
సాక్షి, అమరావతి: ఉత్తర భారతదేశంలో ప్రతికూల వాతావరణంతోపాటు కోవిడ్ విజృంభణతో రైల్వే శాఖ పెద్దసంఖ్యలో రైళ్లను రద్దుచేస్తోంది. అవకాశం ఉన్నంతవరకు రైళ్లలో అదనపు బోగీలను కూడా అందుబాటులోకి తెస్తోంది. రైల్వేశాఖ మంగళవా రం దాదాపు 350 రైళ్లను రద్దుచేసింది. ఇక బుధవా రం దాదాపు 400 రైళ్లను రద్దుచేస్తున్నట్టు ప్రకటిం చింది. గురువారం బయల్దేరాల్సిన 282 రైళ్లను పూర్తిగా, 35 రైళ్లను పాక్షికంగా అంటే మొత్తం మీద 317 రైళ్లను రద్దుచేయాలని నిర్ణయించింది. వాటిలో అత్యధిక రైళ్లు ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవే.
దక్షి ణాదిలో తమిళనాడు, కర్ణాటకతోపాటు తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తరాదికి వెళ్లాల్సిన రైళ్లు కూడా కొన్ని ఉన్నాయి. ఇక గుజరాత్‌లో పర్యాటక ప్రదేశా ల సందర్శన కోసం విజయవాడ నుంచి ఈ నెల 21న బయలుదేరాల్సిన ‘వైబ్రంట్ గుజరాత్’ రైలు ను ఐఆర్‌సీటీసీ రద్దుచేసింది. 850 సీట్లకుగాను ఇప్పటికే దాదాపు 680 సీట్లను ప్రయాణికులు బుక్ చేసుకున్నారు. ప్రస్తుతం కరోనా ఉధృతమైన దృష్ట్యా వైబ్రంట్ గుజరాత్ రైలును రద్దు చేశారు. మరోవైపు ప్రయాణికుల సౌలభ్యం దృష్ట్యా దక్షిణమధ్య రైల్వే కొన్ని రైళ్లలో అదనపు బోగీలను ఏర్పాటు చేస్తోంది. 10 రైళ్లలో శాశ్వత ప్రాతిపదికన రెండు రైళ్లలో తాత్కాలిక ప్రాతిపదికన అదనపు బోగీలను అందుబాటులోకి తెచ్చామని దక్షిణ మధ్య రైల్వే బుధవారం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment