Paralysis Patient Dance on Bullettu Bandi Song: ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా బుల్లెట్టు బండి పాటలు, దానికి జనాలు వేస్తున్న స్టెప్పులే కనిపిస్తున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఈ పాటకు తెగ కనెక్ట్ అయ్యారు. ప్రతీ ఫంక్షన్‌లోనూ ఈ పాటే వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపేస్తున్న ఈ సాంగ్ ఇప్పుడు ఓ ప్రత్యేక కారణంతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఆస్పత్రిలో పక్షవాతంతో మంచంపట్టిన ఓ వ్యక్తి త్వరగా కోలుకునేందుకు నర్సు విన్నూత్న ఆలోచన చేసింది. స్పర్శ కోల్పోయిన అతడి చేతికి సంగీతంతో చలనం వచ్చేలా చేయాలనుకుంది.
ఇందుకోసం బుల్లెట్టు బండి పాట పెట్టి తను డ్యాన్స్ చేస్తూ అతడిని కూడా చేయమని ప్రోత్సహించింది. ఆ రోగి కూడా నర్సును అనుకరిస్తూ సంతోషంగా చేయి ఊపసాగాడు. ఈ క్రమంలో చలనం లేకుండా పడి ఉన్న ఎడమ చేతిని పట్టుకుని డ్యాన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోగికి పాటతో ట్రీట్‌మెంట్ అందించిన నర్సును నెటిజన్లు ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. రోగి ముఖంలో చిరునవ్వును తీసుకొచ్చినందుకు ఆమెను అభినందిస్తున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న వివరాలు మాత్రం తెలియరాలేదు.
How a nurse uses the famous #bulletbandi song to make a paralysis patient move hand!!!
— P Pavan (@PavanJourno) September 3, 2021
(WhatsApp forward) pic.twitter.com/VlhiSzjJgZ
Comments
Please login to add a commentAdd a comment