![Old woman Dangling Upside Down 19th Floor Of Building At China - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/23/old-woman.jpg.webp?itok=_h2GD7zT)
చైనా: ఓ వృద్ధ మహిళ తను నివసించే అపార్టుమెంట్‌లోని బాల్కని నుంచి అదుపు తప్పి కిందకు జారీపడింది. అయితే బట్టలు ఆరేసే ర్యాక్‌కు ఆమె చిక్కుకొని ప్రమాదకరంగా తలకిందులుగా వేలాడింది. ఈ ఘటన తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్ చోటు చేసుకుంది. అపార్టుమెంట్‌లోని 19వ అంతస్తు బాల్కని నుంచి ఆమె కిందికి వేలాడటం గమనించిన స్థానికులు ఫైర్ ఫైటర్లకు సమాచారం అందించారు.
దీంతో రంగంలోకి దిగిన ఫైర్ ఫైటర్లు ఆ వృద్ధురాలని సురక్షితంగా కాపాడారు. ఆ మహిళ గాయాలపాలు కాకుండా.. ప్రాణాపాయం తప్పిందని ఫైర్ ఫైటరర్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
An 82-year-old woman was seen dangling upside down from a clothes rack after falling from the 19th floor of a building in eastern China’s Jiangsu province. pic.twitter.com/Y4yvFRNBo8
— South China Morning Post (@SCMPNews) November 23, 2021
Comments
Please login to add a commentAdd a comment