వృద్ధురాల్ని చంపిన ఏనుగు   | Elephant Kills Old Woman In Karnataka | Sakshi
Sakshi News home page

వృద్ధురాల్ని చంపిన ఏనుగు  

Jul 11 2021 7:49 AM | Updated on Jul 11 2021 7:50 AM

Elephant Kills Old Woman In Karnataka - Sakshi

బంగారుపేట తాలూకా బూదికోట ఫిర్కా గుల్లహళ్లి గ్రామంలో ఏనుగు దాడిలో మహిళ మృతి చెందింది.

కేజీఎఫ్‌(కర్ణాటక): బంగారుపేట తాలూకా బూదికోట ఫిర్కా గుల్లహళ్లి గ్రామంలో ఏనుగు దాడిలో మహిళ మృతి చెందింది. గుల్లహళ్లి గ్రామానికి చెందిన సిద్దమ్మ (59) శనివారం తెల్లవారు జామున 5.30 గంటల సమయంలో గుల్లహళ్లి గ్రామం నుంచి పక్కలోనే ఉన్న గొడగుమందె గ్రామానికి తన మనవడిని చూడడానికి కాలినడకన బయల్దేరింది. మార్గమధ్యంలో అడవి ఏనుగు.. సిద్దమ్మపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.

ఎమ్మెల్యే ఎస్‌ఎన్‌ నారాయణస్వామి సిద్దమ్మ కుటుంబాన్ని పరామర్శించి అంత్య సంస్కారం కోసం కొంత సహాయ ధనం అందించారు. కాగా, గత కొద్ది నెలల కాలంగా బూదికోట ఫిర్కాలో మనుషులపై, పంటలపై ఏనుగుల దాడులు పెరిగాయి. ప్రజలు భయం నీడన జీవించాల్సి వస్తోంది. ఇంతవరకు తాలూకాలో ఏనుగుల దాడిలో 9 మంది మరణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement