Sayli Kamble Engagement: తన అద్భుత గాత్రంతో ఎంతోమంది సంగీతప్రియులను అలరించింది సింగర్ సయాలీ కంబ్లే. ఇండియన్ ఐడల్ 12వ సీజన్ సెకండ్ రన్నరప్‌గా నిలిచిన ఆమె తన స్నేహితుడు ధావల్‌ను పెళ్లాడనుంది. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు ఇండియన్ ఐడల్ షో కంటెస్టెంట్లు సహా పలువురు సెలబ్రిటీలు ముఖ్య అతిథులుగా విచ్చేసి సందడి చేశారు. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలను లవ్ బర్డ్స్ సోషల్ మీడియాలో షేర్ చేయారు. 'నీతో చిరునవ్వులు చిందించడానికి, బాధలో ఉన్నప్పుడు సంతోషం వైపు నడిపించడానికి, జీవితాంతం ప్రేమిస్తూ ఎల్లప్పుడూ నీ వెన్నంటే ఉంటాను. నా ఊపిరి ఆగేవరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు ధావన్.
కాగా ధావన్ ఓ ప్రభుత్వ ఉద్యోగి. సయాలీ, ధావన్‌లకు మూడేళ్ల నుంచే పరిచయం ఉంది. ఆ చనువుతో ఓరోజు ధావన్ ఆమెకు ప్రపోజ్ చేయగా సయాలీ సిగ్గుపడుతూ దాన్ని అంగీకరించింది. అలా వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఇక సయాలీ మ్యూజిక్ టూర్ కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉండటంతో వచ్చే ఏడాది మే తర్వాతే వీరి పెళ్లి జరిగే అవకాశం ఉందట!
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సింగర్ సయాలీ తనకు కాబోయే భర్త గురించి మాట్లాడింది. 'ఆశయాలు పెద్దదిగా ఉండాలని, వాటిని సాధించాలంటూ ధావల్ నన్నెప్పుడూ ఇన్‌స్పైర్ చేస్తుంటాడు. నేనెప్పుడూ పెద్ద కలలు కనలేదు. కానీ అతడు మాత్రం మనం కల ఎప్పుడూ పెద్దదిగా ఉండాలని చెప్పేవాడు. అతడి మాటలు, ప్రోత్సాహం వల్లే నేను ఈ స్టేజ్‌లో ఉన్నాను. లాక్‌డౌన్‌కు ముందు కొన్ని షోలలో పాటలు పాడేదాన్ని. అయితే లాక్‌డౌన్ వల్ల అవి ఆగిపోయాయి. ఆ సమయంలో ధావల్ ఇండియన్ ఐడల్ 12 ఆడిషన్స్‌లో పాల్గొనమన్నాడు. సరే చూద్దామని నేను పాడిన వీడియో పంపాను. అలా ఈ షోలో అవకాశం దక్కించుకుని ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నాను' అని చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment