సింగర్‌ను పెళ్లాడనున్న బుల్లితెర నటి.. ఫోటోలు వైరల్! | Marathi Actress Swanandi Tikekar Get Engaged With Singer Ashish | Sakshi
Sakshi News home page

Swanandi: సింగర్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న బుల్లితెర నటి!

Published Mon, Jul 24 2023 6:26 PM | Last Updated on Mon, Jul 24 2023 6:39 PM

Marathi Actress Swanandi Tikekar Get Engaged With Singer Ashish - Sakshi

మరాఠీ నటి స్వానంది టికేకర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. తాజాగా ఇండియన్ ఐడల్- 12 కంటెస్టెంట్ ఆశిష్ కులకర్ణితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. ఆదివారం జరిగిన ఈ వేడుకలో వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను నటి తన ఇన్‌స్టాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  

స్వానంది తన ఇన్‌స్టాలో రాస్తూ..' మేము నిశ్చితార్థం చేసుకున్నాం. ఇక నుంచి నువ్వే నా ఏకైక ఇల్లు' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. కాగా.. స్వానంది ప్రముఖ నటుడు ఉదయ్ టికేకర్, ప్రసిద్ధ సింగర్ ఆరతి అంకాలికర్ కుమార్తె. సింగర్‌తో నిశ్చితార్థం జరిగిన తర్వాత స్వానంది తన పెళ్లి గురించి మాట్లాడింది. 

(ఇది చదవండి: ఇంటర్వ్యూల కోసమే చీప్ ట్రిక్స్.. ఎందుకు కొడతానన్న స్టార్‌ నటుడు!)

 స్వానంది మాట్లాడుతూ..' మా పెళ్లి త్వరలోనే జరగబోతోంది. ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నా. ప్రస్తుతానికి ఇది మాత్రమే చెప్పగలను. నేను జీవితంలో ఒక నూతన అధ్యాయం కోసం ఎదురు చూస్తున్నా. ఆశిష్, నేను మా సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ప్రత్యేక సందర్భాన్ని ఆస్వాదిస్తున్నా.' అంటూ చెప్పుకొచ్చింది.  కాగా..  ఇండియన్ ఐడల్ -12 తర్వాత ఆశిశ్‌కు గుర్తింపు వచ్చింది. 

కాగా.. స్వానంది టికేకర్ మరాఠీ సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకుంది. దిల్ దోస్తీ దునియాదారి, దిల్ దోస్తీ దొబారా, అస్సా మహేర్ నాకో గా బాయి పాత్రలకు ఫేమ్ వచ్చింది. అంతే కాకుండా ఏక్ శూన్య తీన్, డోంట్ వర్రీ బి హ్యాపీ అనే చిత్రాల్లో నటించింది. ఇండియన్ ఐడల్ మరాఠీ షోకు హోస్ట్‌గా చేసింది.

(ఇది చదవండి: 'ఓపెన్‌హైమర్' సినిమాలో ఆ సీన్‌ తొలగించండి: సమాచార మంత్రిత్వ శాఖ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement