
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీసులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. బాలాజీనగర్‌లో చలికి వణుకుతున్న ఓ వృద్ధురాలిని చేరదీసి.. చెంగిచర్లలోని భారతమాత అండ ఆశ్రమంలో చేర్చారు. రాయచోటికి చెందిన లింగమ్మ అనే వృద్ధురాలు కొడుకుతోపాటు బాలాజీ నగర్‌లో నివాసం ఉంటుంది.
సోమవారం రాత్రి సొంత కొడుకే.. తల్లిని ఇంట్లోంచి బయటకు గెంటేశాడు. దీంతో గడ్డకట్టించే చలిలో వృద్ధురాలు రోడ్డుపై అనాథగా.. చలికి వణుకుతూ ఉండిపోయింది. పెద్దావిడ ధీన స్థితిని గమనించిన కాలనీవాసులు.. పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో ఉప్పల్ పెట్రోలింగ్ పోలీసులు ఎ.నర్సింగ్‌రావు, మహిళా పోలీసు కానిస్టేబుల్ సుష్మ, డ్రైవర్ రాములు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వృద్ధురాలిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి వివరాలు సేకరించారు. అనంతరం వృద్ధురాలిని చెంగిచర్లలోని ఆశ్రమానికి తరలించారు. సకాలంలో స్పందించి వృద్ధురాలిని రక్షించిన పోలీసులకను ప్రజలు అభినందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment