సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రితో దారుణం!
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఓ దారుణం జరిగిపోయింది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును బాత్ రూమ్లో వదిలేశారు. స్థానికులు చూసేసరికి శిశువు మరణించి వుంది. ఆస్పత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పుట్టిన శిశువు ఆడపిల్ల కావడంతో ఎవరైనా చంపేసి పడేశారా? లేక మృత శిశువును పడేశారా? అనేది తెలియడంలేదు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఇటువంటి సంఘటన జరగడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
**