
పాలకోడేరు: ఓటు ఎంత విలువైనదో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. పశ్చిమ గోదావరి జిల్లా, పాలకోడేరు మండలం, కుముదవల్లి గ్రామంలో 102 ఏళ్ల శతాధిక వృద్ధురాలు వి.లక్ష్మీ నరసమ్మ శనివారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు, సిబ్బంది ఆమె ఇంటికి వెళ్లి ఓటు వేయించారు. వయో వృద్ధులు, దివ్యాంగులకు సంబంధించి హోం ఓటింగ్ రెండోరోజైన శనివారం కూడా కొనసాగింది. గొల్లలకోడేరు, మోగల్లు, కోరుకొల్లు, గరగపర్రు గ్రామాల్లోని వారంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment