టోక్యో: జపాన్‌లో ఇటీవల సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదం మిగిలి్చంది. వంద మందికిపైగా జనం మరణించారు. వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శిథిలాలను తొలగిస్తున్నారు. 90 ఏళ్లకుపైగా వయసున్న ఓ వృద్ధురాలు శిథిలాల నుంచి ప్రాణాలతో క్షేమంగా బయటపడడం ఆశ్చర్యం కలిగింది.
ఇషికావా జిల్లాలోని సుజు సిటీలో భూకంపం వల్ల కూలిపోయిన రెండంతస్తుల భవన శిథిలాలను తొలగిస్తుండగా ఆదివారం సాయంత్రం ఈ వృద్ధురాలు బయటకు వచి్చంది. ఆహారం, నీరు లేక బలహీనంగా మారిన బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించి, చికిత్స ప్రారంభించారు. ఏకంగా 124 గంటలపాటు ఆమె ఈ శిథిలాల కిందే ఉండిపోయింది. బాధితురాలి ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, మాట్లాడగలుతోందని, ఆమె కాళ్లకు గాయాలయ్యాయని వైద్యులు చెప్పారు. జపాన్‌లో ఆరు రోజుల క్రితం సంభవించిన భూకంపంలో కనీసం 126 మంది మృత్యువాతపడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment