టోక్యో: జపాన్ దక్షిణ తీర ప్రాంతంలో గురువారం శక్తివంతమైన భూకంపం సంభవించింది. క్యుషు దీవిలో ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది. భూమికి సుమారు 30 కిలోమీటర్ల అడుగున భూకంప కేంద్రం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిచినన్ నగరంతోపాటు మియజాకి ప్రిఫెక్చర్ తీవ్ర ప్రభావానికి గురైంది.
భూకంప కేంద్రానికి సమీపంలోని మియజాకి విమానాశ్రయంలో భవనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ముందు జాగ్రత్తగా అధికారులు రన్‌వేను మూసివేశారు. పొరుగునే ఉన్న కగోíÙయా ప్రిఫెక్చర్‌లోని ఒసాకిలో కాంక్రీట్ గోడలు ధ్వంసమయ్యాయి. క్యుషు, షికోకు దీవుల తీరం వెంబడి అలలు సుమారు 1.6 అడుగుల ఎత్తున సుమారు అరగంటసేపు ఎగిసిపడ్డాయి. దీంతో, అధికారులు ముందు జాగ్రత్తగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీరప్రాంతాల వైపు వెళ్లరాదని ప్రజలకు సూచనలిచ్చారు. భూకంపం తాకిడితో ముగ్గురు గాయపడినట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment