
బెంగళూరు: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కర్నాటకలో ఉన్నారు. అయితే, దేశంలో ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవం సందర్బంగా కర్నాటకలోని బందీపూర్ నేషనల్ పార్క్‌ను సందర్శనకు బయలుదేరారు. ఇక, తాను బందీపూర్‌లో పర్యటించనున్నట్టు శనివారమే తెలిపారు.
అయితే, ప్రధాని మోదీ ఆదివారం ఉదయం బందీపూర్ టైగర్ రిజర్వ్ చేరుకున్నారు. ముందుగా ఆయన ఓపెన్ టాప్ జీపులో టైగర్ సఫారీ కోసం వెళ్లారు. కాగా, మోదీ.. టైగర్ రిజర్వ్‌లో దాదాపు 20 కిలోమీటర్లు దూరం ప్రయాణించనున్నారు. ఈ సందర్భంగా పులల ఆవాసాలు, ఏనుగుల శిబిరాలను సందర్శించనున్నారు. అనంతరం..
దేశంలో పులుల సంఖ్యకు సంబంధించిన గణాంకాలను విడుదల చేయనున్నారు. 2022 లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశంలో 2967 పులులు ఉన్నాయి. ఇక, మోదీ సఫారీకి వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇదిలా ఉండగా.. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక దేశంలో వన్యమృగాల సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఫలితంగా దేశంలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
#WATCH | Prime Minister Narendra Modi arrives at Bandipur Tiger Reserve in Karnataka pic.twitter.com/Gvr7xpZzug
— ANI (@ANI) April 9, 2023