![The Old Lady Riding A Sportbike Video Goes Viral - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2021/07/29/bike.jpg.webp?itok=WNy0UspH)
వెబ్ డెస్క్: మనుషుల్లో ఒక్కొక్కరికి ఒక్కో సదరా ఉంటుంది. కొన్ని వెంటనే తీరవచ్చు.. మరికొన్నింటికి కొంత సమయం పట్టొచ్చు. ఓ వందేళ్లు దగ్గర పడిన బామ్మ బైక్ రైడ్ చేస్తే ఎలా ఉంటుంది? అది కూడా యమహా R15 అయితే.. ఆ స్టైల్ అదిరిపోతుంది కదా.. తాగాజా ఓ వృద్ధురాలు స్పోర్ట్స్ బైక్ నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వివరాల్లోకి వెళితే.. బామ్మను చూస్తే ఓ వందేళ్లకు దగ్గర వయసు అనిపిస్తుంది. కానీ స్టైల్‌గా యమహా R15 బైక్‌పై కూర్చుని రైడ్ చేసి ఆశ్చర్యపరిచింది.
అంతేకాదండోయ్.. బామ్మ బోసి నవ్వుతో.. రైడ్‌కు మరింత అందం చేకూరింది. ఈ వీడియోను శుభం_5 ఎక్స్ అనే ఇన్‌స్టా యూజర్ పోస్ట్ చేయగా.. 7.8 కోట్ల మంది నెటిజనులు వీక్షించగా.. లక్షల మంది లైక్ కొట్టి కామెంట్ చేస్తున్నారు. ‘‘వావ్ దాది అమ్మ. వందేళ్ల బామ్మ.. వండర్‌ఫుల్ బైక్ రైడ్ అదిరింది.’’ ‘‘బామ్మ బైక్ నడపడం లేదు. కింద నుంచి ఎవరో తోస్తున్నారు.’’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇది ఎక్కడ చిత్రీకరించారో.. తెలియదు కానీ.. బామ్మ బైక్ రైడ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment