voted
-
AP: ఓటు వేసిన 102 ఏళ్ల వృద్ధురాలు
పాలకోడేరు: ఓటు ఎంత విలువైనదో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. పశ్చిమ గోదావరి జిల్లా, పాలకోడేరు మండలం, కుముదవల్లి గ్రామంలో 102 ఏళ్ల శతాధిక వృద్ధురాలు వి.లక్ష్మీ నరసమ్మ శనివారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు, సిబ్బంది ఆమె ఇంటికి వెళ్లి ఓటు వేయించారు. వయో వృద్ధులు, దివ్యాంగులకు సంబంధించి హోం ఓటింగ్ రెండోరోజైన శనివారం కూడా కొనసాగింది. గొల్లలకోడేరు, మోగల్లు, కోరుకొల్లు, గరగపర్రు గ్రామాల్లోని వారంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
తమిళనాడు ఎన్నికలు: ఓటు వేసిన ప్రముఖుల ఫోటోలు
-
ఓటు వేసి కన్నుమూసింది
సాక్షి, శ్రీకాకుళం : పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసిన ఇంటికొచ్చిన ఓ వృద్ధురాలు కన్నుమూసింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. ఎల్.ఎన్ పేట మండలం ఫోక్స్ దర్ పేటకు చెందిన గొలివి గోవిందమ్మ(90) అనే వృద్ధురాలు ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ఇంటికి చేరుకుంది. తదనంతరం అస్వస్థతకు గురైన ఆమె మృతి చెందింది. ఇక ఏపీ వ్యాప్తంగా తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 12 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పోలింగ్ జరిగింది. -
బీజేపీ, టీడీపీలకు ఓట్లు అడిగే హక్కులేదు
పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి మడకశిర: ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ నెరవేర్చని బీజేపీ, టీడీపీలకు ఓట్లు అడిగే హక్కు లేదని పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని నీలకంఠాపురంలో సోమవారం ఆయన పీసీసీ ప్రధాన కార్యదర్శి జంగాల గౌతమ్‌తో కలిసి కాంగ్రెస్ కార్యకర్తలకు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అన్ని పార్టీల ఆమోదంతోనే రాష్ట్ర విభజన జరిగిందన్నారు. టీడీపీ, బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలను గ్రామస్థాయిలోకి తీసుకెళ్లి కాంగ్రెస్‌ను విజయ తీరాలకు చేరుస్తామన్నారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యకర్తలకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం, మాజీ ఎమ్మెల్యే కె.సుధాకర్ పాల్గొన్నారు. -
భోపాల్‌లో ఓటు వేసిన సుష్మా స్వరాజ్