Disha Parmar and Rahul Vaidya announce pregnancy, couple shares sonogram pic - Sakshi
Sakshi News home page

Disha Parmar: బుల్లితెర నటికి ప్రెగ్నెన్సీ.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్

May 19 2023 3:19 PM | Updated on May 19 2023 4:00 PM

Disha Parmar and Rahul Vaidya Couples announce pregnancy - Sakshi

బాలీవుడ్ బుల్లితెర నటి దిశా పర్మార్ గర్భం ధరించినట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన పలువురు బాలీవుడ్ నటులు శుభాకాంక్షలు చెబుతున్నారు. 2012లో నటనలో ఎంట్రీ ఇచ్చిన దిశా ప్యార్ కా దర్ద్ హై మీఠా మీఠా ప్యారా ప్యారాలో పంఖురి గుప్తా పాత్ర పోషించినందుకు ఫేమ్ తెచ్చుకుంది. బడే అచ్ఛే లాగ్తే హై- 2లో ప్రియా సూద్ పాత్రలో మెప్పించింది. 

(ఇది చదవండి: త్వరలోనే పవిత్రా లోకేశ్‌ను పెళ్లి చేసుకుంటా: నరేష్‌)

కాగా.. బిగ్‌బాస్ సీజన్‌-14లో పాల్గొన్న రాహుల్.. దిశా పర్మార్‌కు ఆమె పుట్టిన రోజు ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత ప్రేమ వివాహం చేసుకున్నారు. జూలై 16, 2021లో సింగర్ రాహుల్ వైద్యతో దిశా పర్మార్ పెళ్లి ముంబయిలో ఘనంగా జరిగింది.  దిశా 2019లో రాహుల్ వైద్య సాంగ్ యాద్ తేరి మ్యూజిక్ వీడియోలో కూడా నటించింది. 

(ఇది చదవండి: హీరోయిన్‌ను ముప్పుతిప్పలు పెట్టిన అమ్మాయిలు, వీడియో వైరల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement