అఖిలేష్‌ ర్యాలీలో గందరగోళం.. పత్తాలేని పోలీసులు | No One Policemen Seen In Akhilesh Yadav Rally In Kannauj, More Details | Sakshi
Sakshi News home page

అఖిలేష్‌ ర్యాలీలో గందరగోళం.. పత్తాలేని పోలీసులు

Published Sun, Sep 1 2024 8:09 AM | Last Updated on Sun, Sep 1 2024 12:58 PM

No one Policemen Seen in Akhilesh Yadav Rally

కన్నౌజ్ : యూపీలోని కన్నౌజ్‌ జిల్లాలో జరిగిన పలు కార్యక్రమాల్లో సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సమయంలో ఆయనకు భద్రతను కల్పిచడంలో లోపం కనిపించింది.

అఖిలేష్ ఛిబ్రామౌ చేరుకోగానే ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే ఈ సమయంలో పోలీసులు పత్తాలేకుండా పోయారు.  ఇంతలో అఖిలేష్ ఓ ఇంటికి వెళుతుండగా అక్కడున్నవారు కూడా బలవంతంగా ఆ ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఎస్పీ చీఫ్‌ సెక్యూరిటీ సిబ్బంది పరిస్థితిని అతికష్టం మీద అదుపు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ వీడియోలలో ఎస్పీ కార్యకర్తలు పోట్లాడుకోవడం కనిపిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement