
సాక్షి, తరిగొప్పుల(వరంగల్) : ఈ ఫొటోలో ఉన్న అవ్వను చూశారా.. ఓ విలక్షణ లక్షణం ఆమె సొంతం. అదేంటో తెలిస్తే.. ఎవరైనా, ఔరా.. అనక మానరు! దాహమంటే.. ఏమిటో ఆమెకు తెలియదు. ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా పదేళ్లపాటు ఆమె చుక్కనీరు ముట్టితే ఒట్టు! బుక్కెడు బువ్వ తినకుండా ఉపాసం ఉండొచ్చుకానీ.. గుక్కెడు మంచి నీళ్లు తాగకుండా ఉండలేం. అలాంటిది పదేళ్లుగా చుక్క నీరు తాగకుండా ఉంటోంది జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రానికి చెందిన పింగిళి ప్రమీల (70). ఆకలేసినప్పుడు అన్నం తిన్నా మంచినీళ్లు మాత్రం తాగదు. అన్నం తిన్నప్పుడు ఛాతీ భాగంలో తట్టుకున్నట్టు అనిపిస్తే.. నాలుకపై కొంచెం కారం వేసుకుంటే సరిపోతుందని ఈమె చెబుతోంది. పదేళ్ల క్రితం వరకు మంచినీళ్లు తాగిన ప్రమీలకు ఒక్కసారిగా తాగునీటిపై అనాసక్తి ఏర్పడటంతో మానేసినట్లు చెబుతోంది.
చదవండి: చికెన్.. చికెన్.. మటన్.. చికెన్
చదవండి: కరోనా సోకితే 8 నెలలు సేఫ్?
Comments
Please login to add a commentAdd a comment