దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం ముందస్తుగా సురక్షిత చర్యలు చేపట్టింది. అందులోభాగంగా లోతట్లు ప్రాంతాలు, కొండ దిగువ ఆవాసం ఏర్పాటు చేసుకున్న దాదాపు 7 వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఉన్నతాధికారులు బుధవారం ఇక్కడ తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఈ రోజు ఉదయం దక్షిణ కైషు ప్రాంతంలో కొండ చరియ విరిగిపడినట్లు తమకు సమాచారం అందిందని చెప్పారు.
అయితే షికొకు ఐలాండ్లోని ఈమీలో గంటకు 100 మి.మీ వర్ష పాతం నమోదు అయిందని పేర్కొన్నారు. అలాగే మత్సుయమ రహదారిలో మట్టి చరియ విరిగిపడిందని తెలిపారు. అయితే ఆ ఘటనలో ఎవ్వరు మరణించడంగాని, గాయాలపాలవ్వడం కాని చోటు చేసుకోలేదని వివరించారు. అయితే ఆ రహదారిని తత్కాలికంగా మూసివేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.