రేపు మరోసారి ఢిల్లీకి సీఎం కేసీఆర్‌.. | Telangana CM KCR Delhi Tour On September 24 To 26th | Sakshi
Sakshi News home page

CM KCR రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్‌.. హస్తినలో మూడు రోజులపాటు

Sep 23 2021 3:11 PM | Updated on Sep 23 2021 4:32 PM

Telangana CM KCR Delhi Tour On September 24 To 26th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రేపు శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటన చేపట్టనున్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న శాసన సభా సమావేశాల్లో పాల్గొన్న అనంతరం జరిగే  బీఏసీ సమావేశం తర్వాత సీఎం కేసీఆర్ హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతుందని తెలిసింది. ఈనెల 25వ తేదీన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సమావేశం కానున్నారు. మరుసటి రోజు 26వ తేదీన విజ్జానభవన్‌లో కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌తో  మాట్లాడనున్నారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ తిరుగు ప్రయాణమవుతారు. 

ఈనెల ఆరంభంలోనే వారం పాటు సీఎం కేసీఆర్‌ ఢిల్లీలో పర్యటించిన విషయం తెలిసిందే. నెల కూడా కాకముందే మరోసారి ఢిల్లీ పర్యటన చేపట్టడం చర్చనీయాంశం. గతంలో చేపట్టిన ఢిల్లీ పర్యటన రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఒకే నెలలో రెండోసారి పర్యటన చేయడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement