కుట్టియమ్మ
This 104 Year Old Woman Has Scored 89/100 in Literacy Exam: ఆలస్యం అమృతం విషం అని అంటారు. కానీ డ్రీమ్ నెరవేరడం జీవితకాలం ఆలస్యమైతే.. మరేం పర్వాలేదు అంటుంది ఈ బామ్మ! లేటు వయసులో లేటెస్ట్ రికార్డు సొంతం చేసుకుంది. పది పదుల వయసులో రాయడం, చదవడం నేర్చుకుని పరీక్షలు రాసి అందరితో శభాష్!! అనిపించుకుంది. అవిశేషాలు మీ కోసం..
ఒన్మనోరమ మీడియా తెల్పిన సమాచారం ప్రకారం.. కేరళలోని కొట్టాయాంకు చెందిన కుట్టియమ్మ తన జీవితంలో ఒక్కసారి కూడా పాఠశాలకు వెళ్లలేదు. ఐతే 104 ఏళ్ల కుట్టియమ్మ ‘సాక్షరత ప్రేరక్ రెహ్నా ప్రోగ్రాం ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహించే క్లాసులకు హాజరయ్యి రాయడం, చదవడం నేర్చుకుంది. తద్వారా 4వ తరగతి పరీక్షలు రాయడానికి కుట్టియమ్మ అర్హత సాధించింది. పది పదుల వయసుదాటిన కుట్టియమ్మకు వినికిడి సమస్య ఉన్న కారణంగా పరీక్షలు నిర్వహించే ఇన్విజిలేటర్లను బిగ్గరగా మాట్లాడాలని కోరిందట కూడా. పరీక్ష కూడా భేషుగ్గా రాసింది. ఈ పరీక్షలో వందకు 89 మార్కులు సాధించింది. మార్కులను చూసుకుని ఆనందపడిపోతున్న కుట్టియమ్మ ఫొటోను కేరళ ఎడ్యుకేషన్ మినిష్టర్ వాసుదేవన్ శివన్‌కుట్టి ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.
దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవ్వడంతో స్థానికంగా స్టార్ అయ్యింది. ‘కుట్టియమ్మ అంకితభావానికి సెల్యూట్. ఇది ఖచ్చితంగా చాలామందికి స్ఫూర్తినిస్తుందని’ సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో నెటిజన్లు ప్రశంశిస్తున్నారు. చదువుకు వయసుతో సంబంధం లేదని మరోసారి నిరూపితమైంది. మీరేమంటారు..
చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం..
104-year-old Kuttiyamma from Kottayam has scored 89/100 in the Kerala State Literacy Mission’s test. Age is no barrier to enter the world of knowledge. With utmost respect and love, I wish Kuttiyamma and all other new learners the best. #Literacy pic.twitter.com/pB5Fj9LYd9
— V. Sivankutty (@VSivankuttyCPIM) November 12, 2021
Comments
Please login to add a commentAdd a comment