south coast
-
రేపు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు భారీ వర్ష సూచన
-
‘ఫెంగల్’ దోబూచులాట!
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి/సూళ్లూరుపేట రూరల్: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను దాగుడుమూతలాడుతోంది. దీన్ని ట్రాక్ చేసేందుకు వాతావరణ శాఖ అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇది బుధవారం సాయంత్రం నాటికి తీవ్ర వాయుగుండం నుంచి తుపానుగా మారినట్లే మారి కాస్తా బలహీనపడిపోయింది. దీంతో ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోంది. మళ్లీ తుపానుగా బలపడే అవకాశాలున్నా.. ఎప్పుడనే దానిపై అంచనా వేయడం కష్టతరంగా మారుతోంది. తుపాను వ్యతిరేక శక్తిలా పనిచేస్తున్న బలమైన గాలులతో కూడిన షియర్ జోన్.. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతుండటమే దీనికి కారణమని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. తుపానుకు వ్యతిరేక దిశలో ఇది కొనసాగుతుండటంవల్ల.. 48 గంటలు గడిచినా తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోందని.. ఈ కారణంగానే ఫెంగల్ ముందుకు కదల్లేకపోతోందని వారు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు.. ఈ తీవ్ర వాయుగుండం గంటకు కేవలం 10 కిమీ వేగంతో నెమ్మదిగా కదులుతూ స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఇది ట్రింకోమలికి 200 కిమీ, పుదుచ్ఛేరికి ఆగ్నేయంగా 410 కిమీ, చెన్నైకి దక్షిణాగ్నేయంలో 470 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తీవ్ర వాయుగుండం శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా సముద్రంలోనే బలహీనపడనుందని అధికారులు చెబుతున్నారు. అనంతరం.. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతున్న క్రమంలో.. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలైన కరైకల్, మహాబలిపురం మధ్య 30వ తేదీ ఉదయం తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 50–60 కిమీ.. గరిష్టంగా 70 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. ఒకవేళ తుపానుగా బలపడితే మాత్రం గంటకు 65–75 కిమీ.. గరిష్టంగా 85 కిమీ వేగంతో గాలులు వీచే సూచనలు కనిపిస్తున్నాయని.. సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.నేటి నుంచి వర్షాలు..ఇక దీని ప్రభావంతో రాష్ట్రంలో నేటి నుంచి వర్షాలు జోరందుకోనున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని అధికారులు తెలిపారు. అలాగే 30 నుంచి డిసెంబరు 2 వరకూ కోస్తాంధ్ర అంతటా విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరోవైపు.. ఈఓఎస్–06, ఇన్శాట్–3డీఆర్ ఉపగ్రహాల సహాయంతో ఫెంగల్ తుపాను కదులుతున్న తీరుపై ఇస్రో అధికారులు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు. -
నేడు వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది ఆదివారం రాత్రి తీవ్ర అల్పపీడనంగా మారి పశ్చిమ–వాయవ్య దిశగా పయనించడం ప్రారంభించింది. క్రమంగా బలపడుతూ దక్షిణ బంగాళాఖాతంలో సోమవారం వాయుగుండంగా మారనుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. అనంతరం వాయవ్య దిశగా కదులుతూ 27 సాయంత్రానికి తమిళనాడు–శ్రీలంక తీరాలు వైపు వెళ్లనుందనీ.. శ్రీలంక సమీపంలో తీరం దాటే సూచనలు ఉన్నాయని వెల్లడించారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో సోమవారం నుంచి ఒకట్రెండుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. ఈ నెల 27నుంచి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలకు కూడా ఆస్కారం ఉందన్నారు. రాయలసీమ జిల్లాలో చెదురుమదురు వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా తీరప్రాంతంలో బలమైన గాలుల ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉందనీ.. తీరం వెంబడి గంటకు 35 నుంచి 50 కి.మీ వేగం.. గరిష్టంగా 65 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని 29వ తేదీ వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. -
25న వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం: ఓవైపు చలిగాలులు ప్రారంభమైన తరుణంలో... భారీ వర్షాలు మరోసారి విరుచుకుపడనున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల మీదుగా గురువారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో 23 నాటికి అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అనంతరం.. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ, 25 నాటికి మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని వెల్లడించారు. క్రమంగా.. ఇది దక్షిణకోస్తా మీదుగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందనీ.. లేదంటే.. దక్షిణ కోస్తాంధ్రలోనే తీరం దాటే సూచనలు కూడా ఉన్నాయని వివరించారు. దీని ప్రభావంతో 25 నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. 23 నుంచి తీరం అల్లకల్లోలంగా ఉంటుందని, తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులు 23 నుంచి 27 వరకూ వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. -
జపాన్ను కుదిపేసిన తీవ్ర భూకంపం
టోక్యో: జపాన్ దక్షిణ తీర ప్రాంతంలో గురువారం శక్తివంతమైన భూకంపం సంభవించింది. క్యుషు దీవిలో ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది. భూమికి సుమారు 30 కిలోమీటర్ల అడుగున భూకంప కేంద్రం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిచినన్ నగరంతోపాటు మియజాకి ప్రిఫెక్చర్ తీవ్ర ప్రభావానికి గురైంది. భూకంప కేంద్రానికి సమీపంలోని మియజాకి విమానాశ్రయంలో భవనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ముందు జాగ్రత్తగా అధికారులు రన్‌వేను మూసివేశారు. పొరుగునే ఉన్న కగోíÙయా ప్రిఫెక్చర్‌లోని ఒసాకిలో కాంక్రీట్ గోడలు ధ్వంసమయ్యాయి. క్యుషు, షికోకు దీవుల తీరం వెంబడి అలలు సుమారు 1.6 అడుగుల ఎత్తున సుమారు అరగంటసేపు ఎగిసిపడ్డాయి. దీంతో, అధికారులు ముందు జాగ్రత్తగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీరప్రాంతాల వైపు వెళ్లరాదని ప్రజలకు సూచనలిచ్చారు. భూకంపం తాకిడితో ముగ్గురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. -
నేడు వాయుగుండం.. రేపటికి తీవ్రం
సాక్షి, విశాఖపట్నం/వాకాడు: ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్, నికోబార్ దీవులకు ఆనుకుని మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ బుధవారం నాటికి వాయుగుండంగా మారనుంది. ఆపై వాయవ్య దిశగా పయనిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి కాస్త దూరంలో గురువారం నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం రాత్రి నివేదికలో వెల్లడించింది. అనంతరం ఉత్తర, ఈశాన్య దిశగా మలుపు తిరిగి 17వ తేదీకి ఒడిశా తీరానికి చేరుకుంటుందని తెలిపింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఆవర్తనం నుంచి అల్పపీడనం ప్రాంతం వరకు మరో ద్రోణి విస్తరించి ఉంది. వీటి ఫలితంగా బుధ, గురువారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, బుధవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో ఉరుములు, మెరుపులు సంభవించి.. పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని, ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రానున్న రెండు రోజులు గంటకు 40–50 కి.మీ.లు, గరిష్టంగా 60 కి.మీ.ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. -
బంగాళాఖాతంలో అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్–ఒడిశా తీరాలకు ఆనుకుని మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కి.మీల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం గురువారంకి పశ్చిమ, వాయవ్య దిశలో ఉత్తర ఒడిశా, దక్షిణ జార్ఖండ్ మీదుగా పయనిస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రుతుపవన ద్రోణి రాజస్థాన్ నుంచి ప్రస్తుత అల్పపీడన ప్రాంతం వరకు తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా వెళ్తోంది. వీటి ప్రభావంతో రానున్న 3 రోజులు ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. ఉత్తర కోస్తాలో బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. వచ్చే మూడు రోజులు పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గంటకు 45–55, గరిష్టంగా 65 కి.మీల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది. -
కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి స్థిరంగా కొనసాగుతోంది. ఒడిశా, చత్తీస్‌గఢ్ వైపు కదులుతూ రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీనికి నైరుతి రుతు పవన ద్రోణి కూడా తోడైంది. వీటి ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిస్తాయని తెలిపింది. మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాంధ్రలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. పలుచోట్ల భారీ వర్షాలు అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. అల్లూరి జిల్లా చింతపల్లిలో 9.5 సెంటీమీటర్ల వర్షం పడింది. శ్రీకాకుళం జిల్లా హిర మండలంలో 7.5 సెంటీమీటర్లు, అల్లూరి జిల్లా ముంచంగిపుట్టులో 7.4, నంద్యాల జిల్లా వెలుగోడులో 7, ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో 6.2, శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో 5.7, అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో 5, నంద్యాల జిల్లా ఆత్మకూరులో 4.7, శ్రీశైలంలో 4.6 సెంటీమీటర్ల వర్షం పడింది. -
రైళ్ల రద్దు బాట
సాక్షి, అమరావతి: ఉత్తర భారతదేశంలో ప్రతికూల వాతావరణంతోపాటు కోవిడ్ విజృంభణతో రైల్వే శాఖ పెద్దసంఖ్యలో రైళ్లను రద్దుచేస్తోంది. అవకాశం ఉన్నంతవరకు రైళ్లలో అదనపు బోగీలను కూడా అందుబాటులోకి తెస్తోంది. రైల్వేశాఖ మంగళవా రం దాదాపు 350 రైళ్లను రద్దుచేసింది. ఇక బుధవా రం దాదాపు 400 రైళ్లను రద్దుచేస్తున్నట్టు ప్రకటిం చింది. గురువారం బయల్దేరాల్సిన 282 రైళ్లను పూర్తిగా, 35 రైళ్లను పాక్షికంగా అంటే మొత్తం మీద 317 రైళ్లను రద్దుచేయాలని నిర్ణయించింది. వాటిలో అత్యధిక రైళ్లు ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవే. దక్షి ణాదిలో తమిళనాడు, కర్ణాటకతోపాటు తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తరాదికి వెళ్లాల్సిన రైళ్లు కూడా కొన్ని ఉన్నాయి. ఇక గుజరాత్లో పర్యాటక ప్రదేశా ల సందర్శన కోసం విజయవాడ నుంచి ఈ నెల 21న బయలుదేరాల్సిన ‘వైబ్రంట్ గుజరాత్’ రైలు ను ఐఆర్సీటీసీ రద్దుచేసింది. 850 సీట్లకుగాను ఇప్పటికే దాదాపు 680 సీట్లను ప్రయాణికులు బుక్ చేసుకున్నారు. ప్రస్తుతం కరోనా ఉధృతమైన దృష్ట్యా వైబ్రంట్ గుజరాత్ రైలును రద్దు చేశారు. మరోవైపు ప్రయాణికుల సౌలభ్యం దృష్ట్యా దక్షిణమధ్య రైల్వే కొన్ని రైళ్లలో అదనపు బోగీలను ఏర్పాటు చేస్తోంది. 10 రైళ్లలో శాశ్వత ప్రాతిపదికన రెండు రైళ్లలో తాత్కాలిక ప్రాతిపదికన అదనపు బోగీలను అందుబాటులోకి తెచ్చామని దక్షిణ మధ్య రైల్వే బుధవారం ప్రకటించింది. -
‘జోన్’ పట్టాలెక్కించండి
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలను త్వరితగతిన ప్రారంభించాలని వైఎస్సార్ సీపీ ఎంపీలు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు విజ్ఞప్తి చేశారు. గురువారం పార్లమెంట్‌లోని రైల్వే మంత్రి కార్యాలయంలో వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి నేతృత్వంలో పార్టీ ఎంపీలు కేంద్రమంత్రితో సమావేశమయ్యారు. ఎంపీల బృందంలో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, మార్గాని భరత్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, బీవీ సత్యవతి, గొడ్డేటి మాధవి, చింతా అనూరాధ ఉన్నారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల అమలు వేగవంతం చేయాలని కోరుతూ ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు. ► ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించి రెండేళ్లు దాటినా ఇప్పటికీ జోన్ కార్యకలాపాలు ప్రారంభం కాలేదు. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి విస్తరించే దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలను ప్రారంభిస్తే ఏటా రమారమి రూ.13వేల కోట్ల ఆదాయంతో దేశంలోనే అత్యధిక లాభసాటి జోన్‌గా రాణిస్తుంది. ► రైల్వేలో అత్యధిక ఆదాయం వచ్చే డివిజన్లలో విశాఖపట్నం కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్ కీలకం. దేశంలోని కొన్ని రైల్వే జోన్ల కంటే కూడా వాల్తేరు డివిజన్ అత్యధిక ఆదాయం ఆర్జిస్తోంది. నానాటికీ పురోగమిస్తున్న వాల్తేరు డివిజన్‌ను రద్దు చేసి విశాఖపట్నం నగరాన్ని విజయవాడ డివిజన్ కిందకు తీసుకురావాలన్న ఆలోచన ఘోర తప్పిదం అవుతుంది. వాల్తేరు డివిజన్లో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. వాల్తేరు డివిజన్‌ను విశాఖలో కొనసాగించడం వల రైల్వే అదనంగా ఎలాంటి ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ► విశాఖ –అరకు మధ్య నడిచే రైలుకు అదనంగా 5 విస్టాడోమ్ కోచ్‌లను కేటాయించాలి. ► చిత్తూరు జిల్లా మన్నవరంలో ఉన్న ఎన్టీపీసీ–బీహెచ్ఈఎల్ ఆవరణలో కంటైనర్ తయారీ విభాగాన్ని నెలకొల్పాలి ► రాష్ట్రానికి చెందిన ఉద్యోగార్ధులు ఆర్ఆర్బీ పరీక్షలు రాసేందుకు సికింద్రాబాద్ లేదా భువనేశ్వర్‌కు వెళ్లాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. ► నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైను నిర్మాణాన్ని వేగవంతం చేయాలి. కర్నూలులో కోచ్ వర్క్‌షాప్ నెలకొల్పాలి. విజయవాడ–విశాఖపట్నం మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలి. తిరుపతి–పాకాల–చిత్తూరు–కాట్పాడి మధ్య డబుల్ లైన్ నిర్మాణం చేపట్టాలి. ► విజయవాడ రాజరాజేశ్వరిపేటలోని రైల్వే భూముల్లో మూడు దశాబ్దాలకు పైగా నివాసం ఉంటున్న 800 నిరుపేద కుటుంబాలు ఇళ్ల క్రమబద్ధీకరణకు సహకరించాలి. ఆ భూమికి బదులు గా అజిత్‌సింగ్‌నగర్ రైల్వే స్థలానికి సమీపంలోనే ఉన్న 25 ఎకరాల భూమిని రైల్వే శాఖకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. -
భారీ వర్షసూచన.. విస్తారంగా కురిసే అవకాశం
సాక్షి, విశాఖపట్నం : ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి వైపు ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశమున్నట్లు వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయని , మత్సకారులెవరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. -
దక్షిణ కోస్తా ఓఎస్డీగా శ్రీనివాస్ నియామకం
ఢిల్లీ: కొత్తగా ఏర్పడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఓఎస్డీ(ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా శ్రీనివాస్‌ను నియమించినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. శ్రీనివాస్ దక్షిణ కోస్తా రైల్వే జోన్ బ్లూ ప్రింట్ తయారు చేయనున్నారు. ఉద్యోగుల బదిలీ, విశాఖలో జోన్ ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, డీపీఆర్ తయారీ తదితర అంశాలను ఓఎస్డీ శ్రీనివాస్ పర్యవేక్షించనున్నారు. శ్రీనివాస్ ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో చీఫ్ పర్సనల్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. -
దక్షిణ కోస్తాలో పలుచోట్ల వర్షాలు
విశాఖపట్నం : .పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తా తీరానికి అనుకుని ఉపరితల ఆవర్తనం 2.1 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతుందని విశాఖపట్నంలో వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. ఈ నేపథ్యంఓ దక్షిణ కోస్తాలో పలు చోట్ల వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తాలో చెదురుమదురు వర్షాలు పడుతున్నాయని చెప్పింది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 - 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాని హెచ్చరించింది. -
ఉత్తరాంధ్రలో హై అలర్ట్.. పలురైళ్లు రద్దు
హుదూద్ తుఫాను కారణంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఉద్యోగులందరికీ సెలవులు రద్దు చేశారు. తుఫాను కారణంగా పలు జిల్లాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. మరోవైపు హుదూద్ తుఫాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. ప్రయాణికుల భద్రత కోసం ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ప్రధాన రైల్వే స్టేషన్లలో హెల్ప్లైన్లను ఏర్పాటు చేశారు. తుఫాను కారణంగా 30 రైళ్లను రద్దు చేయగా, మరి కొన్నింటిని దారి మళ్లించారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వే పరిధిలో 37 రైలు సర్వీసులు రద్దయ్యాయి, 31 రైళ్లను దారి మళ్లించారు. కంట్రోల్ రూంల నెంబర్లు తూర్పుగోదావరి- 0884 2359173; విశాఖ- 1800 4250 0002; శ్రీకాకుళం ౦ 1800 4256625; విజయనగరం - 08922 276888; పార్వతీపురం - 08963 221006