Tiger Census
-
బందీపూర్ టైగర్ రిజర్వ్ పర్యటనలో మోదీ.. వీడియో వైరల్
బెంగళూరు: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కర్నాటకలో ఉన్నారు. అయితే, దేశంలో ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవం సందర్బంగా కర్నాటకలోని బందీపూర్ నేషనల్ పార్క్‌ను సందర్శనకు బయలుదేరారు. ఇక, తాను బందీపూర్లో పర్యటించనున్నట్టు శనివారమే తెలిపారు. అయితే, ప్రధాని మోదీ ఆదివారం ఉదయం బందీపూర్ టైగర్ రిజర్వ్ చేరుకున్నారు. ముందుగా ఆయన ఓపెన్ టాప్ జీపులో టైగర్ సఫారీ కోసం వెళ్లారు. కాగా, మోదీ.. టైగర్ రిజర్వ్‌లో దాదాపు 20 కిలోమీటర్లు దూరం ప్రయాణించనున్నారు. ఈ సందర్భంగా పులల ఆవాసాలు, ఏనుగుల శిబిరాలను సందర్శించనున్నారు. అనంతరం.. దేశంలో పులుల సంఖ్యకు సంబంధించిన గణాంకాలను విడుదల చేయనున్నారు. 2022 లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశంలో 2967 పులులు ఉన్నాయి. ఇక, మోదీ సఫారీకి వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉండగా.. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక దేశంలో వన్యమృగాల సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఫలితంగా దేశంలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. #WATCH | Prime Minister Narendra Modi arrives at Bandipur Tiger Reserve in Karnataka pic.twitter.com/Gvr7xpZzug — ANI (@ANI) April 9, 2023 -
పులులు లేవంట..!
పులి జాడ విశాఖ వనాల్లో కనిపించలేదు. పులుల మనుగడని కనిపెట్టేందుకు నిర్వహించిన వన్యప్రాణుల గణనలో ఈ విషయం స్పష్టమైంది. అయితే పలు అటవీ ప్రాంతాల్లో చిరుతపులులు సంచరించినట్లు కెమెరాల్లో నిక్షిప్తమైంది. ఉమ్మడి విశాఖ అభయారణ్యాల్లో ఏఏ జంతువులు ఎంత మేర ఉన్నాయనే లెక్క తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మొత్తం ఫుటేజీని శ్రీశైలంలోని బయోలాజికల్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు పంపించారు. అక్కడి నుంచి వచ్చే తుది నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ దేశవ్యాప్తంగా టైగర్ సెన్సస్ నిర్వహించింది. ఇందులో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో అటవీ శాఖ అధికారులు నెల రోజులపాటు వన్యప్రాణుల గణనలో పాల్గొన్నారు. ఏప్రిల్ నెలాఖరు వరకూ సేకరించిన సీసీ ఫుటేజీ వివరాలను శ్రీశైలంలోని బయోలాజికల్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు పంపించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అడవుల్లో 40 పాయింట్లను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మొత్తం 80 అత్యా«ధునిక కెమెరాలు అమర్చారు. పులులతో పాటు చిరుతపులులు, ఇతర జంతువుల కదలికల్ని గణించేందుకు కెమెరాలు పెట్టారు. పగటిపూట, రాత్రి సమయంలోనూ స్పష్టంగా క్యాప్చర్ చేసే ఇన్ఫ్రారెడ్ సెన్సార్ ఉన్న కెమెరాలను వినియోగించారు. వన్యప్రాణులు సంచరించే ప్రదేశాల్లో ఎదురెదురుగా ఉన్న చెట్లకు అమర్చారు. ఇవన్నీ 24 గంటలూ వాటంతట అవే పనిచేస్తాయి. చీకట్లో అయితే ఫ్లాష్ ఉపయోగించుకుంటాయి. జంతువులు కదలికలు, ఉష్ణోగ్రతల ఆధారంగా కెమెరాలు సమాచారాన్ని నిక్షిప్తం చేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో చిరుతలున్నాయి వన్యప్రాణులు, పులుల గణనలో కంబాలకొండతో పాటు నర్సీపట్నం, అరకు, పాడేరు అటవీ ప్రాంతాల్లో విభిన్న రకాలైన జంతుజాలాన్ని గుర్తించారు. ఎక్కడా పులుల ఆనవాళ్లు కనిపించలేదుగానీ.. పలు అటవీ ప్రాంతాల్లో చిరుతపులులు సంచరించినట్లు కెమెరాల్లో నిక్షిప్తమైంది. వీటితో పాటు కంబాలకొండ, ఇతర అటవీ ప్రాంతాల్లో చుక్కలదుప్పి, తోడేళ్లు, సాంబార్, నీల్గాయి, అడవిపందులు, కుందేళ్లు, కృష్ణజింకలు, కొండగొర్రెతో పాటు విభిన్న రకాల జంతువులున్నాయని ప్రాథమికంగా గుర్తించారు. వీటితో పాటు ప్లమ్ హెడెడ్ పారాకీట్ (గుండు రామచిలుక), వైట్ బెల్లీడ్ సీ ఈగల్ (సముద్రపు గద్ద), ఆరెంజ్ బ్రెస్టెడ్ గ్రీన్ పీజియన్ (పచ్చగువ్వ), బ్రౌన్ ఫిష్ ఔల్ (జీలుగు, గోధుమ చేప గుడ్లగూబలు), పెయింటెడ్ స్పర్ఫ్ ఔల్స్ (తొగరుకోళ్లు)తోపాటు నైట్ జార్లు, పిచ్చుకలు తదితర జీవజాలం ఉన్నట్లు సర్వేలో స్పష్టమైంది. -
Tiger Census 2021: నేటి నుంచి పులుల గణన
పెద్దదోర్నాల: ఆలిండియా టైగర్ ఎస్టిమేషన్లో భాగంగా అటవీ శాఖాధికారులు ఈ నెల 28 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు పులుల గణన నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా పులి సంరక్షణ కేంద్రాలు 50 ఉండగా, వాటిలో నల్లమలలోని నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అతి పెద్ద అభయారణ్యంగా గుర్తింపు పొందింది. గతేడాది నిర్వహించిన గణనలో ఇక్కడ 63 పులులు ఉన్నట్లు తేలింది. ఈ సారి ఆ సంఖ్య పెరిగి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో, తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో నల్లమల విస్తరించింది. ఈ అటవీ ప్రాంతంలోని సిబ్బందికి ఇప్పటికే పులుల గణనపై శిక్షణ తరగతులు నిర్వహించి సంసిద్ధం చేశారు. ఈ సారి పులుల గణనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. గతంలో వాటి పాదముద్రల ఆధారంగా గణన జరిగేది. అరణ్యంలోని పలు ప్రాంతాల్లో అవి సంచరిస్తుండటంతో ఖచ్చితమైన సంఖ్య తేలేది కాదు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. పులి సంచారం ఉన్న ప్రాంతాల్లో కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేశారు. వాటి నుంచి వెలువడే ఆల్ఫ్రారెడ్ బీమ్ పరిధిలోకి జంతువు రాగానే కెమెరా చిత్రీకరిస్తుంది. దీంతో పాటు కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఎకోలాజికల్ యాప్‌ను ఉపయోగించి వన్యప్రాణుల వివరాలు సేకరిస్తున్నారు. నూతన శాస్త్రీయ పరిజ్ఞానంతో పాటు పులుల పాదముద్రలు, మలము, చెట్ల మొదళ్లపై పులుల గోళ్ల రక్కులకు సంబంధించిన ఆనవాళ్లను సైతం పరిగణనలోకి తీసుకుని పులుల గణనను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. -
జంతు గణన ప్రారంభం
వేమనపల్లి : వేమనపల్లి, ఒడ్డుగూడెం అటవీ సెక్షన్ పరిధుల్లో సోమవారం నుంచి మాంసాహార వన్యప్రాణుల జంతు గణన ప్రారంభమైంది. కుశ్నపల్లి అటవీ రేంజ్ అధికారి అప్పలకొండ నేతృత్వంలో సెక్షన్ అధికారులు జ్ఞానేశ్వర్, మధూకర్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. వేమనపల్లి సెక్షన్ 3 అటవీబీట్‌లు, ఒడ్డుగూడెం 4 బీట్లలోని 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏయే జంతువులు సంచరించాయనే కోణంలో వివరాలు తెలుసుకున్నారు. వాటి పాదముద్రలు, పెంటికలు, మూత్ర విసర్జన చేసిన చోటును పరిశీలించారు. చిరుతపులి, తోడేళ్లు, నక్కలు, అడవికుక్కల ఆనవాళ్లు లభ్యమవుతున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. మూడు రోజుల పాటు మాంసాహార జంతువుల గణన చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. గణనలో బీట్ అధికారులు అనిల్, మధూకర్, బేస్ క్యాంప్, స్ట్రైకింగ్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. దేవాపూర్ రేంజ్ పరిధిలో.. కాసిపేట : మండలంలోని దేవాపూర్ అటవీ రేంజ్ పరిధిలోనూ జంతు గణన ప్రారంభమైంది. సెక్షన్ అధికారి ప్రమోద్‌కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన గణనలో చిరుతపులి అడుగులు గుర్తించినట్లు తెలిపారు. అడుగులను పెగ్‌మార్క్ చేసి పీవోపీ తీసినట్లు పేర్కొన్నారు. గణనను రేంజ్ అధికారి అనిత పర్యవేక్షించారు. గఢ్‌పూర్ ఎఫ్ఎస్వో అస్మా, బీట్ అధికారులు, అటవీ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. నెన్నెల: జంతు గణనలో భాగంగా మండలంలోని రంగపేట బీట్ పరిధిలో నర్సరీ వెనకాల పులి అడుగులు గుర్తించినట్లు కుశ్నపల్లి రేంజర్ అప్పలకొండ తెలిపారు. కుశ్నపల్లి రేంజ్ పరిధిలో బృందాలుగా ఏర్పడి జంతు గణన చేపట్టారు. చెక్‌డ్యాంలు, చెరువులు, నీటి వనరులు, వాగుల వద్ద జంతువులకు సంబంధించిన పాదముద్రలను, పెంట ఆధారాలను సేకరించినట్లు రేంజర్ వెల్లడించారు. మొదటి రోజు సర్వేలో డిప్యూటీ రేంజర్ రమాదేవి, సెక్షన్ అధికారులు పాటేకర్, గౌరి శంకర్, మల్లయ్య, జ్ఞానేశ్వర్, బీట్ అధికారులు కామరాజు, రమేశ్, అశోక్, స్ట్రైక్‌ఫోర్స్, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు. -
నల్లమలలో పులులు ఎన్నున్నాయో?
శ్రీశైలం ప్రాజెక్టు: నాగార్జునసాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాజెక్టు పరిధిలో శుక్రవారం నుంచి పులుల లెక్కింపు ప్రారంభించినట్లు అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఖాదర్ వలీ తెలిపారు. శుక్రవారం నుంచి ఈ నెల 14 వరకు లెక్కింపు ఉంటుందన్నారు. నల్గొండ, మహబూబ్‌నగర్, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో విస్తరించి ఉన్న టైగర్ రిజర్వు ఫారెస్ట్ పరిధిలో లెక్కింపును చేపట్టామన్నారు. శాస్త్రీయ పద్ధతిలో లెక్కింపు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.శ్రీశైలం టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో పులులు ఎన్ని ఉన్నాయనేది లెక్కింపు తర్వాత తెలుస్తోంది. పులుల సంఖ్యపై జంతు ప్రేమికులు ఆసక్తి కనబరుస్తున్నారు.