Bollywood TV Actress Pooja Joshi Arora Announces 2nd Pregnancy With Video - Sakshi
Sakshi News home page

Pooja Joshi Arora: రెండోసారి తల్లి కాబోతున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్!

Published Fri, Jul 21 2023 4:49 PM | Last Updated on Fri, Jul 21 2023 7:03 PM

Bollywood TV Actress Pooja Joshi Arora Announces 2nd Pregnancy - Sakshi

బాలీవుడ్ బుల్లితెర నటి పూజా జోషి అరోరా  యే రిష్తా క్యా కెహ్లతా హై సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా ధర్తి కా వీర్ యోధా పృథ్వీరాజ్ చౌహాన్, యే రిష్టే హై ప్యార్ కే అనే హిందీ సీరియల్స్‌లో కూడా నటించింది. తాజాగా రెండోసారి గర్భం ధరించినట్లు ప్రకటించింది భామ. ఈ విషయాన్ని సంబంధించిన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తన బిడ్డ, భర్తతో ఉన్న ఓ వీడియోను షేర్ చేస్తూ ఈ శుభవార్తను అభిమానులతో పంచుకుంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు తారలు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.  ప్రస్తుతం ఈ  వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. 

(ఇది చదవండి: పెళ్లి కాకుండానే రెండోసారి బిడ్డకు జన్మనిచ్చిన నటి!)

బుల్లితెర నటి పూజా జోషి.. 2015లో మనీష్ అరోరాను వివాహాం చేసుకుంది. పెళ్లయిన రెండేళ్లకు 2017లో ఈ జంటకు ఓ పాప జన్మించింది. దాదాపు ఐదేళ్లకు మరోసారి ప్రెగ్నెన్సీ ధరించింది పూజా. అయితే పెళ్లి తర్వాత నటనకు విరామం ప్రకటించిన పూజా.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది. తన ఫోటోలు, రీల్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. కాగా.. యే రిష్తా క్యా కెహ్లతా హైలో పూజ వర్ష మహేశ్వరి అనే పాత్రను పోషించింది.  

(ఇది చదవండి: ఒకటే ముక్క..పుష్ప-2 పవర్‌ఫుల్‌ డైలాగ్‌ లీక్‌..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement