ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలుడు.. గంటల వ్యవధిలోనే.. | Uppal police responded quickly in the case of boy who ran away from home | Sakshi
Sakshi News home page

ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలుడు.. గంటల వ్యవధిలోనే..

Published Sun, Oct 16 2022 10:41 PM | Last Updated on Sun, Oct 16 2022 10:41 PM

Uppal police responded quickly in the case of boy who ran away from home - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ఓ బాలుడు ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. వెంకట్‌రెడ్డి నగర్‌లో నివాసం ఉంటున్న సల్మా బేగం కుమారుడు మహమ్మద్‌ హమన్‌ ఈ రోజు ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న రెండు, మూడు గంటల్లోనే బాబు ఆచూకీ కనుక్కొని ఉప్పల్‌ పోలీసులు, పెట్రోల్‌ మొబైల్‌ ఇంచార్జ్‌ నర్సింగ్‌రావు.. బాలున్ని తల్లికి​ అప్పగించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement