ఏదైన భవనం కదలడం గురించి విన్నామా!. లేదుకదా అదికూడా కేవలం టీవీల్లో ఏదైన గ్రాఫిక్ మాయాజాలంతో జరిగి ఉండోచ్చు. అంతేగానీ ఒక పెద్ద భవనం కదలడం అన్నది అసాధ్యం. నమశక్యం గానీ నిజం. కానీ అవన్నంటిని కొట్టిపారేసేలా ఔను! భవనాలు కదులుతాయి అని కచ్చితంగా అంటాం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసి. అసలు భవనం కదలడం ఏంటి? అదేలా సాధ్యం అనే కదా!
అసలు విషయం ఏంటంటే.....చైనాలోని షాంఘైలో వందేళ్ల పురాతన భవనం కదిలింది. అది కూడా వందేళ్ల నాటి పురాతన భవనం కదలడం ఏంటీ? అనే కదా!. ఇది పురాతనమైన భవనం కావడంతో చైనా ప్రభుత్వానికి కూల్చడం ఇష్టం లేదు. పైగా ఆ ప్రాంతంలో ఉండటం కూడా ఇష్టం లేదటా. అందుకే ఏకంగా ఆ భవనాన్నే ఉన్నపళంగా కదిలించాలనుకుంది.
పైగా ఆ భవనం బరువు సుమారు మూడు వేల టన్నుల బరువు. కదల్చడం అంత సులభమేమి కాదు. అందుకని చైనా ప్రభుత్వం భారీ యంత్రాల సాయంతో ఆ ప్రదేశం నుంచి ఆ భవనాన్ని కదిలించి మరో ప్రదేశంలో యథాతధంగా ఉంచింది. ఏదో బొమ్మ ఇల్లుని మార్చినట్లుగా సునాయాసంగా మార్చింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఒక చైనా మహిళ 'శతాబ్దాల నాటి ఇల్లు పరిగెడుతోంది' అనే క్యాప్షన్‌ని జోడించి మరీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
3,800-ton century-old building slowly "walking" in Shanghaipic.twitter.com/fCeTbKpR7M
— Zhang Meifang张美芳 (@CGMeifangZhang) July 10, 2022
(చదవండి: చెత్త బండిలో మోదీ, ఆదిత్యనాథ్ ఫోటోలు... ఉద్యోగం కోల్పోయిన మున్సిపాలిటీ ఉద్యోగి)
Comments
Please login to add a commentAdd a comment