broken glass pieces
-
జపాన్ను కుదిపేసిన తీవ్ర భూకంపం
టోక్యో: జపాన్ దక్షిణ తీర ప్రాంతంలో గురువారం శక్తివంతమైన భూకంపం సంభవించింది. క్యుషు దీవిలో ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది. భూమికి సుమారు 30 కిలోమీటర్ల అడుగున భూకంప కేంద్రం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిచినన్ నగరంతోపాటు మియజాకి ప్రిఫెక్చర్ తీవ్ర ప్రభావానికి గురైంది. భూకంప కేంద్రానికి సమీపంలోని మియజాకి విమానాశ్రయంలో భవనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ముందు జాగ్రత్తగా అధికారులు రన్‌వేను మూసివేశారు. పొరుగునే ఉన్న కగోíÙయా ప్రిఫెక్చర్‌లోని ఒసాకిలో కాంక్రీట్ గోడలు ధ్వంసమయ్యాయి. క్యుషు, షికోకు దీవుల తీరం వెంబడి అలలు సుమారు 1.6 అడుగుల ఎత్తున సుమారు అరగంటసేపు ఎగిసిపడ్డాయి. దీంతో, అధికారులు ముందు జాగ్రత్తగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీరప్రాంతాల వైపు వెళ్లరాదని ప్రజలకు సూచనలిచ్చారు. భూకంపం తాకిడితో ముగ్గురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. -
బర్గర్ తిని.. రక్తం కక్కుకున్నాడు
ముంబై : ఓ వ్యక్తి బర్గర్ తిని రక్తం కక్కుకున్న సంఘటన గత బుధవారం పుణేలో చోటు చేసుకుంది. వివరాలు.. సజీత్ పఠాన్ అనే వ్యక్తి(31) తన స్నేహితులతో కలిసి భోజనం చేయడానికి గాను సమీప ఎఫ్‌సీ రోడ్డులో ఉన్న బర్గర్ కింగ్ ఔవుట్‌లెట్‌కి వెళ్లాడు. అనంతరం సజీత్ ఓ బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, సాఫ్ట్ డ్రింక్ ఆర్డర్ చేశాడు. ఫుడ్ వచ్చిన తర్వాత బర్గర్ తీసుకుని కాస్తంత తిన్నాడు. వెంటనే ఉక్కిరిబిక్కిరి అవ్వడమే కాక రక్తం కక్కున్నాడు. గొంతు నొప్పితో విలవిల్లాడాడు. దాంతో సజీత్ తెప్పించుకున్న బర్గర్‌ని పరిశీలించగా.. దానిలో పగిలిన గ్లాస్ ముక్కలు కనిపించాయి. వెంటనే సజీత్ స్నేహితులు అతన్ని సమీప ఆస్పత్రికి తరలించి, వైద్యం చేయించారు. విషయం తెలుసుకున్న స్టోర్ యజమాన్యం.. అప్పటికప్పుడు ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం సజీత్‌కు రూ. 15 వేలు చెల్లించింది. మరుసటి రోజు అంతకు రెట్టింపు డబ్బులు ఇచ్చి.. ఈ విషయం బయటకు చెప్పవద్దని కోరింది. దీని గురించి ఔట్లెట్ మానేజర్ని ప్రశ్నించగా.. తనకు ఈ విషయం గురించి తెలీదని.. ఆ రోజు సెలవులో ఉన్నానని తెలిపాడు. ప్రస్తుతం సజీత్ ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉందన్నారు డాక్టర్లు. అతని శరీరంలోకి చేరిన గ్లాస్ ముక్క అదే బయటకు వస్తుందని.. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు మెడికల్ రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అవి రాగానే బర్గర్ కింగ్ ఔట్లెట్ మీద తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
విద్యార్థులు, తల్లిదండ్రులపై ఓ ట్యూటర్ దుశ్చర్య
వడోదర: ఎలాగైనా మంచి మార్కులు సాధించడమేకాకుండా, గొప్ప ఉద్యోగాలు సంపాధించాలని విద్యార్థుల ఆత్రుత.. దానిని మరింత పరుగులుపెట్టించేంతగా తల్లిదండ్రుల ఒత్తిడి వెరసి ఓ ప్రైవేటు టీచర్‌కు బుద్ధితక్కువ ఆలోచనకు దారి తీసింది. నేలపై గాజుపెంకలు పరిచి వాటిపై నడిచి మీలో ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోండి అంటూ ఆ పనిచేయించాడు గుజరాత్ లో ఓ ప్రైవేటు ట్యూషన్ టీచర్.. ఆ పని కేవలం ఆ యువ విద్యార్థులతోనే కాకుండా వారి తల్లిదండ్రులతో కూడా చేయించాడు. ఈ విషయం బయటకు తెలిసి పోలీసులు విచారణ ప్రారంభించారు. వడోదరాలో రాకేశ్ పటేల్ అనే ఓ ప్రైవేటు టీచర్ కోచింగ్ సెంటర్ నడుపుతున్నాడు. అతడి వద్దకు శిక్షణకు వస్తున్న యువకుల్లో ఓ 70మందిని ఎంచుకొని వారి తల్లిదండ్రులను కూడా పిలిపించాడు. అనంతరం తన కోచింగ్ సెంటర్ లోనే నేలపై గాజు పెంకలు పరిచి వాటిపై నడవమన్నాడు. తాను కూడా గతంలో అలాగే చేశానని, అందువల్ల తనలో గొప్పగా ఆత్మవిశ్వాసం పెంపొందిందని చెప్పాడు. చాలామంది ఈ గాజుపెంకులపై నడిచారని, వారికి ఏమీ కాలేదని అన్నారు. కాగా, ఈ అంశాన్ని వడోదర కలెక్టర్ తోపాటు గుజరాత్ విద్యాశాఖ మంత్రి భూపేంద్రసిన్హ చుదాశ్మ కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఇలాంటి చర్యలకు దిగుతున్నవారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. -
ప్రేమ వ్యవహారం ఇంట్లో చెప్పారని..
*ఇద్దరిపై గాజు పెంకులతో బాలుడి స్నేహితుల దాడి.. *ఒకరికి చాతిపై, మరొకరికి పొట్టపై గాయాలు విజయవాడ : తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పారనే కోపంతో ఓ బాలుడు తన స్నేహితులతో కలిసి ఇద్దరు యువకులపై గాజు పెంకులతో దాడిచేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు కథనం ప్రకారం... సత్యానారాయణపురం బుడమేరు మధ్యకట్టపై నివసించే బాలుడు అదే ప్రాంతానికి చెందిన ఓ బాలికను ప్రేమిస్తున్నాడు. వారిద్దరూ మాట్లాడుకుంటుండగా అదే ప్రాంతానికి చెందిన పాపారావు, రామారావు అనే యువకులు చూశారు. ఈ విషయాన్ని వెంటనే వారు ఆ బాలుడి బాబాయికి తెలియజేశారు. దీంతో కుటుంబ సభ్యులు బాలుడిని మందలించారు. ఈ విషయం తెలుసుకున్న బాలుడి స్నేహితులు వెంటనే పాపారావు, రామారావులతో గొడవకు దిగారు. వివాదం కాస్తా శ్రుతిమించటంతో బాలుడి స్నేహితుడు ఒకరు గ్రౌండ్లో దొరికిన గాజు పెంకుతో పాపారావు పొట్టపైన, రామారావు మెడపైనా దాడిచేశాడు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలురను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిలో నలుగురు... తొమ్మిదో తరగతి విద్యార్థులు ఉన్నారు. దీంతో ఈ వయసులో ప్రేమ పేరుతో గొడవలకు దిగడంపై పోలీసులు సీరియస్‌గా తీసుకుని విచారణ చేస్తున్నారు.