నా అనే వారు ఉన్నా... | Thinking of visiting you will leave | Sakshi
Sakshi News home page

నా అనే వారు ఉన్నా...

Published Wed, Jun 18 2014 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 AM

నా అనే వారు ఉన్నా...

నా అనే వారు ఉన్నా...

రోడ్డుపైనే తుదిశ్వాస విడిచిన వృద్ధుడు

హసన్‌పర్తి : నా అనే వారు ఉన్నప్పటికీ ఆ ముదసలి రోడ్డుపైన తుది శ్వాస విడిచాడు. తొలుత పోలీసులు గుర్తు తెలియని మృతదేహంగా భావించి, పోస్ట్‌మార్టం నిమిత్తం  వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత వృద్ధుడి ఆచూకీ తెలిసింది. నగర పరిధిలోని ముచ్చర్ల ప్రాంతానికి చెందిన దావ వెంకటయ్య(70)గా గుర్తించారు. కొంతకాలంగా ఆయన మతిస్థిమితం కోల్పోయూడు. అతడికి కూతురు, కుమారుడు ఉన్నారు. వీరు కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నారు. మతిస్థిమితం కోల్పోయిన తండ్రికి చికిత్స చేయించేందుకు వారి వద్ద చిల్లి గవ్వ లేదు. 15 రోజుల క్రితం వెంకటయ్య ఇంటి నుంచి వెళ్లినప్పటికీ... గాలించేందుకు డబ్బులు లేకపోవడంతో వారు ఎక్కడికి వెళ్లలేదు. కూలీ చేస్తే కాని పూట గడవని పరిస్థితి. తండ్రి వెంకటయ్య మృతి చెందిన సమాచారం తెలుసుకున్న కుమారుడు... అప్పు చేసి మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement