Bandipur forest
-
‘నాతో సెల్ఫీ మాములుగా ఉండదు’.. గజరాజు దెబ్బకు టూరిస్టుల పరుగో పరుగు
బెంగళూరు: గజరాజుతో ఫోటో దిగుదామని ఆశించిన ఇద్దరు టూరిస్టులకు ఊహించని అనుభవం ఎదురైంది. ఏనుగు వారిని వెంబడించడంతో భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. చివరికిఏనుగు బారి నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన కర్ణాటకలోని చామరాజనగర్‌లో ముత్తుంగ అడవిలో జరిగింది, కర్ణాటకు చెందిన కొందరు పర్యాటకులు బందీపూర్ నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్ మీదుగా కేరళ వెళ్తున్నారు. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా ముత్తుంగ సమీపంలో దారి మార్గంలో వారికి ఏనుగు కనిపించింది. దీంతో ఏనుగును సెల్ఫీ తీయాలనుకున్నారు. కారు దిగి బయటకు వచ్చి ఫోటోలు తీసేందుకు ప్రయత్నించగా.. గమనించిన ఏనుగు వారి వైపు వేగంగా దూసుకువచ్చింది. ఇద్దరు వ్యక్తులను వెంబడించింది. ఈ ఘటనలో తీవ్ర భయాందోళనకు గురైన టూరిస్టులు.. ప్రాణాలను అరచేతిలో పట్టుకొని పరుగులు తీశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి కిందపడిపోయాడు. అతన్ని కాలితో తన్నిన ఏనుగు.. వెనక్కి తిరిగి తన దారిన తాను వెళ్లిపోయింది. ఈ ఘటనలో సదరు వ్యక్తికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2 tourists were confronted by an elephant While traveling from #Karnataka to #Kerala through #Bandipur National Park & Tiger Reserve. #Elephant became aggressive when the tourists attempted to take a #selfie, chased them but fortunately, both managed to narrowly escape unharmed. pic.twitter.com/1uIzW7ITiY — Sagay Raj P || ಸಗಾಯ್ ರಾಜ್ ಪಿ (@sagayrajp) February 1, 2024 -
బందీపూర్ టైగర్ రిజర్వ్ పర్యటనలో మోదీ.. వీడియో వైరల్
బెంగళూరు: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కర్నాటకలో ఉన్నారు. అయితే, దేశంలో ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవం సందర్బంగా కర్నాటకలోని బందీపూర్ నేషనల్ పార్క్‌ను సందర్శనకు బయలుదేరారు. ఇక, తాను బందీపూర్లో పర్యటించనున్నట్టు శనివారమే తెలిపారు. అయితే, ప్రధాని మోదీ ఆదివారం ఉదయం బందీపూర్ టైగర్ రిజర్వ్ చేరుకున్నారు. ముందుగా ఆయన ఓపెన్ టాప్ జీపులో టైగర్ సఫారీ కోసం వెళ్లారు. కాగా, మోదీ.. టైగర్ రిజర్వ్‌లో దాదాపు 20 కిలోమీటర్లు దూరం ప్రయాణించనున్నారు. ఈ సందర్భంగా పులల ఆవాసాలు, ఏనుగుల శిబిరాలను సందర్శించనున్నారు. అనంతరం.. దేశంలో పులుల సంఖ్యకు సంబంధించిన గణాంకాలను విడుదల చేయనున్నారు. 2022 లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశంలో 2967 పులులు ఉన్నాయి. ఇక, మోదీ సఫారీకి వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉండగా.. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక దేశంలో వన్యమృగాల సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఫలితంగా దేశంలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. #WATCH | Prime Minister Narendra Modi arrives at Bandipur Tiger Reserve in Karnataka pic.twitter.com/Gvr7xpZzug — ANI (@ANI) April 9, 2023 -
జాడలేని తల్లి.. పాపం పులి కూనలు..
సాక్షి, మైసూరు: మైసూరు జిల్లాలోని బండీపుర అరణ్యంలో తల్లి లేని మూడు పెద్ద పులి పిల్లల్లో రెండు మృత్యువాత పడిన విషాదం వెలుగుచూసింది. బండీపుర అభయారణ్యంలో సోమవారం గస్తీలోనున్న అటవీ సిబ్బందికి పొదల్లో సుమారు నెలన్నర వయసున్న మూడు పులి కూనలు కనిపించాయి. దగ్గరకు వెళ్లి చూడగా వాటిలో ఒకటి చనిపోయినట్లు గుర్తించారు. మరో రెండు తీవ్ర ఆకలితో మృత్యువుకు చేరువగా ఉన్నాయి. ఏ కారణం వల్లనో తల్లిపులి వాటిని వదిలేసి వెళ్లడంతో రోజుల తరబడి పాలు, పోషణ కరువైనట్లు అధికారులు తెలిపారు. జీవించి ఉన్న పులి కూనలను హుటాహుటిన మైసూరు జూకు తెస్తుండగా మరొకటి కూడా చనిపోయింది. బతికి ఉన్న ఏకైక కూనకు ఆహారం అందించి చికిత్స చేపట్టారు. చనిపోయినవాటికి పోస్టుమార్టం నిర్వహించగా ఆహారం లేకపోవడమే మృతికి కారణమని తేలిందని అధికారులు చెప్పారు. తల్లి పులి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. బావిలో పడ్డ పంగోలిన్ మరో ఘటనలో మైసూరు జిల్లా హుణసూరు తాలూకాలోని చిక్కాడనహళ్ళి గ్రామంలో ఓ బావిలో అరుదైన పంగోలిన్ దర్శనమిచ్చింది. బావిలో పడిన అలుగు బయటకు రాలేకపోయింది. గ్రామస్తులు గమనించి దానిని బయటకు తీసి అటవీ సిబ్బందికి అప్పగించారు. సాధారణ పంగోలిన్లు బూడిద, నలుగు రంగులో ఉంటాయి. ఇది నారింజ రంగులో ఉండడం విశేషమని తెలిపారు. -
వైరల్ ఫొటోలో ఏముందో గుర్తించడమే అదృష్టం!
సాధారణంగా కొన్ని ఫొటోల్లో ఏం దాగుందో చెప్పడం కొంత కష్టంగానే అనిపిస్తుంది. ఒక పజిల్ రూపంలో ఉన్న ఫొటోలో ఏం కనిపిస్తోందని ఎవరైనా అడిగితే మన కంటికి కాస్త పని చెప్పాల్సిందే. ఇక అంటువంటి ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాగర్ డామ్లే అనే ఓ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ తాను తీసిన రెండు ఫొటోలను ట్విటర్లో షేర్ చేశారు. ఆయన పోస్ట్ చేసిన మొదటి ఫొటోను చూస్తే ముందుగా అడవిలో ఉన్న దట్టమైన పొదలు కనిపిస్తాయి. కానీ, అలానే నిశితంగా పరిశీలిస్తే పొదల్లో దాక్కొని ఉనక్న ఓ జంతువు శరీరంపై చారలు ఉన్నట్లు గమనించవచ్చు. దాన్ని స్పష్టంగా గుర్తించాలంటే మాత్రం కొంత కష్టపడాల్సిందే. అప్పుడే మాత్రమే ఆ పొదల్లో కనిపిస్తున్న జంతువు టైగర్ అని తెలుస్తుంది. ‘మొదటి ఫొటో సాధరణమైంది. రెండోది నైపుణ్యంతో నా కెమెరాలో బంధించింది. రెండు ఫొటోల్లోనూ ఆ బెంగాల్ టైగర్ మిమ్మల్ని చూస్తూనే ఉంటుంది. మీరు పులిని చూశారా? లేదా? అనేది మీ అదృష్టం’ అని సాగర్ డామ్లే కాప్షన్ జతచేశారు. ఈ చిత్రాన్ని ఆయన కర్ణాటకలోని బందిపూర్ టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో తీసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం సాగర్ షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, పలువురు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘పులులు చుట్టు పక్కల ఉన్నాయని గుర్తించినప్పుడు మాత్రమే వాటిని చూడగలం’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. రెండు వేర్వేరు యాంగిల్స్‌లో ఉన్న ఫొటోలను ఎలా తీశారు’, ‘కొన్ని జంతువులు ఆడవిలో మనల్ని ఎక్కడి నుంచైనా చూడగలవు’ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. -
మ్యాన్ వర్సెస్ వైల్డ్‌లో రజనీకాంత్
-
పాపం ‘ప్రిన్స్’
► అరణ్య భవన్ వద్ద నిరసన తెలుపుతున్న వన్యప్రేమికులు బెంగళూరు: ఇటీవల బండీపుర అడవుల్లో అనుమానాస్పదంగా మృతి చెందిన పులి ప్రిన్స్ ముఖ భాగాలు అదే అటవీ ప్రాంతంలో లభించడంపై పులి మృతిపై ఉన్నతస్థాయి విచారణ చేయాలని డిమాండ్లు తీవ్రమవుతున్నాయి. బండీపుర నేషనల్ పార్క్‌లోని కుందకెరె అటవీ ప్రాంతంలో ప్రిన్స్‌గా పిలుచుకునే పులి మృతదేహం లభించింది. మృతదేహాన్ని పరిశీలించిన అటవీ అధికారులు పులి పిడుగుపాటుకు మృతి చెంది ఉంటుందని అంతిమ సంస్కారం చేశారు. అయితే ఇది జరిగిన కొద్ది రోజులకే కొందరు వేటగాళ్లు పులి దవడ ఎముకలు, కోరలు, పళ్లు అపహరించుకుని పోయినట్లు గుర్తించారు. అటవీ ప్రాంతంలో లభించిన పులి ముఖ భాగాన్ని పరిశీలించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్ ప్రయోగశాలకు పంపించినట్లు పశువైద్యుడు నాగరాజు తెలిపారు. ఇదిలా ఉంటే అనుమానాస్పద మృతిపై విచారణ చేయాలని వన్యప్రేమికులు ఆదివారం బెంగళూరు అటవీ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. సహజ మరణం :‘సహజంగానే మృతి చెందిన పులిని గమనించిన కొందరు వేటగాళ్లు ఆయుధాలతో పులి ముఖభాగాన్ని వేరు చేసి దవడ ఎముకలు, కోరలు, పళ్లను అపహరించారు. వారి కోసం గాలిస్తున్నాం’ –ఏ.టీ.పూవయ్య, అసిస్టెంట్ ఫారెస్ట్ ఆఫీసర్, గుండ్లుపేట -
కర్ణాటక అడవుల్లో ముగ్గురిని చంపేసిన పులులు
దక్షిణ కర్ణాటకలోని బండిపూర్ అడవుల్లో రెండు పులులు ముగ్గురు వ్యక్తులను చంపేశాయి. టి.సురేష్ (27) అనే ఫారెస్ట్ వాచర్ మెడ మీద పంజా గుర్తులతో చనిపోయి కనిపించాడని ఫారెస్ట్ రేంజి ఆఫీసర్ లోకేష్ మూర్తి తెలిపారు. ఓ గ్రామస్థుడు, మరో గిరిజనుడు కూడా మరో పులి చేతిలో బండిపూర్ రిజర్వు ఫారెస్టు ప్రాంతంలో మరణించారు. వాళ్లు పెంచుకుంటున్న పశువులను తినేందుకు ఆ పులి శుక్రవారం నాడు వాళ్ల ప్రాంతంలోకి వెళ్లిందని, అప్పుడే చెలువ (40) అనే గ్రామస్థుడు, బస్వరాజు (45) అనే గిరిజనుడు వాటి చేతిలో మరణించారని, వాళ్ల తలల మీద, శరీరాల మీద తీవ్రంగా గాయపడిన గుర్తులున్నాయని అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ బెల్లియప్ప చెప్పారు. వాస్తవానికి రెండు అడవుల మధ్య 120 కిలోమీటర్ల మేర ఫారెస్టు గార్డులు ఉచ్చులు ఏర్పాటుచేశారు. అయితే ఇంతవరకు మనుషులను చంపుతున్న పులలు ఏవన్న విషయం మాత్రం తెలియరాలేదు. సురేష్‌ను చంపిన తర్వాత అతడి మృతదేహాన్ని పులి కొద్దిదూరం లాక్కెళ్లి అక్కడ వదిలేసింది. క్యాంపులో అతడు కనిపించకపోయేసరికి ఇతర గార్డులు వెతకగా, మృతదేహం దొరికింది. అడవిలో కట్టెలు తెచ్చుకోడానికి అతడు వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. పులుల జనాభా పెరిగినప్పుడు ఏ ప్రాంతంలో ఏవి వేటాడాలన్న విషయమై వాటిమధ్య పోరాటం జరుగుతుందని, సగటున 100 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో 12 పులులు మాత్రమే సంచరిస్తాయని నిపుణులు చెబుతున్నారు.