Dead baby
-
యువకుని శవానికి రోజుల తరబడి స్నానాలు, దుస్తుల మార్పిడి.. దుర్వాసన రావడంతో..
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీలో రోమాలు నిక్కబొడుచుకునే ఉదంతం వెలుగు చూసింది. ఒక బామ్మ 10 రోజులుగా తన 18 ఏళ్ల మనుమడి మృతదేహాన్ని తనతోపాటు ఉంచుకుని దానికి స్నానం చేయిస్తూ, దుస్తులు మారుస్తూ వస్తోంది. అయితే ఆ మృతదేహం నుంచి వెలువడుతున్న దుర్వాసన చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో, అక్కడివారు పోలీసులకు ఈ సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ ఇంటి తలుపులు తెరిచి చూసి అవాక్కయ్యారు. ఆ బామ్మ తన మనుమడి మృతదేహాన్ని తన దగ్గరే ఉంచుకుంది. ఆ మృతదేహం పురుగులు పట్టి, కుళ్లిపోయిన స్థితిలో ఉండటాన్ని పోలీసులు గమనించారు. గదిలో నుంచి విపరీతమైన దుర్ఘందం వెలువడసాగింది. ఆ దుర్వాసనకు పోలీసులకు ఒక్కసారిగా వాంతులు వచ్చాయి. అయితే వారు తమను తాము నియంత్రించుకుని, ముందుగా ఆ బామ్మను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఆ వృద్ధురాలు మతిస్థిమితం లేనిదని తెలిపారు. కాగా పోలీసులు ఆ యువకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఆ కుర్రాడు ఎలా మృతి చెందాడనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మోహరిపుర్వా ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల వృద్దురాలి ఇంటి నుంచి దుర్వాసన వస్తున్నదని అక్కడివారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితి చూసి పోలీసులు సైతం హడలెత్తిపోయారు. గదిలో ఒక వృద్ధురాలు 18 ఏళ్ల యువకుని మృతదేహానికి సపర్యలు చేస్తూ కనిపించింది. ఆ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉంది. ఆ వృద్ధురాలిని పోలీసులు ప్రశ్నించగా, తన మునుమడు 10 రోజుల క్రితం చనిపోయాడని తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: వధువు మెడపై కత్తి పెట్టి కిడ్నాప్.. నిశ్చేష్టుడైన వరుడు! -
చిట్టీ.. నాకు ఎప్పుడో తెలుసు.. నేను లేకుండా నువ్వు బిందాస్‌గా ఉండగలవని..
విశాఖపట్నం: ‘చిట్టీ.. నాకు ఎప్పుడో తెలుసు.. నేను లేకుండా నువ్వు బిందాస్‌గా ఉండగలవని. నీకు అసలు ఏ మాత్రం ఫరక్ పడదు. ఎనీ వే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ న్యూ లైఫ్. చాలా మాట్లాడడానికి ఉన్నా కూడా నేను ఏం మాట్లాడటం లేదు. బికాజ్.. నువ్వు బయటకు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యూ నో ఎవ్రీ థింగ్. జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఏ బిగ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ థింగ్’ అంటూ భర్తకు లేఖ రాసి ఐదు నెలల గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ సమయంలో ఎంతో ఆనందంగా గడపాల్సిన ఆమె..ఆర్.కె.బీచ్‌లో విగతజీవిగా కనిపించింది. వరకట్న వేధింపులే తన కుమార్తె మరణానికి కారణమని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలివీ.. పెదగంట్యాడ మండలం నడుపూరులో గురువెల్లి మణికంఠ తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. దొండపర్తికి చెందిన శ్వేత(24)తో గత ఏడాది మణికంఠకు వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. మణికంఠ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. వారం రోజుల కిందట అతను హైదారాబాద్ వెళ్లాడు. శ్వేతను ఇక్కడే అతని తల్లిదండ్రుల వద్ద ఉంచాడు. మంగళవారం సాయంత్రం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆమె సాయంత్రం 6.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. తర్వాత ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆమె అత్తామామలు బంధువులు, స్నేహితుల ఇళ్లలో వాకబు చేశారు. ఫలితం లేకపోవడంతో ఆమె మామ శాంతారావు అర్ధరాత్రి 12 గంటల సమయంలో న్యూపోర్టు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రాత్రి పెట్రోలింగ్ చేసే పోలీసుల గ్రూపులో ఆమె ఫొటో పోస్ట్ చేసి అదృశ్యమైందని వివరాలు పెట్టారు. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఆర్.కె.బీచ్‌లో మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు 3వ పట్టణ పోలీసులు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని శ్వేత ఫొటోతో సరిపోల్చి.. న్యూపోర్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇసుకలో కూరుకుపోయిన ఆమె మృతదేహాన్ని చూసి.. ఎవరో హత్య చేసి తీరంలో పూడ్చేసినట్లు ముందు అనుమానాలు వ్యక్తమయ్యాయి. తన భర్తతో ఉన్న కుటుంబ కలహాలతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. వివాహమై ఏడాది పూర్తి శ్వేత, మణికంఠ దంపతుల మొదటి వివాహ వార్షికోత్సవం ఈ నెల 15న జరిగింది. అనంతరం మణికంఠ హైదరాబాద్ వెళ్లాడు. శ్వేత మరణ వార్త తెలియగానే వెంటనే నగరానికి చేరుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో చిట్టీ(మణికంఠ ముద్దు పేరు) నేను లేకపోయినా నువ్వు బిందాస్‌గా జీవిస్తావని నాకు తెలుసు. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్. బిగ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ థింగ్ అని రాసి ఉంది. భర్త ప్రేమకు నోచుకోలేదు పెళ్లి అయిన తర్వాత అత్త, మామ, ఆడపడుచు భర్త ఎంతగానో నా బిడ్డను వేధించారని శ్వేత తల్లి రమాదేవి ఆరోపించారు. ‘ఆ ఇంట్లో ఉండలేకపోతే వచ్చేయమ్మా.. పెంచుకుంటా అని చెప్పాను. అయినా సరే భర్త ప్రేమ కోసం ఆ ఇంట్లోనే ఉంది. ఐదు నెలల గర్భంతో ఉన్న నా కుమార్తైపె కనీసం కనికరం లేకుండా అత్తమామలు చిత్రహింసలకు గురి చేశారు. ఇంట్లో పనులన్నీ తనతోనే చేయించారు. అల్లుడు వాళ్ల అమ్మానాన్నలకే వత్తాసు పలికేవాడు. ప్రతి రోజూ ఫోన్ చేసి ఏడ్చేది. నెల రోజుల కిందట విడాకులు ఇస్తామని శ్వేతను మణికంఠ బెదిరించాడు. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతానని చెప్పింది. పైళ్లెన తర్వాత చదివించకుండా వంటింటికే పరిమితం చేశారు. నా ఒక్కగానొక్క కుమార్తెను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు’ అంటూ ఆమె వాపోయారు. వరకట్నం వేధింపులే తన కుమార్తెకు మరణానికి కారణామని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కట్నం తీసుకురావాలని కొద్ది నెలలుగా వేధిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు శ్వేత భర్త మణికంఠ, అత్త, మామ, ఆడపడుచు భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తిస్థాయిలో కేసును విచారిస్తున్నట్లు తెలిపారు. ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని భావించా.. ‘శ్వేత బి.టెక్ సివిల్ ఇంజినీర్ చదువుకుంది. సివిల్స్ సాధించాలని నిరంతరం చదువుకునేది. అందుకు నేను కూడా ప్రోత్సహించా. కుటుంబంలో చిన్న చిన్న గొడవులు సహజం. ఆ మాత్రానికే ఆత్మహత్య చేసుకుంటుందని అనుకోలేదు. ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని భావించాను. ఇలా శవమై మమ్మల్ని బాధపెట్టింది’ అని మణికంఠ తెలిపారు. -
బీచ్‌లో శ్వేత మృతదేహం.. పెళ్లైన నెల నుంచే వేధింపులు, సూసైడ్ నోట్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ బీచ్‌లో శవమై తేలిన మహిళ కేసులో మిస్టరీ కొనసాగుతోంది. వివాహిత శ్వేత మృతికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ కేసులో శ్వేత కాల్ రికార్డింగ్స్, పోస్టుమార్టం రిపోర్టు కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే శ్వేత తల్లి రమాదేవి స్టేట్మెంట్ను త్రీటౌన్ పోలీసులు నమోదు చేశారు. ఇంటి నుంచి బయలుదేరే గంట ముందు వరకు కూడా భర్త మణికంఠతో గొడవపడినట్లు విచారణలో తేలింది. అయితే అత్తమామలు వేధింపులపై పోలీసులు కేసు నమోదు చేసే ఆలోచనలో ఉన్నారు విడాకులు ఇస్తానని భర్త బెదిరింపులు కాగా అత్తింటి వేధింపులు తట్టుకోలేకే తన కూతురు చనిపోయిందని శ్వేత తల్లి రమాదేవి ఆరోపించారు. పెళ్లైన నెల రోజుల నుంచే కూతుర్ని వేధించడం ప్రారంభించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అల్లుడి అసలు గుణం అప్పుడే బయటపడిందని.. నెల రోజులు క్రితం కూడా విడాకులు ఇస్తామని శ్వేతను భర్త మణికంఠ బెదిరించాడని పేర్కొన్నారు. ఈ మేరకు మృతురాలి తల్లి మాట్లాడుతూ శ్వేత అత్తింటి వారిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. తన కూతురు అయిదు నెలల గర్భిణీ అని.. కడుపుతో ఉన్నా కూడా కనికరించకుండా అత్తామామలు చిత్రహింసలు పెట్టేవారని తెలిపారు. ఇంట్లో పనులన్నీ తనతోనే చేయించేవారని, అత్త మామలు చెప్పిన పనులు చేయాలంటూ ఫోన్లో భర్త కూడా ఆదేశాలిచ్చేవాడని పేర్కొన్నారు. ఫోన్ చేసి రోజూ ఏడ్చేది.. ‘భర్తను పొగొట్టుకున్నాను. కూతుర్ని ఒక్కదాన్నే కష్టపడి పెంచి పెద్ద చేశాను. అత్తమామలు ఇబ్బందులు పెడుతున్నారని రోజూ ఫోన్ చేసి ఏడ్చేది. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతానని చెప్పింది. పెళ్లైన తరవాత చదివించకుండా వంటింటికే పరిమితం చేశారు. శ్వేత అత్త నటిస్తోంది. అత్తింటి వేధింపులు, భర్త టార్చర్ వల్ల శ్వేత ప్రాణం తీసుకుంది. నా ఒక్కగానొక్క కూతురిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు’ అంటూ వాపోయారు. సూసైడ్ నోట్ ఇదిలా ఉండగా శ్వేత చనిపోయేముందు ఓ సూసైడ్ నోట్ రాసింది. ఇందులో ‘చిట్టీ...నాకు ఎప్పుడో తెలుసు నేను లేకుండా నువ్వు బిందాస్‌గా ఉండగలవని. నీకు అసలు ఏమాత్రం ఫరక్ పడదు. ఎనీ వే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.. అండ్ న్యూ లైఫ్. చాలా మాట్లాడడానికి ఉన్నా కూడా నేను ఏం మాట్లాడటం లేదు. బికాజ్.. నువ్వు బయటకు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా యూ నో ఎవ్రీ థింగ్. జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఏ బిగ్ థాంక్స్ ఫర్ ఎవ్రీ థింగ్’ అని రాసి ఉన్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్వేత భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ హైదరాబాద్‌లో నివసిస్తుండగా.. విశాఖపట్నంలో అత్తమామల వద్ద శ్వేత ఉంటోంది. మంగళవారం అత్తతో గొడవ జరగడంతో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఫోన్లో భర్తతోనూ గొడవపడింది. తర్వాత విగత జీవిగా బీచ్‌లో కనిపించింది. చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 11 మంది జవాన్లు మృతి.. -
మరికొద్ది గంటల్లో తెల్లారుతుందనంగా... తెల్లారిన బతుకులు
శెట్టూరు: రోజంతా పనులతో అలసిన శరీరాలు రాత్రి గాఢనిద్రలో ఉన్నాయి. తెల్లారితే మళ్లీ బతుకు పోరుకు సిద్ధమవ్వాలి. మరి కొన్ని గంటల్లో ఊరంతా నిద్ర లేస్తుందనగా.. ఒక్కసారిగా భారీ పేలుడు. రెండిళ్లు పూర్తిగా నేలమట్టం. ఏం జరిగింది? ఎలా జరిగింది? అర్థం కాని అయోమయం. ఇళ్ల నుంచి పరుగున రోడ్డుపైకి చేరుకున్న జనం. నేలమట్టమైన ఇంటి శిథిలాల కింద నాలుగు మృతదేహాలు! అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలం ములకలేడులో చోటు చేసుకున్న పేలుడు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఏం జరిగిందంటే.. ములకలేడుకు చెందిన కొలిమి దాదాపీరా అలియాస్ దాదు (35), షర్ఫూనా (30) దంపతులకు ఆరేళ్ల కుమార్తె నిదా ఫిర్దోషి ఉంది. తల్లి జైనూబీ (65)తో కలిసి దాదు కుటుంబం నివసిస్తోంది. అదే గ్రామంలోని ఓ చికెన్ సెంటర్లో దాదు దినసరి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వీరి ఇంటి పక్కనే మరో ఇంటిలో చిన్నాన్న రజాక్ సాహెబ్ నివాసముంటున్నారు. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు రజాక్ సాహెబ్ నిద్రలేచాడు. అప్పటికే సిలిండర్ లీకేజీ కారణంగా ఇళ్లంతా లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) నిండుకుని ఉంది. అవగాహన రాహిత్యం కారణంగా రజాక్ ఇంట్లో లైట్లు ఆన్ చేయడంతో భారీ పేలుడు సంభవించింది. మంటలు చెలరేగడంతో రజాక్‌తో పాటు అతని కుమారుడు అబ్దుల్ సాహెబ్ తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి పక్కపక్కనే ఉన్న రెండిళ్లు కుప్పకూలాయి. మరో నాలుగు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఉలిక్కిపడిన గ్రామం.. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకూ వ్యవసాయ పనులతో అలసిన ములకలేడు వాసులు రాత్రి గాఢ నిద్రలో ఉన్నారు. శనివారం తెల్లవారు జామున 4 గంటలకు పేలుడు ధాటికి ఒక్కసారిగా ఆ గ్రామం ఉలిక్కిపడింది. ఎక్కడో.. ఏదో జరిగిందనుకుంటూ నిద్రలోనే ఇళ్ల నుంచి పరుగున బయటకు వచ్చారు. దాదు, రజాక్ ఇళ్లు నేలమట్టమయ్యాయని తెలుసుకుని గ్రామం మొత్తం అక్కడికి చేరుకుంది. శిథిలాల కింద కాలిన గాయాలతో కొట్టుమిట్టాడుతున్న రజాక్, అబ్దుల్‌ను సురక్షిత ప్రాంతానికి చేర్చారు. పక్క ఇంటి శిథిలాలను తొలగిస్తుండగా నిద్రలోనే మృత్యుఒడికి చేరుకున్న దాదు, షర్ఫూనా, నిదా ఫిర్దోషి, జైనూబీ మృతదేహాలు బయటపడ్డాయి. ఒక్కొక్కటిగా మృతదేహాలను తొలగిస్తుంటే పలువురు అయ్యో దేవుడా? అంటూ కంటతడిపెట్టారు. విషయం తెలుసుకున్న కళ్యాణదుర్గం రూరల్ సీఐ శ్రీనివాసులు, శెట్టూరు ఎస్ఐ యువరాజ్, రాష్ట్ర విపత్తుల స్పందన/అగ్నిమాపక సేవల శాఖ అధికారి నజీర్ అహమ్మద్, రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. తీవ్రంగా గాయపడిన రజాక్, ఆయన కుమారుడు అబ్దుల్ని కళ్యాణదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. అంత్యక్రియలకు వెళ్లివచ్చి... దాదు భార్య షర్ఫూనా పుట్టినిల్లు కనుకూరు గ్రామం. వీరి సమీప బంధువు అనారోగ్యంతో గురువారం మృతి చెందడంతో అంత్యక్రియలను శుక్రవారం కనుకూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదు కుటుంబం హాజరైంది. సాయంత్రం తిరిగి గ్రామానికి చేరుకున్నారు. తెల్లారితే ఉపాధి పనుల్లో పాలు పంచుకోవాల్సి ఉంది. ఇంతలో దారుణం చోటు చేసుకోవడంతో ములకలేడు, కనుకూరు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మంత్రి దిగ్భ్రాంతి.. ములకలేడు ఘటనపై రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో ఉన్న ఆమెకు విషయాన్ని స్థానిక పార్టీ నేతలు ఫోన్ ద్వారా చేరవేశారు. విషయం తెలుసుకున్న మంత్రి భర్త శ్రీచరణ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ శివన్న, నాయకులు జయం ఫణి, బాబు రెడ్డి, సోమనాథరెడ్డి, తిమ్మరాజు, హరినాథరెడ్డి, ముత్యాలు, రమేష్, షేక్షావలి, అప్జల్, సర్పంచ్ నాగరాజు, మన్సూర్ తదితరులు ములకలేడుకు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. బాధిత కుటుంబానికి శ్రీచరణ్‌రెడ్డి రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేశారు. సర్పంచ్ నాగరాజు, ఎస్ఐ యువరాజ్ సమక్షంలో వైఎస్సార్ బీమా పథకం కింద తక్షణ సాయంగా రూ.20 వేలను సచివాలయ సిబ్బంది అందించారు. అంత్యక్రియల్లో పాల్గొన్న ఎంపీ రంగయ్య.. ములకలేడులో జరిగిన ఘోరాన్ని తెలుసుకున్న అనంతపురం ఎంపీ తలారి రంగయ్య వెంటనే స్పందించారు. గ్రామానికి చేరుకున్న ఆయన స్థానికులతో కలిసి మృతుల అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వారి సమాధుల వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన వెంట వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామి, కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ తలారి రాజు, వ్యవసాయ మిషన్ సభ్యుడు రాజారాం తదితరులు ఉన్నారు. పెద్ద శబ్దంతో ఉలిక్కిపడ్డాం తెల్లవారుజామున 4 గంటలకు ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. మా ఇంటి గోడలు చీలసాగాయి. భయంతో బయటకు పరుగు తీశాం. బయటికి వచ్చి చూస్తే దాదు, రజాక్ ఇళ్ల వద్ద పెద్ద ఎత్తున పొగలు వ్యాపించి ఉన్నాయి. కాసేపటి వరకూ ఏమీ కనబడలేదు. ఆ తర్వాత చూస్తే రెండిళ్లు పూర్తిగా నేలమట్టమై కనిపించాయి. నా ఇల్లు కూడా ఎప్పుడు కూలుతుందో తెలియడం లేదు. – అబ్దుల్ రహమాన్, ములకలేడు (చదవండి: 2019లోనే చంద్రబాబును ప్రజలు క్విట్ చేశారు) -
ప్రసవానికి వస్తే మృత శిశువును చేతిలో పెట్టారు.. న్యాయం చేయండి!
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రసవం కోసం ప్రభుత్వాస్పత్రికి వస్తే, మృత శిశువును చేతిలో పెట్టారంటూ బుధవారం బాధితురాలి బంధువులు పాత ప్రభుత్వాస్పత్రి మాతా శిశు విభాగం ఎదుట ఆందోళనకు దిగారు. సేకరించిన వివరాల ప్రకారం నందిగామకు చెందిన జి.మమతకు పురిటినొప్పులు రావడంతో ప్రసవం కోసం ఈ నెల 13వ తేదీ సాయంత్రం విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. ఆమె నార్మల్ డెలివరీ అవుతుందని భావించిన వైద్యులు అబ్జర్వేషన్ రూమ్‌లో ఉంచారు. ఆమె బుధవారం ఉదయం నార్మల్ డెలివరీ అయింది. అయితే పుట్టిన శిశువు మృతి చెంది ఉండటంతో విషయాన్ని బంధువులకు తెలిపారు. ఇప్పటివరకూ ఆరోగ్యంగా ఉన్న శిశువు పుట్టగానే ఎలా మృతి చెందుతుందని, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందంటూ మృతశిశువును పెట్టుకుని ఆస్పత్రి ఎదుట నిరసన తెలిపారు. విచారణకు ఐదుగురు సభ్యుల కమిటీ పాత ప్రభుత్వాస్పత్రి ప్రసూతి విభాగంలో మృతశిశువు ప్రసవంపై విచారణకు ఐదుగురు సభ్యులతో కమిటీ వేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యేకుల కిరణ్‌కుమార్ తెలిపారు. ఈ కమిటీలో గైనకాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పి.హిమబిందు, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ టి.సూర్యశ్రీ, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ వి.సుధీర్‌బాబు, సివిల్‌సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ ఎ.హనుమంతరావు, ఏఆర్ఎం డాక్టర్ ఎస్.మాధవీలతతో కూడిన కమిటీ అన్ని అంశాలపై విచారణ జరపనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా తగు చర్యలు తీసుకుంటామని డాక్టర్ కిరణ్‌కుమార్ తెలిపారు. వైద్యుల తప్పులేదు శిశువు మృతి విషయంలో వైద్యుల తప్పిదం లేదు. శిశువు మెడకు మూడుసార్లు పేగు చుట్టుకుని ఉండటంతో ఊపిరి ఆడక మృతి చెంది ఉండవచ్చు. సాధారణంగా కొందరికి ఒక మెలిక పేగు మెడకు చుట్టుకుని ఉంటుంది. కానీ ఈ శిశువుకు మూడు మెలికలు చుట్టుకుంది. బాధితులు ఫిర్యాదు చేస్తే, విచారణ చేస్తాం. –డాక్టర్ నాగేశ్వరరావు, డిప్యూటీ సూపరింటెండెంట్, పాత ఆస్పత్రి చదవండి: భార్య అనుమతి లేకుండా ఆమె ఫోన్ కాల్స్ రికార్డు చేయడం నేరం: హైకోర్టు -
పహాడీషరీఫ్ శ్మశాన వాటికలో చిన్నారి మృతదేహం మాయం
-
తల్లి గర్భంలో చిక్కుకున్న శిశువు తల
కర్నూలు,బొమ్మలసత్రం: ఏడు నెలల మృత శిశువును తల్లి గర్భం నుంచి బయటకు తీసే క్రమంలో శరీర భాగాలు రెండుగా విడిపోయాయి. తల భాగం తల్లి గర్భంలోనే చిక్కుకుపోయింది. ఈ ఘటన మంగళవారం నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. మిడుతూరు మండలం అలగనూరు గ్రామానికి చెందిన శ్రీలక్ష్మి, ఏసురాజు దంపతులు. శ్రీలక్ష్మికి మొదటి కాన్పులో ఆరు నెలలకే ప్రసవం జరిగి శిశువును కోల్పోయింది. ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. మంగళవారం ఉదయం కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు గడివేముల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఉమ్ము నీరు పోయి శిశువు కాళ్లు బయటకు రావడాన్ని వైద్యులు గమనించి.. నంద్యాల ప్రభుత్వాసుపత్రికి పంపించారు. ఇక్కడి వైద్యులు శిశువును గర్భం నుంచి బయటకు తీసే క్రమంలో తల భాగం లోపల చిక్కుకుపోయింది. పరిస్థితి విషమించటంతో ఆమెను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శిశువు మూడు, నాలుగు రోజుల క్రితమే మృతి చెంది.. శరీరం పాచిపోవటం వల్ల విడిపోయి ఉండొచ్చని వైద్యులు తెలిపారు. కాగా..తాము ఆసుపత్రికి వచ్చే వరకు శిశువు బతికే ఉందని, వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని శ్రీలక్ష్మి కుటుంబ సభ్యులు ఆరోపించారు. -
సూట్‌కేసులో డెడ్‌బాడీ.. ముక్కలు ముక్కలుగా నరికి..
ముంబై : నగరంలో దారుణం చేటు చేసుకుంది. ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన గుర్తుతెలియని వ్యక్తులు, అతని మృత దేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి సూట్‌కేసులో కుక్కారు. ఆ సూట్‌కేసును మహీమ్ బీచ్‌లోని మఖ్దూమ్ షా బాబా దర్గా సమీపంలో పడేశారు. సోమవారం సాయంత్రం బీచ్‌లో నీటిపై తేలియాడుతున్న సూట్‌కేసును గమనించిన స్థానికులు పోలీసులకు సమచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని సూట్‌కేసును తెరచిచూస్తే అందులో మృతదేహం శరీర భాగాలు కనిపించాయి. చేతులు, కాళ్లతో పాటు మర్మాంగాలు ఉండడంతో పోలీసులు షాక్ తిన్నారు. అవి ఎవరివి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరీక్షల కోసం మృతదేహం భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. సూట్ కేసు లభించిన చుట్టు పక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ముంబైలో ఇటీవల నమోదైన మిస్సింగ్ కేసును కూడా పరిగణలోకి తీసుకొని కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఆ వ్యక్తిని ఎక్కడో చంపేసి.. మృతదేహాన్ని ముక్కలుగా కోసి, శరీర భాగాలను సూట్ కేసులో పెట్టి సముద్రంలో విసిరేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మిగతా శరీర భాగాల కోసం సముద్రంతో వెతుకుతున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. -
పాపం పసికందు
సాక్షి, విజయనగరం క్రైం: వ్యర్థాలు, చెత్తకుప్పలతో నిండిపోయి, వర్షానికి విపరీతమైన దుర్వాసన వచ్చే జొన్నగుడ్డి ఉప్పరవీధి శివారున నెలలు నిండని పసికందు మృతదేహం గురువారం బయటపడింది. సుమారు మూడున్నర నెలల వయస్సు ఉన్న ఈ పసికందు మృతదేహాన్ని ఎప్పుడు పడేశారో తెలియదు. తలభాగం పూర్తిగా పందులు, కుక్కలు పీకేశాయి. కొందరు మహిళలు ఉదయాన్నే అటుగా వచ్చినప్పుడు వారికి ఈ దృశ్యం కనిపించింది. వారు కేకలు వేయడంతో స్థానికులు, చుట్టు పక్కల ప్రజలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయ్యో ‘పాప’ం అంటూ నిట్టూర్చారు. పిల్లలు లేని దం పతులు ఎందరో ఉన్నారని, వారికి శిశువును అప్పగిస్తే సరిపోయేదంటూ వాపోయారు. పోలీ సులకు సమాచారం అందించారు. వన్‌టౌన్ పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ రాష్ట్ర నాయకుడు కేసలి అప్పారావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతశిశువును పరిశీలించారు. అనంతరం అప్పారావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఊయల కార్యక్రమంలో భాగంగా ఎవరైనా బిడ్డలు వద్దనుకుంటే ఆ ఊయలలో వదిలేసి వెళ్లిపోవచ్చని, ప్రతీ ప్రభుత్వాస్పత్రిలో ఒక ఊయల ఉంటుందన్నారు. లేదంటే చైల్డ్‌లైన్‌కి అప్పగించవచ్చని తెలిపారు. ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్ల పసికందులు మృత్యువాతకు గురవుతారన్నారు. ఇటువంటి దారుణాలకు పాల్పడవద్దని కోరారు. వన్‌టౌన్ ఎస్ఐ ప్రసాద్ నేతృత్వంలో మృతశిశువును కేంద్రాస్పత్రికి తరలించారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. -
బిడ్డ శవాన్ని నెత్తిన పెట్టుకుని...
సృష్టిలో ప్రతి ప్రాణికీ మూలం అమ్మ. గర్భాశయంలో పెంచి, జన్మనిచ్చే ప్రేమమూర్తి. పాలు త్రాగించి, ఆహారం తినిపించి, ప్రేమతో పెంచుతుంది. అలాంటి అమ్మ ప్రేమ కంటే గొప్పది.. భద్రమైంది మరేదీ ఉండదు. అలాంటిది చనిపోయిన తన బిడ్డ చలనం రాకపోతుందా అన్న ఆశతో నాలుగు రోజులపాటు మోసుకు సుదూర ప్రయాణం చేసిందో తల్లి. వాన్కోవర్: బ్రిటీష్ కొలంబియా, విక్టోరియాలోని తీర ప్రాంతం. J35 అనే ఓర్కా తిమింగలం(కిల్లర్ వేల్.. సముద్రపు డాల్ఫిన్ జాతిలోనే అతి పెద్దది) 17 నెలలుగా ఆ మధుర క్షణాల కోసమే ఎదురు చూసింది. గత మంగళవారం ఉదయం అది ఓ బిడ్డకు జన్మనిచ్చింది. సాధారణంగా అవి గుంపుగా జీవించే జీవులు కావటంతో.. మిగతావి దాని దగ్గరికొచ్చి బిడ్డను చూసి సందడి చేశాయి. కాసేపు నీటిలో హాయిగా చక్కర్లు కొట్టిన ఆ పిల్ల ఓర్కా.. కాసేపటికే చలనం లేకుండా పోయింది. గంటకే బిడ్డ మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ తల్లి ఓర్కా బిడ్డకు వీడ్కోలు చెప్పాలని అనుకోలేదు. ఎలాగైనా మళ్లీ ఊపిరి పోయాలన్న ఆలోచనతో తలపై మోసుకుంటూ నీటిలో పైకి, కిందకు ఈదటం ప్రారంభించింది. అలా గంటలు దొర్లిపోయాయి. తలపై 400 పౌండ్ల బరువు.. ఏకంగా నాలుగు రోజులపాటు ఏకధాటిగా 185 కిలోమీటర్లు ప్రయాణించింది. సాన్ జువాన్ ఐలాండ్ వద్ద వేల్ రీసెర్చర్ ‘కెన్ బాల్కోమ్’ J35ను గుర్తించి దాని వ్యధను ఓ డాక్యుమెంటరీగా చిత్రీకరించారు. ’సాధారణంగా జంతువుల్లో ఇలాంటి ప్రవర్తన సాధారణమే. అయితే ఇన్నిరోజులపాటు ఓపికగా ఎదురు చూడటం బహుశా ఇదే తొలి ఘటన అయి ఉండొచ్చు. ఈ నాలుగు రోజులు అది చాలా అవస్థలు పడింది. తిండికి కూడా దూరంగా ఉంది. ఊపిరి కష్టమైన బిడ్డను తల నుంచి దించలేదు. రోజుకు 60 నుంచి 70 మైళ్ల మధ్య అది ఈదుతూ వచ్చింది. బిడ్డలో కదలిక కోసం అది తీవ్రంగా యత్నించింది. ఈ భావోద్వేగాన్ని షూట్ చేయాలని నిర్ణయించి దాన్ని ఫాలో అయ్యాం. గుండెకు తాకేలా ఉన్న ఈ కథనాన్ని ప్రపంచానికి తెలియజేశాం’ అని బాల్ కోమ్ చెబుతున్నారు. ఎంతైనా తల్లి ప్రేమ తల్లి ప్రేమే... -
ఆ అనుమానంతోనే దోస్త్‌ను నరికి...
సాక్షి, న్యూఢిల్లీ : గత వారం నగరం దక్షిణ ప్రాంతంలోని సయిద్ ఉల్ అజయిబ్ ప్రాంతంలో సంచలనం రేపిన హత్య ఉదంతం మిస్టరీని పోలీసులు చేధించారు. ఓ వ్యక్తిని ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టిన కేసులో అంతా అనుమానించినట్లుగానే స్నేహితుడే హంతకుడిగా తేల్చారు. పరారీలో ఉన్న అతనిని చివరకు ఒడిశాలో పట్టుకున్నట్లు దక్షిణ ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. విచారణలో ముందు పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు యత్నించినప్పటికీ.. తర్వాత నిజం ఒప్పుకున్నట్లు వారు చెప్పారు. ఇక తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతోనే స్నేహితుడు విపిన్ జోషిని దారుణంగా హత మార్చినట్లు బాదల్ అంగీకరించాడు. దీంతో అతన్ని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. గార్డెన్ ఆఫ్ పైవ్ సెన్సెస్ ప్రాంతంలో ఎఫ్‌ఐవో కంట్రీ చికెన్ అండ్ బార్లో ప్రాణ స్నేహితులైన విపిన్ జోషి, బాదల్ మండల్లు పని చేసే వారు. అయితే తన భార్యతో చనువుగా ఉండటం.. తాను లేని సమయంలో కూడా విపిన్ తరచూ తన ఇంటికి వెళ్తుండటం బాదల్ గమనించాడు. దీంతో తన భార్యతో వ్యవహారం నడుపుతున్న స్నేహితుడిని మట్టుపెట్టేందుకు ప్రణాళిక వేసుకున్నాడు. అక్టోబర్ 9న తాను అద్దెకు ఉంటున్న గదిలో దావత్ ఇస్తానంటూ విపిన్‌ను ఆహ్వనించాడు. ఆపై చిత్తుగా తాగిన విపిన్‌ను అప్పటికే తెచ్చిపెట్టుకున్న మాంసం కత్తితో పొడిచి చంపేశాడు. ఆపై బాత్రూమ్లోకి లాక్కెల్లి శవాన్ని ముక్కలుగా నరికాడు. వాటిని ఫ్రిడ్జిలో దాచి.. ఏమీ ఎరుగనట్లు కోల్‌కతా పారిపోయాడు. అక్కడి నుంచి ఒడిశాలోని రూర్కెలాలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి తలదాచుకోగా.. వారిచ్చిన సమాచారంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తీసుకొచ్చారు. -
కలంకం!
కడుపు పండితే.. ఆ ఇంట్లో ఆనందాల పంట నెలలు నిండుతుంటే..కలల లోకంలో విహారంవెన్ను విరిగే బరువు.. ఆమెకు గాలి పిందె కడుపున బిడ్డ కదిలితే..ఆ కళ్లలో ముసిముసి నవ్వుతొలుచూరు కాన్పయితే.. ఇక పండగేపుట్టినిల్లు.. మెట్టినిల్లు ఒక్కటయ్యే వేడుక ఆ సంబరం.. విషాదమైతే!బిడ్డ కడుపులోనే కన్నుమూస్తే..వదిలించుకుంటారా ఆ పసిగుడ్డు భారమవుతుందా?పుట్టుక సంబరమైతే..‘చావు’ను సాగనంపలేరా..తొమ్మిది నెలల కల..మానవత్వం చూపించదేలా..ఒక్క క్షణం.. ఆలోచించండి.ఆ ప్రేమ అజరామరం.. ఎందుకీ శాపం! అనంతపురం సెంట్రల్(అనంతపురం): మృత శిశువు ఆ తల్లిదండ్రులకు భారమైంది. పేగు బంధం మరిచి చెత్తకుప్పలో పడేశారు. చిన్నపాటి కవర్లో చుట్టి వదిలించుకున్నారు. వీధి కుక్కలు సగభాగం తినేయగా.. మానవత్వం మౌనంగా రోదించింది. ఈ ఘటన శుక్రవారం నగరంలోని మారుతీనగర్‌లో చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలోని మున్సిపల్ చెత్తకుప్ప వద్ద శుక్రవారం ఉదయం కొన్ని కుక్కలు ఓ కవర్లోని మాంసం ముద్ద చుట్టూ గుమికూడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. అప్పుడే పుట్టిన.. రక్తపు మరకలు కూడా ఆరని మృత శిశువును చూసి నివ్వెరపోయారు. వెంటనే కుక్కలను పక్కకు తోలి.. పోలీసు, మున్సిపల్ అధికారులకు సమాచారం చేరవేశారు. ఈ కాలనీలో ఆసుపత్రులు లేకపోవడంతో.. మృత శిశువును తీసుకొచ్చి ఇక్కడ పడేసినట్లుగా అనుమానిస్తున్నారు. అయితే.. కడుపులోనే చనిపోయినా, మృత శిశువు జన్మించినా.. ఖననం చేయడం కనీస ధర్మం. అలాంటిది.. కర్కశంగా చెత్తకుప్పలో పడేసి వెళ్లిన తీరుతో సభ్య సమాజం మౌనంగా రోదించింది. చివరకు మున్సిపల్ అధికారులు ఆ మృత శిశువును స్వాధీనం చేసుకుని ‘చివరి’ మజిలీ పూర్తి చేశారు. ఇదిలాఉంటే.. తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా వైద్య, ఆరోగ్య శాఖ.. పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. కనీసం ప్రయివేట్ ఆసుపత్రులైనా సామాజిక బాధ్యతగా మృత శిశువుల ఖననానికి ముందుకు రాకపోవడం పట్ల సభ్య సమాజం తలదించుకుంటోంది. ఎంపీఈవో సస్పెన్షన్ అనంతపురం అగ్రికల్చర్: పెట్టుబడి రాయితీ(ఇన్పుట్ సబ్సిడీ)ని రైతుకు ఇవ్వకుండా తన బ్యాంకు ఖాతాలో జమ చేసుకున్న చిలమత్తూరు మండలం ఎంపీఈవో జగదీష్ కుమార్‌ను కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాక ఇన్పుట్ సొమ్మును ఆ రైతుకు చెల్లించినట్లు పేర్కొన్నారు. ఇన్పుట్ పంపిణీలో అక్రమాలు, అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఎవరిదీ ‘పాపం'!
♦ చెత్త కుప్పలో ఏడు నెలల గర్భస్థ శిశువు ♦ మంథన్‌దేవునిపల్లిలో ఘటన మాచారెడ్డి : ఎవరి ‘పాప’మో.. ఏమో! కళ్లైనా తెరవని పసిగుడ్డుపై కాఠిన్యం చూపిందో కఠినాత్మురాలు!! కన్నపేగు బంధానికే కళంకం తెచ్చింది. ఏడు నెలల గర్భస్థ శిశువును చెత్తకుప్పలో పడేసింది. మండలంలోని మంథన్‌దేవునిపల్లిలో శనివారం ఈ ఉదంతం వెలుగు చూసింది. ఏ తల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డో.. కనికరం లేకుండా కడుపులోనే తుంచేశారు.. మృత శిశువును తీసుకొచ్చి గ్రామానికి చెందిన కామటి భూమయ్య ఇంటి వెనుక చెత్తకుప్పల్లో పడేశారు. శనివారం అటువైపు వచ్చిన గ్రామస్తులకు శిశువు మృతదేహం కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రొబేషనరీ ఎస్సై హరీశ్‌రెడ్డి, ఐసీడీఎస్ సూపర్వైజర్ బుజ్జి అక్కడకు చేరుకున్నారు. మృత శిశువుకు కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం గ్రామానికి తీసుకొచి, ఖననం చేశారు. అవివాహిత లేక వివాహేతర సంబంధం ఉన్న మహిళే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేవునిపల్లిలో మొత్తం 18 మంది గర్భిణులు ఉన్నారని, వారిలో ఎవరూ ప్రసవించలేదని తెలిపారు. ఈ శిశువు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నామని చెప్పారు. -
చెత్తకుప్పలో మృత శిశువు
ఒక రోజు వయసున్న మగ శిశువు మృత దేహాన్ని చెత్తకుప్ప పాలు చేశారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖని మునిసిపాలిటీ అడ్డగుట్టపల్లిలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ చెత్తకుప్పలో శిశువు మృతదేహాన్ని పారిశుద్ధ్య కార్మికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. -
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రితో దారుణం!
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఓ దారుణం జరిగిపోయింది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును బాత్ రూమ్‌లో వదిలేశారు. స్థానికులు చూసేసరికి శిశువు మరణించి వుంది. ఆస్పత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పుట్టిన శిశువు ఆడపిల్ల కావడంతో ఎవరైనా చంపేసి పడేశారా? లేక మృత శిశువును పడేశారా? అనేది తెలియడంలేదు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఇటువంటి సంఘటన జరగడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ** -
సుప్రజను భర్తే హత్య చేశాడు?
మృతదేహంతో ఎస్పీ బంగ్లా ఎదుట ఆందోళన నిందితుడిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ (క్రైమ్) : పాణ్యం సుప్రజ అలియాస్ కరుణమాలను భర్తే హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. సుప్రజను హత్య చేసిన భర్త, అత్తింటివారిపై చర్యలు తీసుకోవాలని గురువారం మృతదేహంతో ఎస్పీ క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తక్షణమే సుప్రజ భర్త పూర్ణప్రసాద్‌ను కానిస్టేబుల్ విధుల నుంచి తొలగించి, అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. వెంకటాచలం మండలంలోని చెముడుగుంట కుంకుంపూడికి చెందిన ప్రసాద్ కుమార్తె సుప్రజకు అదే గ్రామానికి చెందిన పాణ్యం పూర్ణప్రసాద్ (చిట్టమూరు కానిస్టేబుల్, ప్రస్తుతం రైల్వేలో విధులు నిర్వర్తిస్తున్నాడు)తో 2013 నవంబర్ 9న వివాహమైంది. ఆ సమయంలో సుప్రజ తల్లిదండ్రులు పూర్ణప్రసాద్‌కు కట్నం కింద రూ. 1.5 లక్షల నగదు, 20 సవర్ల బంగారు ఆభరణాలు ఇచ్చారు. వివాహానంతరం పూర్ణప్రసాద్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం వేధించ సాగారు. తన తల్లిదండ్రులకు అంతస్తోమత లేదని చెప్పడంతో మరింతగా వేధించడం ప్రారంభించారు. ఈ విషయమై పలుమార్లు తల్లిదండ్రుల వద్ద వాపోయింది. మంగళవారం రాత్రి విధులు ముగించుకుని పూర్ణచంద్రరావు వచ్చి పుట్టింటిలో ఉన్న భార్యను తన ఇంటికి తీసుకువచ్చాడు. బుధవారం సుప్రజ మృతి చెందిన విషయం తెలిసిందే. సుప్రజ ఆత్మహత్య చేసుకుని చనిపోయే అంత పిరికిది కాదని.. భర్త, అత్త సుగుణమ్మలే ఆమెను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆమె తల్లిదండ్రులు వెంకటాచలం ఎస్ఐ రహమతుల్లాకు ఫిర్యాదు చేశారు. ఆమె మెడపై కూడా ఉరేసుకున్న గాయాలు లేవని, సుప్రజను కొట్టిచంపారని వాపోయారు. దీంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది ఇలా ఉంటే సుప్రజ భర్త పూర్ణప్రసాద్, అతని తల్లి సుగుణమ్మ ఆస్పత్రికి రావడంతో మృతురాలి బంధువులు వారిపై దాడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని వారిద్దరిని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎస్పీ బంగ్లా ఎదుట ఉద్రిక్తత సుప్రజ భర్త పూర్ణప్రసాద్ కానిస్టేబుల్ కావడంతో పోలీసులు కేసు నీరుగారుస్తున్నారని, స్టేషన్లో అతనికి రాచమర్యాదలు చేస్తున్నారని ఆరోపిస్తూ పోస్టుమార్టం అనంతరం మృతదేహంతో ఎస్పీ బంగ్లాకు చేరుకున్నారు. బంగ్లా గేటు వద్ద మృతదేహాన్ని ఉంచి వెంటనే న్యాయం చేయాలని నినదించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎస్పీ బంగ్లా ఎదుట ఆందోళన విషయం తెలుసుకున్న నెల్లూరు నగర, రూరల్ డీఎస్పీలు పి. వెంకటనాథ్‌రెడ్డి, వీఎస్ రాంబాబు, ఎస్బీ ఇన్స్పెక్టర్లు వై. జయరామసుబ్బారెడ్డి, జి. శ్రీనివాసరావు, నాలుగు, ఆరో నగర ఇన్స్పెక్టర్లు జి. రామారావు, జి. మంగారావు బంగ్లా వద్దకు చేరుకుని బాధితులతో మాట్లాడారు. ఇప్పటికే పూర్ణప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, విచారించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
నా అనే వారు ఉన్నా...
రోడ్డుపైనే తుదిశ్వాస విడిచిన వృద్ధుడు హసన్‌పర్తి : నా అనే వారు ఉన్నప్పటికీ ఆ ముదసలి రోడ్డుపైన తుది శ్వాస విడిచాడు. తొలుత పోలీసులు గుర్తు తెలియని మృతదేహంగా భావించి, పోస్ట్‌మార్టం నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత వృద్ధుడి ఆచూకీ తెలిసింది. నగర పరిధిలోని ముచ్చర్ల ప్రాంతానికి చెందిన దావ వెంకటయ్య(70)గా గుర్తించారు. కొంతకాలంగా ఆయన మతిస్థిమితం కోల్పోయూడు. అతడికి కూతురు, కుమారుడు ఉన్నారు. వీరు కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నారు. మతిస్థిమితం కోల్పోయిన తండ్రికి చికిత్స చేయించేందుకు వారి వద్ద చిల్లి గవ్వ లేదు. 15 రోజుల క్రితం వెంకటయ్య ఇంటి నుంచి వెళ్లినప్పటికీ... గాలించేందుకు డబ్బులు లేకపోవడంతో వారు ఎక్కడికి వెళ్లలేదు. కూలీ చేస్తే కాని పూట గడవని పరిస్థితి. తండ్రి వెంకటయ్య మృతి చెందిన సమాచారం తెలుసుకున్న కుమారుడు... అప్పు చేసి మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లాడు. -
చనిపోయిందనుకున్న పాప.. లేచి ఏడ్చింది!!
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని హౌరా జిల్లాలో ఓ చిత్రం చోటుచేసుకుంది. చనిపోయిందని వైద్యులు ధ్రువీకరించిన ఓ పాపను శ్మశానానికి తీసుకెళ్తుండగా ఆమె ఒక్కసారిగా లేచి ఏడ్చింది!! హౌరా జిల్లాలోని గోలాబారి పట్టణంలోగల బన్సల్ నర్సింగ్ హోంలో రింకు భగత్ అనే మహిళకు ఆ పాప పుట్టింది. అయితే ఆమె పుట్టకముందే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో బంధువులు ఆమె మృతదేహాన్ని అంత్యక్రియల కోసం శ్మశానానికి తీసుకెళ్తుండగా మధ్యలో లేచి ఏడ్చింది. దీంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. వెంటనే బంధువులతో పాటు ఇతరులు కూడా ఆస్పత్రి వద్దకు చేరుకుని, వైద్యుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.