Uppal police
-
ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలుడు.. గంటల వ్యవధిలోనే..
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఓ బాలుడు ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. వెంకట్‌రెడ్డి నగర్లో నివాసం ఉంటున్న సల్మా బేగం కుమారుడు మహమ్మద్ హమన్ ఈ రోజు ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న రెండు, మూడు గంటల్లోనే బాబు ఆచూకీ కనుక్కొని ఉప్పల్ పోలీసులు, పెట్రోల్ మొబైల్ ఇంచార్జ్ నర్సింగ్‌రావు.. బాలున్ని తల్లికి అప్పగించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. -
మానవత్వం చాటుకున్న ఉప్పల్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీసులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. బాలాజీనగర్‌లో చలికి వణుకుతున్న ఓ వృద్ధురాలిని చేరదీసి.. చెంగిచర్లలోని భారతమాత అండ ఆశ్రమంలో చేర్చారు. రాయచోటికి చెందిన లింగమ్మ అనే వృద్ధురాలు కొడుకుతోపాటు బాలాజీ నగర్లో నివాసం ఉంటుంది. సోమవారం రాత్రి సొంత కొడుకే.. తల్లిని ఇంట్లోంచి బయటకు గెంటేశాడు. దీంతో గడ్డకట్టించే చలిలో వృద్ధురాలు రోడ్డుపై అనాథగా.. చలికి వణుకుతూ ఉండిపోయింది. పెద్దావిడ ధీన స్థితిని గమనించిన కాలనీవాసులు.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఉప్పల్ పెట్రోలింగ్ పోలీసులు ఎ.నర్సింగ్‌రావు, మహిళా పోలీసు కానిస్టేబుల్ సుష్మ, డ్రైవర్ రాములు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వృద్ధురాలిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి వివరాలు సేకరించారు. అనంతరం వృద్ధురాలిని చెంగిచర్లలోని ఆశ్రమానికి తరలించారు. సకాలంలో స్పందించి వృద్ధురాలిని రక్షించిన పోలీసులకను ప్రజలు అభినందిస్తున్నారు. -
కరోనా: కాలినడకన శ్రీకాకుళంకు.. సర్దిచెబుతున్న పోలీసులు
-
శిక్షణ.. ఉద్యోగం.. అంతా తూచ్
హైదరాబాద్: ఎస్బీఐ.. ఆర్ఆర్బీ.. ఇన్ కంట్యాక్స్ విభాగాల్లో బ్యాక్ డోర్ ఎంట్రీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల్లో డబ్బులు తీసుకొని కోల్‌కతా కేంద్రంగా 3 నెలలు శిక్షణ ఇచ్చి నకిలీ నియామక పత్రాలు చేతిలో పెట్టి వందల మందిని మోసగించిన ఐదుగురు సభ్యులతో కూడిన అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 35 లక్షల విలువైన కారు, బంగారం, నకిలీ డాక్యుమెంట్లు, రూ. 10.5 లక్షల నగదు, పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలోని మరో ఏడుగురు పరారీలో ఉన్నారు. కేసు వివరాలను రాచకొండ పోలీసు కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్ బుధవారం మీడియాకు వెల్లడించారు. కోల్‌కతా కేంద్రంగా మోసాలు.. ఒడిశాకి చెందిన కళ్లు చరణ్పాండా అలియాస్ అజయ్ అలియాస్ మనోజ్ ఐదేళ్ల క్రితం కోల్‌కతాలో స్థిరపడ్డాడు. కొంతకాలం మార్కెటింగ్ బిజినెస్ చేసి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో తన స్నేహితులైన కలావత్ రాయ్, రాజీవ్ కార్తీక్, హేమంత్, అనిల్‌తో కోల్‌కతాలో జాబ్ కన్సల్టెన్సీ ఏజెన్సీ ఏర్పాటు చేశాడు. ఇందులో యువతకు శిక్షణ ఇచ్చి ఎస్బీఐ, ఆర్ఆర్బీ, ఇన్‌కంటాక్స్ డిపార్ట్మెంట్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆన్లైన్లో ప్రకటనలు గుప్పించాడు. అయితే 2015లో వనస్థలిపురంలో నివాసముంటున్న ఆలేరుకు చెందిన శ్రీకాంత్ హైదరాబాద్‌లోని ఓ కన్సల్టెన్సీలో పనిచేస్తున్నప్పుడు చరణ్పాండేకు పరిచయమయ్యాడు. 2017లో శ్రీకాంత్‌కు ఫోన్ చేసి కోల్‌కతాలో ఎస్బీఐ, ఆర్ఆర్బీ, ఇన్‌కంట్యాక్స్ విభాగాల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయని చరణ్పాండే చెప్పడంతో వారి ముఠాలో సభ్యుడిగా చేరాడు. కోల్‌కతాకు నివాసం మార్చుకున్న శ్రీకాంత్ పేరును సుధామ్గా మార్చుకుని తన స్నేహితులైన రాజీవ్ కార్తీక్, ఎం.అశోక్‌రావు, వెంకట్ శిరీష్‌లకు విషయం చెప్పడంతో హైదరాబాద్‌కు చెందిన నలుగురు నిరుద్యోగులు కేతావత్ మోహన్ నాయక్, బానోత్ మోహన్, పి.కిషన్, జె.రమేశ్‌లను కోల్‌కతాకు పంపించారు. వీరి నుంచి రూ. 53.5 లక్షలు తీసుకున్న శ్రీకాంత్ కోల్‌కతాలోని ఎస్బీఐ ట్రైనింగ్ సెంటర్లో 3 నెలలు ఇతర విద్యార్థులతో కలిసి శిక్షణ ఇప్పించాడు. ఆ తర్వాత నకిలీ స్టాంప్‌లు పెట్టి ఎస్బీఐ అధికారులుగా ఫోర్జరీ సంతకాలు చేసి నకిలీ నియామక పత్రాలు ఇచ్చాడు. మిర్యాలగూడ నుంచి మరో నలుగురు మాలోత్ రమేశ్, కేతావత్ అశోక్, కుర్రా విష్ణు, యాతమ్ మహేశ్ నుంచి శ్రీకాంత్ రూ. 43.5 లక్షలు వసూలు చేసి వారికీ నకిలీ నియామక పత్రాలు అంటగట్టాడు. ట్రైనింగ్ సెంటర్లో రోజు తప్పించి రోజు శిక్షణ ఇచ్చేవాడు. శ్రీకాకుళానికి చెందిన మురళీ కృష్ణ భార్య రమా ప్రసన్న కూడా వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం విద్యార్థుల నుంచి లక్షలు వసూలు చేసింది. కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న సంధ్యారాణి 35 మంది నుంచి రూ.16 కోట్లు వసూలు చేసింది. రూ.80 లక్షలు శ్రీకాంత్‌కు ఇచ్చి కోల్‌కతాకు పంపింది. ఈ ముఠా 100 మంది నుంచి రూ. 3 కోట్ల నుంచి రూ. 4 కోట్లు వరకు వసూలు చేసింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం, ల్యాప్‌టాప్‌లు మోసపోయిన వారి ఫిర్యాదుతో మోసపోయిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన రమేశ్, అశోక్, విష్ణు, మహేశ్ తదితరులు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 18న శ్రీకాంత్‌ను అరెస్టు చేశారు. ఇక చరణ్పాండా, మురళీకృష్ణ, వీరరాఘవరెడ్డి, సంధ్యారాణిలను బుధవారం అరెస్టు చేశారు. వీరి నుంచి కారు, రూ. 10.5 లక్షల నగదు, మూడు ల్యాప్‌టాప్‌లు, 2 తులాల బంగారం, నకిలీ అపార్ట్మెంట్ల డాక్యుమెంట్లు, ప్రింటర్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా కలిసి ఇరు రాష్ట్రాల్లో వందల మంది నుంచి రూ. కోట్లలో డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. చరణ్పాండ్యా రూ.65 లక్షలతో విలాసవంతమైన అపార్ట్మెంట్ కొన్నాడని విచారణలో తేలింది. -
రాచకొండ కమిషనరేట్ పరిధిలో మరో ఘరానా మోసం
-
వామ్మో వీడు మామూలోడు కాదు!
హైదరాబాద్: జల్సాలు, విలాసాలకు అలవాటుపడిన ఓ దొంగ పోలీసుల విచారణలో నిర్ఘాంతపరిచే వాస్తవం వెల్లడించాడు. తనకున్న ప్రమాదకరమైన రోగాన్ని పలువురికి వ్యాపింపజేసేందుకు ప్రయత్నించినట్టు తెలిపారు. దొంగతనంలో కేసులో జేమ్స్ అనే వ్యక్తిని ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో ఊహించని విషయాలు వెల్లడయ్యాయ. పగలు ఆటో ఆడుపుతూ, రాత్రిళ్లు దొంగతనాలకు పాల్పడుతున్నాడు. దొంగ సొమ్ముతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. మహిళలను ట్రాప్ చేసి విచ్చలవిడిగా సెక్స్ కార్యకలాపాలు సాగించాడు. తనకు ఎయిడ్స్ ఉందని తెలిసి అతడు ఈ దారుణాలకు ఒడిగట్టినట్టు తెలుస్తోంది. 300 మంది అమ్మాయిలకు ఎయిడ్స్ వ్యాప్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నానని పోలీసుల విచారణలో తెలిపాడు. ఇప్పటివరకు 150 మంది అమ్మాయిలను అతడు మోసం చేసినట్టు తెలుస్తోంది. జేమ్స్ మోసాలను నిర్ధారించే పనిలో పడ్డారు పోలీసులు. -
దారి దోపిడీ ముఠా అరెస్ట్
ఉప్పల్ : దారి దోపిడీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను ఉప్పల్ పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో ఓ బాలుడు కూడా ఉండటం విశేషం. మల్కాజిగిరి ఏసీపీ రవిచందన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ జిల్లా చింతగట్టు గ్రామానికి చెందిన గుండ్లపల్లి శ్రావణ్‌కుమార్(21) మెకానిక్. ప్రకాశం జిల్లా కాసినేనిపల్లి గ్రామానికి చెందిన కోనేటి మర్యాదాస్(20) సెంట్రింగ్ వర్కర్, నల్లగొండ జిల్లా తుర్కపల్లి పెద్ద తండాకు చెందిన బానోతు వినోద్‌కుమార్(21), కర్నూలు వెంకటగిరికి చెందిన బాలుడు (16) ముఠాగా ఏర్పడ్డారు. ఉప్పల్ దేవేందర్‌నగర్ కాలనీని అడ్డాగా చేసుకుని దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. 2013లో సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి, వారి వద్ద లాక్కొన్న ఏటీఎం కార్డు ద్వారా నగదు డ్రా చేసుకెళ్లారు. ఈ కేసులో కొందరిని రిమాండ్‌కు తరలించగా గుండ్లపల్లి శ్రావణ్‌కుమార్, మర్యాదాస్, వినోద్‌కుమార్ తప్పించుకు తిరుగుతున్నారు. వీరు ముగ్గురూ ఓ బాలుడిని వెంటపెట్టుకుని ఉప్పల్‌లోని దేవేందర్ నగర్ పరిసరాల్లో తిరుగుతూ ఒంటరిగా వెళ్తున్న వారిని బెదిరించి అందినకాడికి దోచుకుంటున్నా రు. ఇదిలాఉండగా... ఉప్పల్ పోలీసులు బుధవారం దేవేందర్‌నగర్‌లో తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అక్కడ అనుమానాస్పందగా తిరుగుతున్న శ్రావణ్‌కుమార్, మర్యాదాస్, వినోద్‌కుమార్‌తో పాటు ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు దారి దోపిడీలకు పాల్పడుతున్నట్టు వెల్లడించారు. శ్రావణ్‌కుమార్‌పై మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నాలుగు, ఉప్పల్ పీఎస్ పరిధిలో ఒకటి, కోనేటి మర్యాదాస్పై మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మూడు, ఉప్పల్ ఠాణా పరిధిలో ఒకటి, వినోద్‌కుమార్‌పై ఉప్పల్ ఠాణాలో ఒక కేసు, బాలుడిపై ఉప్పల్ పీఎస్‌లో రెండు, మార్కెట్ పీఎస్‌లో ఒక కేసు ఉన్నాయి. నిందితుల నుంచి సెల్‌ఫోన్, గొలుసు, జనరేటర్ స్వాధీనం చేసుకున్నారు. బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలించి, మిగతా ముగ్గురు నిందితులను గురువారం రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఉప్పల్ ఇన్స్పెక్టర్నర్సింహారెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఖాజా మోహినుద్దీన్, క్రైం ఎస్ఐ రవికుమార్ ఉన్నారు. -
భార్య కేసు పెట్టిందని ఆత్మహత్య...
ఉప్పల్ : భార్య కేసు పెట్టడంతో మనస్తాపం చెంది ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉప్పల్ పోలీసుల కథనం ప్రకారం... రామంతాపూర్ రాంరెడ్డినగర్‌కు చెందిన దుర్గా వినోద్(25) ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం సౌజన్యతో అతనికి వివాహమైంది. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్య పుట్టింటికి వెళ్లి నల్లకుంట పోలీస్ స్టేషన్లో భర్త వే ధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరికీ ఈనెల 17న కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ఇదిలాఉండగా.. వినోద్ బుధవారం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు. మృతుడు రాసిన సూసైడ్ నోట్ దొరికింది. అందులో డబ్బు లేదని అత్తింటివారు నన్ను చిన్న చూపు చూసేవారు. నా భార్యతో వేధింపుల కేసు పెట్టించారు. అంతేకాకుండా వేరేవారితో నాకు వివాహేతర సంబంధం అంటకట్టారు’. దీంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నా’... అని రాసి ఉంది. అత్తింటి వారి వేధింపులతోనే తమ కుమారుడు చనిపోయాడని వినోద్ తల్లి బాలమణి ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.