‘నాతో సెల్ఫీ మాములుగా ఉండదు’.. గజరాజు దెబ్బకు టూరిస్టుల పరుగో పరుగు | Watch: Elephant Chases Tourists In Bandipur National Park In Karnataka, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Video: ‘నాతో సెల్ఫీ అంటే మాములుగా ఉండదు’.. టూరిస్టులను వెంబడించిన గజరాజు

Published Fri, Feb 2 2024 11:49 AM | Last Updated on Fri, Feb 2 2024 1:33 PM

Video: Elephant chases Tourists in Bandipur National Park in Karnataka - Sakshi

బెంగళూరు: గజరాజుతో ఫోటో దిగుదామని ఆశించిన ఇద్దరు టూరిస్టులకు ఊహించని అనుభవం ఎదురైంది. ఏనుగు వారిని వెంబడించడంతో భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. చివరికిఏనుగు బారి నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన కర్ణాటకలోని చామరాజనగర్‌లో ముత్తుంగ అడవిలో జరిగింది,

కర్ణాటకు చెందిన కొందరు పర్యాటకులు బందీపూర్‌ నేషనల్‌ పార్క్‌, టైగర్‌ రిజర్వ్‌ మీదుగా కేరళ వెళ్తున్నారు. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా ముత్తుంగ సమీపంలో దారి మార్గంలో వారికి ఏనుగు కనిపించింది. దీంతో ఏనుగును సెల్ఫీ తీయాలనుకున్నారు. కారు దిగి బయటకు వచ్చి ఫోటోలు తీసేందుకు ప్రయత్నించగా.. గమనించిన ఏనుగు వారి వైపు వేగంగా దూసుకువచ్చింది. ఇద్దరు వ్యక్తులను వెంబడించింది.  

ఈ ఘటనలో తీవ్ర భయాందోళనకు గురైన టూరిస్టులు.. ప్రాణాలను అరచేతిలో పట్టుకొని పరుగులు తీశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి కిందపడిపోయాడు. అతన్ని కాలితో తన్నిన ఏనుగు.. వెనక్కి తిరిగి తన దారిన తాను వెళ్లిపోయింది. ఈ ఘటనలో సదరు వ్యక్తికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement