Viral Video Of Old Woman Dancing Like No One's Watching - Sakshi
Sakshi News home page

Viral Video: అరే వాహ్‌.. అద్భుత స్టెప్పులతో అదరగొట్టిన బామ్మ

Published Mon, Mar 27 2023 3:52 PM | Last Updated on Mon, Mar 27 2023 6:23 PM

Viral Video Of Old Woman Dancing Like No One’s Watching - Sakshi

మ్యూజిక్ వినిపిస్తే చాలు కొంతమంది ఆటోమెటిక్‌గా కాలు కదిపేస్తుంటారు. లోకాన్ని మర్చిపోయి ఎంతో ఎంజాయ్‌ చేస్తూ డ్యాన్స్‌ చేస్తుంటారు. ఈ మధ్య ఏ ఫంక్షన్‌, కార్యక్రమం జరిగినా డ్యాన్స్‌ లేకుండా ఉండటం లేదు. వయస్సుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు ఉత్సాహంగా స్టెప్పులేసేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో ఎక్కువగా దర్శనమిస్తున్నాయి.

తాజాగా ఇలాంటి మరో వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఓ బామ్మ సూపర్‌ ఎనర్జిటిక్‌  స్టెప్పులు వేసి అందరినీ షాక్‌కు గురి చేసింది. మహిళల కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో స్టేజ్‌పై ఉన్న సింగర్స్‌ పాటపాడుతుంటే అక్కడున్న వారంతా డ్యాన్స్‌ చేశారు. వారిలో అందరికంటే ముందు వరుసలో నిల్చున్న ఓ బామ్మ.. ఇతరులతో కలిసి ఎంతో హుషారుగా డ్యాన్స్‌ చేసింది. మరాఠీ పాటకు అద్భుత స్టెప్పులతో అదరహో అనిపించింది.

60 ఏళ్ల పైవయసున్న బామ్మ.. చుట్టుపక్కన వారిని పట్టించుకోకుండా, పూర్తిగా పాటను ఎంజాయ్‌ చేస్తూ డ్యాన్స్‌ ఇరగదీసింది. బామ్మ డ్యాన్స్‌కు నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆమె స్టామినా చూసి అవాక్కువుతున్నారు. ఆ వయస్సులో ఉరకలేస్తున్న ఆమె ఉత్సాహం చూసి ఫిదా అవుతున్నారు. మళ్లీ బాల్యం గుర్తొచ్చిందా బామ్మ‌.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. మీరు ఆ వీడియోను చూసేయండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement