేశంలోని విలువలకు, స్వేచ్ఛయుత జీవనానికి భంగం కలిగించేలా దాడి చేసింది.
మా కలలను కల్లోల పరిచేలా క్రూరంగా దాడి చేసిందని జెలెన్‌స్కీ ఆవేదనగా పేర్కొన్నారు". మరోసారి జెలెన్ స్కీ నో ఫ్లై జోన్ అంశం గురించి ప్రస్తావించారు. ఈ మేరకు రష్యా తమ దేశం పై క్రూరంగా చేస్తున్న దాడుల తాలుకా వీడియోని ప్లే చేశారు. యూఎస్ ఇస్తున మద్దతుకు కృతజ్ఞతలు తెలపడమే కాక తమ దేశం కోసం మరింత చేయమని కోరారు. అమెరికా మద్దతు తమ దేశానికి ఎప్పటికీ ఉండాలని ఆకాంక్షించారు.
(చదవండి: రష్యా టీవీ లైవ్‌షోలో నిరసన.. మహిళా జర్నలిస్ట్‌కు 15 ఏళ్ల వరకు జైలు శిక్ష!)
Comments
Please login to add a commentAdd a comment