
సాక్షి, బెంగళూరు: ఆహారం కోసం వచ్చిన ఏనుగులు కాఫీతోటల్లో ఏర్పాటు చేసిన కరెంట్ తీగ తగిలి మృతి చెందిన ఘటన కొడగు జిల్లా సిద్దాపుర సమీపంలో చోటుచేసుకుంది. తాలూకాలోని నెల్యహుదికేరి గ్రామానికి చెందిన కాఫీ రైతులు ప్రకాశ్ మందణ్ణ, మండపండ సుమంత్ చెంగప్పలు పంట రక్షణ కోసం తోటల చుట్టూ ఫెన్సింగ్ నిర్మించి కరెంట్ కనెక్షన్ ఇచ్చారు. ఆదివారం రాత్రి ఆహారం కోసం వచ్చిన ఏనుగులు తోటల్లోకి వెళ్లే ప్రయత్నంలో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే రెండు ఏనుగులు మృతి చెందాయి. మగ, ఆడ ఏనుగులుగా గుర్తించారు. ఇలా మూడు నెలల వ్యవధిలో పది ఏనుగులు బలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment