Old Woman Was Living with Grandson's Dead Body - Sakshi
Sakshi News home page

యువకుని శవానికి రోజుల తరబడి స్నానాలు, దుస్తుల మార్పిడి.. దుర్వాసన రావడంతో..

Published Mon, Jun 26 2023 1:31 PM | Last Updated on Mon, Jun 26 2023 1:45 PM

Old Woman was Living with Grandsons Dead Body - Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీలో రోమాలు నిక్కబొడుచుకునే ఉదంతం వెలుగు చూసింది. ఒక బామ్మ 10 రోజులుగా తన 18 ఏళ్ల మనుమడి మృతదేహాన్ని తనతోపాటు ఉంచుకుని దానికి స్నానం చేయిస్తూ, దుస్తులు మారుస్తూ వస్తోంది. అయితే ఆ మృతదేహం నుంచి వెలువడుతున్న దుర్వాసన చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో, అక్కడివారు పోలీసులకు ఈ సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ ఇంటి తలుపులు తెరిచి చూసి అవాక్కయ్యారు. 

ఆ బామ్మ తన మనుమడి మృతదేహాన్ని తన దగ్గరే ఉంచుకుంది. ఆ మృతదేహం పురుగులు పట్టి, కుళ్లిపోయిన స్థితిలో ఉండటాన్ని పోలీసులు గమనించారు. గదిలో నుంచి విపరీతమైన దుర్ఘందం వెలువడసాగింది. ఆ దుర్వాసనకు పోలీసులకు ఒక్కసారిగా వాంతులు వచ్చాయి. అయితే వారు తమను తాము నియంత్రించుకుని, ముందుగా ఆ బామ్మను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఆ వృద్ధురాలు మతిస్థిమితం లేనిదని తెలిపారు. కాగా పోలీసులు ఆ యువకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఆ కుర్రాడు ఎలా మృతి చెందాడనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మోహరిపుర్వా  ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల వృద్దురాలి ఇంటి నుంచి దుర్వాసన వస్తున్నదని అక్కడివారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితి చూసి పోలీసులు సైతం హడలెత్తిపోయారు. గదిలో ఒక వృద్ధురాలు 18 ఏళ్ల యువకుని మృతదేహానికి సపర్యలు చేస్తూ కనిపించింది. ఆ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉంది. ఆ వృద్ధురాలిని పోలీసులు ప్రశ్నించగా, తన మునుమడు 10 రోజుల క్రితం చనిపోయాడని తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: వధువు మెడపై కత్తి పెట్టి కిడ్నాప్‌.. నిశ్చేష్టుడైన వరుడు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement