
తిరువనంతపురం: కేరళలోని కొల్లాంకు చెందిన 105 ఏళ్ల భగీరథీ అమ్మ.. కేరళ ప్రభుత్వం అక్షరాస్యత మిషన్‌లో భాగంగా నిర్వహించే నాలుగో తరగతికి సమానమైన పరీక్ష రాసి చదువుపై తనకున్న మక్కువను చాటుకున్నారు. చదువంటే ఎంతో ఇష్టపడే భగీరథీ చిన్నప్పుడే తన తల్లి చనిపోవడంతో తోబుట్టువుల ఆలనపాలనా కోసం చదువుకు దూరమయ్యారు. దీంతో కలగానే మిగిలిపోయిన తన చదువును ఈ వయసులో పరీక్ష రాసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ పరీక్ష రాసిన అతిపెద్ద వయస్కురాలు భగీరథీ అని అక్షరాస్యత మిషన్ డైరెక్టర్ శ్రీకళ తెలిపారు. భగీరథీకి ఆరుగురు పిల్లలు, 15 మంది మనువలు, మనువరాళ్లు ఉన్నారు.
పరీక్షరాసిన బామ్మతో అధికారి