ఏ పాము కరిచిందని అడుగుతారని.. | Elderly woman bitten by snake in Warangal district | Sakshi
Sakshi News home page

ఏ పాము కరిచిందని అడుగుతారని..

Jun 15 2024 5:58 AM | Updated on Jun 15 2024 5:58 AM

Elderly woman bitten by snake in Warangal district

ఆ పామును చంపి ఆస్పత్రికి తీసుకెళ్లాడు 

వరంగల్‌ జిల్లాలో వృద్ధురాలికి పాముకాటు 

ఆ పామును చంపిన కొడుకు వరుసైన వ్యక్తి

రాయపర్తి(వరంగల్‌): తన పెద్దమ్మ పాముకాటుకు గురికాగా, ఆస్పత్రికి వెళితే వైద్యులు ఏ పాము కరిచిందనే ప్రశ్నలు వేస్తారని ముందుగానే ఊహించిన వరుసకు కుమారుడయ్యే వ్యక్తి ఆ పామును చంపి మరీ ప్లాస్టిక్‌ సంచిలో వేసుకొచ్చాడు.  వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు  చెందిన వృద్ధురాలు  మేరుగు ఎల్లమ్మ  వరండాలో కూర్చోగా, వీపుపై పాము కాటువేసింది.

దీంతో ఆమె కేకలువేయడంతో  రమేశ్‌ అక్కడికి చేరుకుని పామును చంపేశాడు. వెంటనే ఎల్లమ్మను చికిత్స నిమిత్తం వర్ధన్నపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చాడు. అనంతరం వైద్యులు ఎల్లమ్మకు వైద్యం అందించారు. ప్రస్తుతం ఎల్లమ్మ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement