
ఉత్తరప్రదేశ్‌లోని ఎనిమిది లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. నేటి (బుధవారం) సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నేపధ్యంలో నేడు ఘజియాబాద్‌లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
మరోవైపు సహరాన్‌పూర్‌లో పార్టీ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్‌కు మద్దతుగా ప్రియాంక గాంధీ రోడ్‌షో నిర్వహించనున్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చౌదరి భూపేంద్ర సింగ్ కూడా సంస్థాగత సమావేశాన్ని నిర్వహించి, బూత్ నిర్వహణకు కార్యకర్తలకు పలు సూచనలు చేయనున్నారు.
ఎన్నికల ప్రచారానికి చివరి రోజున పార్టీలన్నీ తమ ప్రచారహోరును పెంచాయి. ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్, కైరానా, ముజఫర్‌నగర్, బిజ్నోర్, నగీనా, మొరాదాబాద్, రాంపూర్, పిలిభిత్‌లలో మొదటి దశలో ఓటింగ్ జరగనుంది. ఈ ఎనిమిది స్థానాల్లోని ఏడు స్థానాల్లో బీజేపీ అభ్యర్థి, ఒక స్థానంలో ఆర్‌ఎల్‌డీ అభ్యర్థి పోటీలో ఉన్నారు. అలాగే ఎస్పీ నుంచి ఏడుగురు, కాంగ్రెస్ నుంచి ఒకరు ఎన్నికల బరిలోకి దిగారు. మొత్తం ఎనిమిది స్థానాల్లో బీఎస్పీ తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఎస్పీ అధినేత అఖిలేష్ ప్రచార ర్యాలీని కూడా నిర్వహించనున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment