విషాదం: అగ్నికి ఆహుతి, మాంసపు ముద్దగా.. | Elderly Woman Burned To Death In Adilabad | Sakshi
Sakshi News home page

విషాదం: అగ్నికి ఆహుతి, మాంసపు ముద్దగా..

Published Fri, Jan 15 2021 4:59 PM | Last Updated on Fri, Jan 15 2021 6:31 PM

Elderly Woman Burned To Death In Adilabad - Sakshi

ప్రమాద దృశ్యం

సాక్షి, ఆదిలాబాద్‌ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గుడిసెకు నిప్పంటుకుని ఓ వృద్ధురాలు సజీవ దహనమైంది. ఈ సంఘటన ఇంద్రవెల్లి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. ఇంద్రవెల్లి మండలం హిరాపూర్ గోపాలపూర్ శివారులో ఓ వృద్ధురాలు గుడిసెలో నివాసం ఉంటోంది. శుక్రవారం గుడిసెలో ఉన్న పత్తికి నిప్పంటుకోవటంతో.. ఆ అగ్ని కీలలు గుడిసెకు ఎగబాకాయి. దీంతో గుడిసె మొత్తం పెద్ద మంటతో తగలబడిపోయింది. వృద్ధురాలు అగ్నికి ఆహూతైంది. మాంసపు ముద్దగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వంట చేస్తున్న సమయంలో సంభవించిన అగ్ని ప్రమాదమే వృద్ధురాలిని బలితీసుకుందని ప్రాథమిక నిర్థారణకు వచ్చారు.
( జక్రాన్‌ పల్లి ఎంపీడీఓ భారతి ఆత్మహత్యాయత్నం)

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement