అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో అంతర్జాతీయ సాహితీ సదస్సు హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం శనివారం ఘనంగా జరిగింది. ముందు తరాలతో సంభాషణ, నవ కవి సమ్మేళనం, పన్నెండు మంది కొత్తతరం కవుల కవిగానం, ఇప్పటి కథకుల ఆలోచనలు, అనుభవాలు, పద్యం పాటా, జానపదం కార్యక్రమాలను నిర్వహించారు. పన్నెండు మంది కొత్త తరం కవులతో నిర్వహించిన కవి సమ్మేళనం వైభవంగా జరిగింది. నేపద్య గేయ రచయితలు దేశపతి శ్రీనివాస్, అనంత శ్రీరామ్, ప్రొద్దుటూరి యెల్లారెడ్డిలు పద్యం, పాట, జానపదం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఒకే వేదికపై అలనాటి కవులు, నేటి తరం కవులు కలిసి మొత్తం 39మంది కవులు అంతర్జాతీయ సాహితీ సదస్సులో పాల్గొన్నారు. తెలుగు ప్రజలకు అమెరికాలో ఉన్న ఆటా తెలుగు ప్రజలకు వారధిగా ఉంటుందని అమెరికా తెలుగు సంఘం తదుపరి అధ్యక్షులు బువనేశ్ బుజాలా అన్నారు. కేవలం సాహిత్యమే కాకుండా ఇతర రంగాల్లో కూడా అభివృద్ధికి ఆటా అండగా ఉంటుందని ఆయన అన్నారు. సుప్రసిద్ద రచనా కవి కె.శివారెడ్డి మాట్లాడుతూ.. కొత్త తరాల మీద మనకు కొన్ని అపోహలు అపనమ్మకాలు ఉన్నాయి. ఇతరులతో మనం నమ్మకం ఉంచినప్పుడు అదే నమ్మకంతో కొనసాగాలని తెలిపారు. 'నలుగురితో చర్చలు జరుగితే ఆలోచనలు వికసిస్తాయి. ఈ ఆలోచనలు మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిదద్దుతాయని' వ్యాసకర్త, జానపద వాజ్మయ పరిశోధకుడు కసిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో సుప్రసిద్ద వచన కవులు కె.శివారెడ్డి, నందిని సిధారెడ్డి, రాచపాళెం, కె.శ్రీనివాస్, ఓల్గా, అఫ్సర్, కసిరెడ్డి వెంకట రెడ్డి, కె.ఎన్.మల్లీశ్వరి, వెల్దండి శ్రీధర్, పూడూరు రాజిరెడ్డి, వెంకట సిద్ధారెడ్డి, మల్లికార్జున్, పూర్ణిమ తమ్మిరెడ్డి, స్వాతి కుమారి బండ్లమూడి, ఆటా ప్రెసిడెంట్ పరమేశ్ భీంరెడ్డి, తదపరి ప్రెసిడెంట్ భువనేశ్ బుజాలా, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అనిల్ బోదిరెడ్డి, రామకృష్ణా రెడ్డి అలా, ఆటా 2020 కన్వీనర్ నర్సింహారెడ్డి ద్యాసానితో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment