Kyushu island
-
జపాన్ను కుదిపేసిన తీవ్ర భూకంపం
టోక్యో: జపాన్ దక్షిణ తీర ప్రాంతంలో గురువారం శక్తివంతమైన భూకంపం సంభవించింది. క్యుషు దీవిలో ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది. భూమికి సుమారు 30 కిలోమీటర్ల అడుగున భూకంప కేంద్రం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిచినన్ నగరంతోపాటు మియజాకి ప్రిఫెక్చర్ తీవ్ర ప్రభావానికి గురైంది. భూకంప కేంద్రానికి సమీపంలోని మియజాకి విమానాశ్రయంలో భవనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ముందు జాగ్రత్తగా అధికారులు రన్‌వేను మూసివేశారు. పొరుగునే ఉన్న కగోíÙయా ప్రిఫెక్చర్‌లోని ఒసాకిలో కాంక్రీట్ గోడలు ధ్వంసమయ్యాయి. క్యుషు, షికోకు దీవుల తీరం వెంబడి అలలు సుమారు 1.6 అడుగుల ఎత్తున సుమారు అరగంటసేపు ఎగిసిపడ్డాయి. దీంతో, అధికారులు ముందు జాగ్రత్తగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీరప్రాంతాల వైపు వెళ్లరాదని ప్రజలకు సూచనలిచ్చారు. భూకంపం తాకిడితో ముగ్గురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. -
సదరన్ జపాన్ లో భారీ భూకంపం
టోక్యో: సదరన్ జపాన్ ను భారీ భూకంపం గురువారం రాత్రి కుదిపేసింది. సదరన్ జపాన్ లోని క్యూషూ దీవుల్లో భూకంపం సంభవించిందని అమెరికా జియాలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.3 గా నమోదైంది. అయితే ఎలాంటి సునామీ హెచ్చరికల్ని జారీ చేయలేదు. జపాన్ కాలమానం ప్రకారం గురువారం అర్దరాత్రి 2.06 నిమిషాలకు సంభవించినట్టు సమాచారం. 2011 సంభవించిన భూకంప ప్రమాదంలో 18 వేల మంది మరణించిన సంగతి తెలిసిందే. -
జపాన్‌లో భారీ వర్షాలు: 7వేల మంది తరలింపు
దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం ముందస్తుగా సురక్షిత చర్యలు చేపట్టింది. అందులోభాగంగా లోతట్లు ప్రాంతాలు, కొండ దిగువ ఆవాసం ఏర్పాటు చేసుకున్న దాదాపు 7 వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఉన్నతాధికారులు బుధవారం ఇక్కడ తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఈ రోజు ఉదయం దక్షిణ కైషు ప్రాంతంలో కొండ చరియ విరిగిపడినట్లు తమకు సమాచారం అందిందని చెప్పారు. అయితే షికొకు ఐలాండ్‌లోని ఈమీలో గంటకు 100 మి.మీ వర్ష పాతం నమోదు అయిందని పేర్కొన్నారు. అలాగే మత్సుయమ రహదారిలో మట్టి చరియ విరిగిపడిందని తెలిపారు. అయితే ఆ ఘటనలో ఎవ్వరు మరణించడంగాని, గాయాలపాలవ్వడం కాని చోటు చేసుకోలేదని వివరించారు. అయితే ఆ రహదారిని తత్కాలికంగా మూసివేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.