Literacy program
-
అన్నాఖబాలే దుబా..: సేవలో.. ది బెస్ట్!
ఏ అంశంలోనైనా అందరికంటే విభిన్నంగా, ప్రత్యేకంగా ఉన్నవారే ‘ది బెస్ట్’గా నిలుస్తారు. ప్రపంచంలోనే ‘ది బెస్ట్’ అని అనిపించుకోవడం అంటే మామూలు విషయం కాదు. తన ఆలోచనా దృక్పథం, సామాజికాభివృద్ధిపై ఉన్న మక్కువతో ‘అన్నా ఖబాలే దుబా’ ప్రపంచంలోనే ‘బెస్ట్ నర్సు’గా నిలిచింది. గ్రామంలోని వారంతా తనలా ఎదగాలన్న ఆకాంక్షే ‘ఆస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డు’ను తెచ్చిపెట్టింది అన్నాకు. అన్నా ఖబాలే దుబా కెన్యాలోని తొర్బి అనే మారుమూల గ్రామంలో పుట్టింది. అక్కడ చదువుకున్నవారు చాలా తక్కువ. ఇక తన కుటుంబంలో అయితే ఒక్కరు కూడా అక్షరాస్యులు లేరు. ఇలాంటి వాతావరణంలో పుట్టిపెరిగిన అన్నా చిన్నప్పటి నుంచి చాలా చురుకుగా ఉండేది. ఒకసారి వింటే ఇట్టే పట్టేసే అన్నా గ్రామంలోనే తొలి గ్రాడ్యుయేట్‌గా ఎదిగింది. నర్సింగ్ చదువుతోన్న సమయంలో ‘మిస్ టూరిజం కెన్యా’ కిరీటాన్నీ గెలుచుకుంది. అందరూ తనలా చదవాలని... అన్నా స్వగ్రామంలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు ఉండడం వల్ల మూఢనమ్మకాలు అధికంగా ఉండేవి. వీటి కారణంగా ఆడపిల్లలకు చాలా చిన్నవయసులో పెళ్లిళ్లు చేసేవారు. ఆచారం పేరిట వారు చేసే అకృత్యాల మూలంగా అభం శుభం తెలియని ఆడపిల్లలు వైకల్యాల బారినపడేవారు. పద్నాలుగేళ్ల వయసులో బలవంతపు పెళ్లి నుంచి తప్పించుకుంది అన్నా. వీటన్నింటిని చిన్నప్పటి నుంచి ప్రత్యక్షంగా చూసిన అన్నా ఈ మూఢాచారాలను ఎలాగైనా నిర్మూలించాలనుకునేది. నర్సింగ్ డిగ్రీ అయిన తరువాత ఆసుపత్రిలో నర్సుగా చేరింది. ఇక్కడ విధులు నిర్వర్తిస్తూ బాల్యవివాహాలతో సహా పలు మూఢాచారాలను తీవ్రంగా వ్యతిరేకించేది. చదువుకోవడం కలిగే ప్రయోజనాలు స్వయంగా రుచిచూసిన అన్నా గ్రామంలోని మిగతా పిల్లలు తనలా చదువుకోవాలని బలంగా కోరుకునేది. ఖబాలే దుబా ఫౌండేషన్.. మూఢాచారాలను వ్యతిరేకించడంతోనే అన్నా ఆగిపోలేదు. గ్రామంలో ఎక్కువమందిని అక్షరాస్యుల్ని చేస్తే మూఢాచారాలను ఆపవచ్చని ... తొర్బి గ్రామంలోని పిల్లలను విద్యావంతులుగా తీర్చిద్దాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ‘ఖబాలే దుబా’ పేరిట పౌండేషన్‌ను స్థాపించింది. కమ్యూనిటీ లిటరసీ కార్యక్రమం ద్వారా గ్రామంలోని పిల్లలు, పెద్దలకు చదువు చెబుతోంది. ఆసుపత్రిలో విధులు ముగించుకున్న తరువాత మిగతా సమయాన్ని.. ఇతర టీచర్లతో కలసి తరగతులు చెప్పడానికి కేటాయించి వందలాదిమంది విద్యకు కృషిచేస్తోంది. ప్రస్తుతం లిటరసీ కార్యక్రమంలో 150 మంది పిల్లలు, 100 మంది పెద్దవాళ్లు విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. చదువుతోపాటు లైంగిక, ప్రత్యుత్పత్తి అవయవాల ఆరోగ్యంపైన కూడా అవగాహన కల్పిస్తోంది. గ్రామంలోని పిల్లలకేగాక తన కుటుంబానికి చెందిన 19 మందిని కూడా చదివిస్తోంది అన్నా. 31 ఏళ్ల అన్నా డ్యూటీ, సామాజిక సేవాకార్యక్రమాలతో తీరికలేకుండా ఉన్నప్పటికీ ఎపిడిమియాలజీలో మాస్టర్స్ చేస్తోంది. బెస్ట్ నర్స్‌గా.. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తోన్న ఆస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ సంస్థ గ్లోబల్ బెస్ట్ నర్స్‌ను ఎంపికచేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఆహ్వానాలు పంపగా.. 24 వేలమందికిపైగా పోటీపడ్డారు. వేల మందిని వెనక్కు నెట్టి గ్లోబల్ నర్సింగ్ అవార్డుని గెలుచుకుంది అన్నా. ఈ అవార్డుకింద రెండున్నర లక్షల డాలర్లను గెలుచుకుని ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. ‘‘నేను ఈరోజు అవార్డును అందుకోవడానికి నా కుటుంబం, మా కమ్యునిటీల ప్రేరణే కారణం. ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది. మూఢాచారాలనుంచి భవిష్యత్ తరాలను కాపాడడమే నా లక్ష్యం. ఈ అవార్డు ద్వారా వచ్చిన నగదు కెన్యాలో మరిన్ని స్కూళ్ల ఏర్పాటుకు, విస్తరణకు ఉపయోగపడుతుంది’’ అని అన్నా ఆనందం వ్యక్తం చేసింది. -
యాహూ! వందకు 89 మార్కులు.. 104 ఏళ్ల బామ్మ సంతోషం!!
This 104 Year Old Woman Has Scored 89/100 in Literacy Exam: ఆలస్యం అమృతం విషం అని అంటారు. కానీ డ్రీమ్ నెరవేరడం జీవితకాలం ఆలస్యమైతే.. మరేం పర్వాలేదు అంటుంది ఈ బామ్మ! లేటు వయసులో లేటెస్ట్ రికార్డు సొంతం చేసుకుంది. పది పదుల వయసులో రాయడం, చదవడం నేర్చుకుని పరీక్షలు రాసి అందరితో శభాష్!! అనిపించుకుంది. అవిశేషాలు మీ కోసం.. ఒన్మనోరమ మీడియా తెల్పిన సమాచారం ప్రకారం.. కేరళలోని కొట్టాయాంకు చెందిన కుట్టియమ్మ తన జీవితంలో ఒక్కసారి కూడా పాఠశాలకు వెళ్లలేదు. ఐతే 104 ఏళ్ల కుట్టియమ్మ ‘సాక్షరత ప్రేరక్ రెహ్నా ప్రోగ్రాం ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహించే క్లాసులకు హాజరయ్యి రాయడం, చదవడం నేర్చుకుంది. తద్వారా 4వ తరగతి పరీక్షలు రాయడానికి కుట్టియమ్మ అర్హత సాధించింది. పది పదుల వయసుదాటిన కుట్టియమ్మకు వినికిడి సమస్య ఉన్న కారణంగా పరీక్షలు నిర్వహించే ఇన్విజిలేటర్లను బిగ్గరగా మాట్లాడాలని కోరిందట కూడా. పరీక్ష కూడా భేషుగ్గా రాసింది. ఈ పరీక్షలో వందకు 89 మార్కులు సాధించింది. మార్కులను చూసుకుని ఆనందపడిపోతున్న కుట్టియమ్మ ఫొటోను కేరళ ఎడ్యుకేషన్ మినిష్టర్ వాసుదేవన్ శివన్కుట్టి ట్విటర్లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవ్వడంతో స్థానికంగా స్టార్ అయ్యింది. ‘కుట్టియమ్మ అంకితభావానికి సెల్యూట్. ఇది ఖచ్చితంగా చాలామందికి స్ఫూర్తినిస్తుందని’ సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో నెటిజన్లు ప్రశంశిస్తున్నారు. చదువుకు వయసుతో సంబంధం లేదని మరోసారి నిరూపితమైంది. మీరేమంటారు.. చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం.. 104-year-old Kuttiyamma from Kottayam has scored 89/100 in the Kerala State Literacy Mission’s test. Age is no barrier to enter the world of knowledge. With utmost respect and love, I wish Kuttiyamma and all other new learners the best. #Literacy pic.twitter.com/pB5Fj9LYd9 — V. Sivankutty (@VSivankuttyCPIM) November 12, 2021 -
మరుగున పడుతున్న లలిత గీతాలను 'తానా' పరిరక్షిస్తుంది
డల్లాస్, టెక్సాస్ - తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో 'లలిత సంగీత సాహిత్యం – తీరు తెన్నులు' అనే అంశంపై ప్రముఖ గీత రచయితలు, గాయనీ గాయకులు వేదవతి ప్రభాకర్, డా. ఎంకే రాము, డా. ఓలేటి పార్వతీశం, డా. వడ్డేపల్లి కృష్ణ, కలగా క్రిష్ణమోహన్, వారణాసి నాగలక్ష్మి మొదలగువారు పాల్గొని వివిధ అంశాలను స్పృశించి అనేక మధుర స్మృతులను నెమరువేసుకున్నారు. సుప్రసిద్ధ సంగీత దర్శకులు, గాయకులు, లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ వ్యవస్థాపకులు కొమండూరి రామాచారి లలిత గీతాలకు తాను ఇస్తున్న ప్రాముఖ్యాన్ని వివరిస్తూ తన శిక్షణలో తయారవుతున్న గాయనీ, గాయకులచే వేలకొద్దీ లలిత గీతాలను పాడిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ గాయని వేదవతీ ప్రభాకర్ ‘లలిత గీతాల స్వర్ణయుగం’ అనే అంశంపై స్పందిస్తూ తన సుదీర్ఘ సంగీత ప్రస్థానంలో కలసి పనిచేసిన సుప్రసిద్ధ రచయితలు, గాయనీ గాయకుల విశేష కృషిని వివరించారు. ప్రముఖ సంగీత దర్శకులు పాలగుమ్మి విశ్వనాథం రచించి, స్వరపరచిన 'అమ్మ దొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ' అనే గీతాన్ని పాడి అందరినీ అలరించారు. కార్యక్రమంలో ప్రముఖ కవి, రసమయి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ఎంకే రాము మాట్లాడుతూ.. తాను రచించిన అనేక వందల లలిత గీతాలను, ఎంతోమంది సినీ, సాహిత్య ప్రముఖులతో తనకున్న సాన్నిహిత్యాన్ని పంచుకున్నారు. వివిధ ప్రసార మాధ్యమాలలో ముప్పైతొమ్మిది సంవత్సరాలకు పైగా విశేషానుభవం గడించిన సాహితీవేత్త, ప్రముఖ కవి డా. ఓలేటి పార్వతీశం దూరదర్శన్‌లో తొలినాళ్లలో లలిత గీతాలు ప్రసారం కావడం నుంచి, నేటివరకు సాగుతున్న పరిణామక్రమాన్ని ఆసక్తికరంగా వివరించారు. 'తెలుగులో లలిత గీతాలు' అనే అంశంపై ప్రామాణిక పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందిన సాహితీవేత్త లలితగీత, సినీగీత రచయిత, సినీదర్శకులు డా. వడ్డేపల్లి కృష్ణ దశాబ్దాల సినిమా చరిత్రలో లలిత గీతాలు సినీ గీతాలుగా రూపుదిద్దుకున్న వైనాన్ని సోదాహరణంగా వివరించారు. ఆకాశవాణితో ఐదు దశాబ్దాలకు పైగా అవినాభావ సంబంధం ఉన్న ఆకాశవాణి ఉత్తమ శ్రేణి కళాకారులు, ప్రముఖ గీతరచయిత, సంగీత దర్శకులు కలగా కృష్ణమోహన్ సంగీత ప్రపంచంలో దిగ్గజాల లాంటి మహానుభావులు ఎందరితోనో పని చేసిన సంఘటనలను గుర్తుచేసుకున్నారు. ప్రముఖ చిత్రకారిణి, కథా, లలితగీత రచయిత్రి వారణాసి నాగలక్ష్మి లలితగీత సాహిత్య ప్రపంచంలో అలనాటి సుప్రసిద్ధ రచయితలతో పాటు వర్తమానంలో రాస్తున్న రచయితలు, వారి సాహిత్య కృషిని వివరించారు. ప్రముఖ గాయకులు, సంగీత దర్శకులు కొమండూరి రామాచారి తన గాన ప్రస్థానం లలిత గీతాలతోనే ప్రారంభం అయిందని, అప్పటినుండి ఇప్పటి వరకు అనేక మంది సాహితీవేత్తల సృజనను స్వరపరచి లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ ఆధ్వర్యంలో ఎంతోమంది గాయనీ, గాయకుల గాత్రాల ద్వారా అనేక జాతీయ అంతర్జాతీయ వేదికల మీద పాడించడం చాలా ఆనందంగా ఉందన్నారు. రామాచారి శిక్షణలో తమ గాత్రసౌరభానికి మెరుగులు దిద్దుకుంటున్న సరస్వతీ చైతన్య (వర్జీనియా), బేబీ శరణ్య వక్కలంక (వర్జీనియా), నాగ సాహితి (కాలిఫోర్నియా), శివాని సరస్వతుల (జర్మనీ), సౌజన్య గరిమెళ్ళ (నెదర్లాండ్స్), శరత్ చంద్ర ఏడిద (బహరేన్), స్వాతి ఎల్లూరి(బహరేన్), భారతదేశం నుంచి శ్రీ సౌమ్య వారణాసి, శరత్ సంతోష్, భరత్ రాజ్, జయరాం పైల, జీవీ ఆదిత్య, సాకేత్ కొమ్మాజోశ్యుల, శ్రియా మాధురి పోపూరి, మేఘనా నాయుడు,శ్రీపాద ఉప్పులూరి మొదలైనవారు తమ గాత్ర మాధుర్యంతో అందరినీ అలరించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. 'సంగీత, సాహిత్య ప్రపంచంలో దిగ్గజాలైన బాలాంత్రపు రజనీకాంత రావు, డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఓలేటి వెంకటేశ్వర్లు,చిత్తరంజన్, మల్లిక్, శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి లక్ష్మి, వింజమూరి అనసూయ, వింజమూరి సీత, జగన్నాధాచార్యులు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, డా. సీ నారాయణ రెడ్డి, దాశరధి, బోయి భీమన్న, పాలగుమ్మి విశ్వనాధం, శ్రీశ్రీ, పుట్టపర్తి నారాయణాచార్యులు, డా. గుంటూరు శేషంద్ర శర్మ, నేదునూరి కృష్ణమూర్తి, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, ఆచార్య తిరుమల, కోపెల్ల శివరాం, అఖ్మల్ హైదరాబాది లాంటి ప్రముఖల విశేష కృషిని, ఈ సభ ద్వారా స్మరించుకుని వారికి నివాళులర్పించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. లలిత గీతాల పునర్ వైభవానికి తానా సంస్థ కట్టుబడి ఉందని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిధులకు, గాయనీ గాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి, వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ లలిత గీతాలు మరుగున పడుతున్న ఈ కాలంలో వాటి పరిరక్షణకు తానా చిత్తశుద్ధితో కృషిచేస్తుందన్నారు. -
ఇంటర్నెట్లో ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’
‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ను ఈ ఏడాది ఇంటర్నెట్లో ప్రారంభిస్తున్నామని తానా అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి వెల్లడించారు. మే 31నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో ప్రపంచంలోని సాహితీ ప్రియులంతా పాల్గొనాలని సూచించారు. తద్వారా తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో తానా మరో ముందడుగు వేస్తోందని అన్నారు. ఇకపై ప్రతి నెల చివరి ఆదివారం అంతర్జాతీయ దృశ్య సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. (వలస కూలీలకు ఎన్ఆర్ఐల బస్సు ఏర్పాటు) మొదటి సమావేశం ఈ ఆదివారం (మే 31) నాడు రాత్రి 9.30 నిమిషాలకు (అమెరికా సమయం ఉదయం11:00) ప్రసారం కానుందని తానా మాజీ అధ్యక్షులు తోటకూర ప్రసాద్ అన్నారు. ఈ సాహిత్య సమావేశంలో ముఖ్య అతిధిగా ప్రముఖ జానపద ప్రజా వాగ్గేయకారుడు వంగపండు ప్రసాద రావు తన బృంద సభ్యులతో జానపద గానాలతో కనువిందు చేయనున్నారని పేర్కొన్నారు. (చిక్కినట్టే చిక్కి పంజా విసిరింది.. ) ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ "తానా ప్రపంచ సాహిత్య వేదిక" ద్వారా అంతర్జాతీయ స్థాయిలో సాహిత్య సభలు, సమావేశాలు, కవి సమ్మేళనాలు, చర్చలు, అవధానాలతో పాటు కథలు, కవితలు, ఫోటో కవితలు, పద్యాలు, పాటలు, బాల సాహిత్యం లాంటి వివిధ అంశాలలో ప్రపంచ వ్యాప్తం గా పోటీలు నిర్వహిస్తామని, మే నెల నుంచి ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ దృశ్య సమావేశం జరుపుతామని ప్రకటించారు. (ఆమె లేకుండా ‘పని’ అవుతుందా! ) ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాహితీ ప్రియులందరూ ఈ దృశ్య సమావేశంలో ఈ క్రింది ఏ మాధ్యమాల ద్వారా నైనా పాల్గొనవచ్చని ఆహ్వానం పలికారు. 1. Webex Link: https://tana.webex.com/tana/j.php?MTID=md6320421e1988f9266591b0ce5f8ee40 2. Facebook: 3. Join by phone: USA: 1-408-418-9388 Access code: 798 876 407 -
ఆటా ఆధ్వర్యంలో అంతర్జాతీయ సాహితీ సదస్సు
అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో అంతర్జాతీయ సాహితీ సదస్సు హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం శనివారం ఘనంగా జరిగింది. ముందు తరాలతో సంభాషణ, నవ కవి సమ్మేళనం, పన్నెండు మంది కొత్తతరం కవుల కవిగానం, ఇప్పటి కథకుల ఆలోచనలు, అనుభవాలు, పద్యం పాటా, జానపదం కార్యక్రమాలను నిర్వహించారు. పన్నెండు మంది కొత్త తరం కవులతో నిర్వహించిన కవి సమ్మేళనం వైభవంగా జరిగింది. నేపద్య గేయ రచయితలు దేశపతి శ్రీనివాస్, అనంత శ్రీరామ్, ప్రొద్దుటూరి యెల్లారెడ్డిలు పద్యం, పాట, జానపదం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకే వేదికపై అలనాటి కవులు, నేటి తరం కవులు కలిసి మొత్తం 39మంది కవులు అంతర్జాతీయ సాహితీ సదస్సులో పాల్గొన్నారు. తెలుగు ప్రజలకు అమెరికాలో ఉన్న ఆటా తెలుగు ప్రజలకు వారధిగా ఉంటుందని అమెరికా తెలుగు సంఘం తదుపరి అధ్యక్షులు బువనేశ్ బుజాలా అన్నారు. కేవలం సాహిత్యమే కాకుండా ఇతర రంగాల్లో కూడా అభివృద్ధికి ఆటా అండగా ఉంటుందని ఆయన అన్నారు. సుప్రసిద్ద రచనా కవి కె.శివారెడ్డి మాట్లాడుతూ.. కొత్త తరాల మీద మనకు కొన్ని అపోహలు అపనమ్మకాలు ఉన్నాయి. ఇతరులతో మనం నమ్మకం ఉంచినప్పుడు అదే నమ్మకంతో కొనసాగాలని తెలిపారు. 'నలుగురితో చర్చలు జరుగితే ఆలోచనలు వికసిస్తాయి. ఈ ఆలోచనలు మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిదద్దుతాయని' వ్యాసకర్త, జానపద వాజ్మయ పరిశోధకుడు కసిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రసిద్ద వచన కవులు కె.శివారెడ్డి, నందిని సిధారెడ్డి, రాచపాళెం, కె.శ్రీనివాస్, ఓల్గా, అఫ్సర్, కసిరెడ్డి వెంకట రెడ్డి, కె.ఎన్.మల్లీశ్వరి, వెల్దండి శ్రీధర్, పూడూరు రాజిరెడ్డి, వెంకట సిద్ధారెడ్డి, మల్లికార్జున్, పూర్ణిమ తమ్మిరెడ్డి, స్వాతి కుమారి బండ్లమూడి, ఆటా ప్రెసిడెంట్ పరమేశ్ భీంరెడ్డి, తదపరి ప్రెసిడెంట్ భువనేశ్ బుజాలా, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అనిల్ బోదిరెడ్డి, రామకృష్ణా రెడ్డి అలా, ఆటా 2020 కన్వీనర్ నర్సింహారెడ్డి ద్యాసానితో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. -
వయసు 105 తరగతి 4
తిరువనంతపురం: కేరళలోని కొల్లాంకు చెందిన 105 ఏళ్ల భగీరథీ అమ్మ.. కేరళ ప్రభుత్వం అక్షరాస్యత మిషన్‌లో భాగంగా నిర్వహించే నాలుగో తరగతికి సమానమైన పరీక్ష రాసి చదువుపై తనకున్న మక్కువను చాటుకున్నారు. చదువంటే ఎంతో ఇష్టపడే భగీరథీ చిన్నప్పుడే తన తల్లి చనిపోవడంతో తోబుట్టువుల ఆలనపాలనా కోసం చదువుకు దూరమయ్యారు. దీంతో కలగానే మిగిలిపోయిన తన చదువును ఈ వయసులో పరీక్ష రాసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ పరీక్ష రాసిన అతిపెద్ద వయస్కురాలు భగీరథీ అని అక్షరాస్యత మిషన్ డైరెక్టర్ శ్రీకళ తెలిపారు. భగీరథీకి ఆరుగురు పిల్లలు, 15 మంది మనువలు, మనువరాళ్లు ఉన్నారు. పరీక్షరాసిన బామ్మతో అధికారి -
వయోజన ‘మిథ్య’!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వయోజనులకు విద్యా బుద్ధులు నేర్పేందుకు కేంద్ర ప్రభుత్వం 2010 నుంచి కొనసాగించిన సాక్షర భారత్ కార్యక్రమం ఇప్పుడు నిలిచిపోయి క్షేత్రస్థాయిలో అనుకున్న లక్ష్యం సాధ్యం కావట్లేదు. ఈ ప్రక్రియ ఆగిపోయి ఏడాది కావస్తున్నా..ఇందులో పనిచేసిన మండల కోఆర్డినేటర్లు, గ్రామానికి ఇద్దరి చొప్పున విలేజ్ కోఆర్డినేటర్లకు వేతనాల చెల్లింపు ప్రక్రియను మాత్రం పూర్తి చేయలేదు. గౌరవ వేతనాలు అందక ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఏళ్లుగా ఇందులోనే కొనసాగిన వారి పరిస్థితి గందరగోళంగా మారింది. దీనిని కొనసాగిస్తారేమోననే ఆశను వదలుకోలేక, ఈ కార్యక్రమాన్ని పొడిగిస్తారా..? లేదా..? అనే విషయాలపై ఎంతకీ స్పష్టత రాక అవస్థ పడుతున్నారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చే బృహత్తర లక్ష్యంతో ప్రవేశపెట్టిన సాక్షర భారత్ కొండెక్కింది. అక్షరాస్యతా శాతాన్ని పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2010లో సాక్షరభారత్‌ను ప్రవేశపెట్టి..నిరక్షరాస్యులైన వయోజనులకు విద్యను అభ్యసించే అవకాశం కల్పించారు. గ్రామాల్లో కూలీలు, సామాన్యులు పగటి వేళల్లో పనులకు వెళ్తుంటారని, సాయంత్రం సమయంలో వీరికి ప్రత్యేకంగా తరగతులు నిర్వహించాలనేది దీని ప్రధాన ఉద్దేశం. పథకం లక్ష్యం 2017 సెప్టెంబర్ వరకుగా నిర్ణయించి, 2018 మార్చి వరకు పొడిగించారు. అయితే లక్ష్యం ఘనమైనా ఆచరణలో విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. నూరుశాతం అక్షరాస్యతను సాధించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ఈ పథకం ద్వారా తీరలేదు. అక్షరాస్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వయోజన విద్య శాఖ ద్వారా సాక్షరభారత్ పథకంలో వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమాలు కొనసాగట్లేదు. కొన్నేళ్లుగా జిల్లాలో అమలవుతున్న సాక్షరభారత్ కార్యక్రమాలు సందిగ్ధంలో పడ్డాయి. అయితే పర్యవేక్షణ లోపం..ఇతర కారణాలతో ఈ పథకం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదనే ఆరోపణలున్నాయి. గ్రామాల్లో కూడా వయోజన విద్య కేంద్రాలు అంతంతమాత్రంగానే నడిచాయని తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే అక్షరాస్యతకు చేరువవుతున్న దశలో ప్రభుత్వం సాక్షరభారత్‌ను నిలిపివేసే ఆలోచనలో ఉండటం పథకం లక్ష్యాలను దెబ్బతీసేలా ఉంది. అందరికీ విద్యను అందించాలంటే సాక్షరభారత్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగించాలని పలువురు కోరుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకం కొనసాగింపుపై కేంద్రాన్ని కోరాలని అంటున్నారు. కొణిజర్ల మండలం చిన్నగోపతిలో సాక్షరభారత్ కేంద్రం సాక్షరభారత్ సిబ్బంది భవితవ్యం ప్రశ్నార్థకం.. సాక్షరభారత్ పథకంలో పనిచేస్తున్న సిబ్బంది భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుందా..? లేదా..? అనే విషయం తేలకపోవడంతో ఇందులో పనిచేస్తున్న ఎంసీవోలు, వీసీవోల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 36 మండలాల్లోని 631 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బంది సైతం ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ పథకంలో మండలానికి ఒక కో ఆర్డినేటర్ (ఎంసీఓ), గ్రామానికి ఇద్దరు విలేజ్ కో ఆర్డినేటర్లు (వీసీఓ) ఉంటారు. మొత్తం 631 గ్రామ పంచాయతీల్లో 1262 మంది విలేజ్ కోఆర్డినేటర్లు ఉన్నారు. మండలానికి ఒక కో ఆర్డినేటర్ చొప్పున 36 మంది మండల కో ఆర్డినేటర్లు పనిచేస్తున్నారు. ఒకవైపు పథకం పొడిగిస్తారో లేదో అనే అనుమానాలతోపాటు గత కొన్ని నెలలుగా సిబ్బందికి వేతనాలు అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విలేజ్ కో ఆర్డినేటర్లకు రూ.2వేల గౌరవ వేతనం, మండల కో ఆర్డినేటర్లకు రూ.6వేలు గౌరవ వేతనం ఇస్తున్నారు. అయితే వీసీవోలకు 7 నెలలు, ఎంసీవోలకు 6నెలల గౌరవ వేతనం ఇంకా అందాల్సి ఉంది. ప్రతి ఆరునెలలకోసారి వీరికి జీతాలు రావాలి. అదే సమయానికి పథకం పొడిగింపుపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో వీరికి వేతనాలు అందలేదు. అయితే ప్రభుత్వం వీరిని అనేక పనులకు వినియోగించుకుంది. పథకం పొడిగించేది..? లేనిది కేంద్రం స్పష్టం చేసి తమకు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని వారు కోరుతున్నారు. పొడిగింపుపై స్పష్టత లేదు.. సాక్షర భారత్ కార్యక్రమం 2018 మార్చితో ముగిసింది. ప్రభుత్వం నుంచి మాకు దీనిని పొడిగిస్తున్నట్లు కానీ..లేదా ఇతర ఏ సమాచారమూ రాలేదు. ప్రభుత్వ ఆదేశాల అనుసారం మేం విధులు నిర్వహించనున్నాం. – ధనరాజ్, డిప్యూటీ డైరెక్టర్, సాక్షర భారత్, ఖమ్మం -
వదినామరదళ్లు! కన్నడం పరవళ్లు
జైలు జీవితం ఎందుకని అడిగితే... చేసిన తప్పుకు శిక్షను అనుభవించడానికి అని చెప్తాం. నిజానికి నేరం చేసిన వారిని జైల్లో ఉంచడం వెనుక ఉన్న పరమార్థం వారిలో పరివర్తన తీసుకురావడమే. అలాంటి పరివర్తన అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు మొదలైనట్లే ఉంది. నాలుగేళ్ల శిక్షలో భాగంగా శశికళ కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైల్లో ఉంటున్నారు. అక్కడ ఆమె ‘అడల్ట్ లిటరసీ ప్రోగ్రామ్’ (వయోజన అక్షరాస్యత కార్యక్రమం)లో చేరి కన్నడ అక్షరాలు దిద్దుతున్నారు. కన్నడలో పదాలు చదవడం, రాయడం నేర్చుకుంటున్నారు. అలాగే కంప్యూటర్ ఎడ్యుకేషన్ క్లాస్‌లకూ హాజరవుతున్నారు. లైబ్రరీలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. మౌనమే సమాధానం శశికళ కన్నడ భాషను ఏ మేరకు నేర్చుకున్నారనేది నిర్ధారించడానికి అధికారులు ఇప్పటికే ఒక మౌఖిక కూడా నిర్వహించారు. అయితే ఆ రోజు శశికళ మౌనవ్రతంలో ఉండటంతో ఏ ప్రశ్నలకూ నోరు తెరిచి సమాధానం ఇవ్వలేదు. మౌఖికంగా సమాధానాలివ్వకపోయినా ఆమె కన్నడ అక్షరాలు, పదాలను చక్కగా రాస్తున్నారని, సిలబస్‌ను చక్కగా పూర్తి చేశారనే ఒక అంచనాకు రావడానికి అది సరిపోతుందని జైలు వర్గాలు అంటున్నాయి. అంటే.. ‘లిటరసీ ప్రోగ్రామ్’లో విజయవంతంగా పాల్గొన్నట్లు శశికళ చేతికి త్వరలోనే ఒక సర్టిఫికెట్ రాబోతోంది. శశికళతోపాటు అదే కేసులో శిక్షను అనుభవిస్తున్న ఆమె మరదలు ఇళవరసి కూడా కన్నడం నేర్చుకుంటున్నారు. మహిళలకు లైబ్రరీ! ఇప్పటి వరకు పరప్పన సెంట్రల్ జైలులో మహిళల విభాగంలో లైబ్రరీ లేదు. ఇప్పుడు శశికళ చొరవతో లైబ్రరీని విస్తరించి మరో రెండు విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఒకటి విచారణ ఖైదీలకు, మరొకటి మహిళా ఖైదీల కోసం. మహిళల లైబ్రరీ కోసం ముప్పై వేలు పెట్టి వార్తాపత్రికలు, వారపత్రికలు, మాసపత్రికలు అన్నీ కలిపి 91 పత్రికలు తెప్పించడానికి రంగం సిద్ధమైంది. ర్యాక్‌లు రెడీ అవుతున్నాయి! – మంజీర -
సంపూర్ణ అక్షరాస్యత స్వప్నమేనా..!
- వందశాతం చేరేదెన్నడు..! - రాత్రి బడులు తెరిచినా లాభం లేకపాయే - ‘సాక్షర భారత్’ వచ్చినా అందరికీ సదువు రాకపాయే - జిల్లా అక్షరాస్యత శాతంలో మహిళల వెనుకంజ - నేడు ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం మోర్తాడ్ :నగరాలు, పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాలలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో సరైన సహకారం లేకపోవడంతో సాధ్యం కావడం లేదు. నిరక్ష్యరాస్యతను తగ్గించి అక్షరాస్యుల సంఖ్యను పెంచడానికి కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం 2010 సెప్టెంబర్ 8 నుంచి సాక్షరభారత్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తుంది. ప్రతిఏడాది సెప్టెంబర్ 8న ప్రపంచ అక్షరాస్యత దినోత్సవాన్ని నిర్వహించడం తప్పా సంపూర్ణ అక్షరాస్యత సాధించిన ఘనతను మాత్రం చాటుకోలేకపోతున్నాం. నిరక్షరాస్యుల్లో మహిళలే అధికం జిల్లాలో 85.88 శాతం అక్షరాస్యులు ఉన్నట్లు అ ధికారుల రికార్డులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం నిరక్ష్యరాసుల సంఖ్య తగ్గలేదన్న విష యం స్పష్టమవుతోంది. జిల్లాలో పురుషుల్లో కంటే మహిళల్లోనే నిరక్షరాస్యుల సంఖ్య అధికంగా ఉన్నట్లు వెల్లడవుతోంది. జిల్లాలోని 23 మండలాల్లో మహిళల అక్షరాస్యత 50శాతం లో బడి ఉంది. 13మండలాల్లో మాత్రమే మహిళ లు 50 శాతానికి పైగా అక్షరాస్యత సాధించారు. మహిళల్లో అక్షరాస్యత శాతం పెంచడానికి సాక్షరభారత్ కేంద్రాలకు అనుబంధంగా బోధకుల ను నియమించారు. అయినా అక్షరాస్యత శాతం పెరగడం లేదు. క్షేత్రస్థాయిలో అక్షరాస్యత కా ర్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయక పో వడంతోనే సంపూర్ణ అక్షరాస్యత సాధ్యం కాలేక పోతుంది. నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్, బాల్కొండ, ఎడపల్లి, బాన్సువాడ, డిచ్పల్లి, జక్రాన్‌పల్లి, మద్నూర్, కోటగిరి, రెంజల్ మండలాల్లో మిహ ళా అక్షరాస్యత 50 శాతంకు పైగా ఉంది. మిగిలిన వేల్పూర్, దోమకొండ, మాక్లూర్, భిక్కనూర్, నవీపేట్, వర్ని, మోర్తాడ్, ఎల్లారెడ్డి, నందిపేట్, కమ్మర్పల్లి, సదాశివ్‌నగర్, ధర్పల్లి, సిరికొండ, బిచ్కుంద, పిట్లం, మాచారెడ్డి, తాడ్వాయి, బీర్కూర్, నిజాంసాగర్, నాగిరెడ్డిపేట్, జుక్కల్, గాంధారి, లింగంపేట్ మండలాల్లో మహిళా అక్షరాస్యత 50 శాతంకు తక్కువగా ఉంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న మండలాలను పరిశీలిస్తే అతి తక్కువగా లింగంపేట మండలంలో మహిళ అక్షరాస్యత శాతం 37.11 గా ఉంది. ఇదే మండలంలో పురుషుల అక్షరాస్యత శాతం 48.39గా ఉంది. అక్షరాస్యతలో జిల్లాలో నిజామాబాద్ మండలం ముందంజలో ఉండగా లింగంపేట చివరి స్థానంలో ఉంది. వయోజనులే ఎక్కువ వయోజనుల్లోనే నిరక్ష్యరాసులు ఎక్కువ మంది ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది. వీరికోసం సాక్షర భారత్ ద్వారా అక్షరాస్యత కార్యక్రమా న్ని నాలుగేళ్లనుంచి నిర్వహిస్తూనే ఉంది. గ్రా మాల్లో కో-ఆర్డినేటర్లను నియమించి వీరిని అజమాయిషీ చేయడానికి మండల కో-ఆర్డినేటర్, సూపర్వైజర్, అసిస్టెంట్ ప్రాజెక్టు డెరైక్టర్, ప్రాజెక్టు డెరైక్టర్, డిప్యూటీ డెరైక్టర్లను నియమించారు. అయితే క్షేత్ర స్థాయిలో ఈ కార్యక్ర మం అమలు పకడ్బందీగా జరగకపోవడంతో నిరక్ష్యరాసుల సంఖ్య అలాగే ఉండిపోతోంది. పథకాలను ఆర్భాటంగా ప్రకటిస్తున్నారే త ప్పా.. అమలులో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా పాలకు లు, అధికారులు క్షేత్రస్థాయిలో పథకాలను పకడ్బందీగా అమలు చేసి సంపూర్ణ అక్షరాస్యతకు కృషిచేయాలని అందరూ కోరుతున్నారు.