సాక్షి, శ్రీకాకుళం : పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసిన ఇంటికొచ్చిన ఓ వృద్ధురాలు కన్నుమూసింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. ఎల్.ఎన్ పేట మండలం ఫోక్స్ దర్ పేటకు చెందిన గొలివి గోవిందమ్మ(90) అనే వృద్ధురాలు ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ఇంటికి చేరుకుంది. తదనంతరం అస్వస్థతకు గురైన ఆమె మృతి చెందింది. ఇక ఏపీ వ్యాప్తంగా తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 12 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పోలింగ్ జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment