నూజివీడు వండర్‌ కిడ్‌ తోషిత్‌రామ్‌ | Toshitram placed in the International Book of Records | Sakshi
Sakshi News home page

నూజివీడు వండర్‌ కిడ్‌ తోషిత్‌రామ్‌

Published Mon, Oct 4 2021 5:02 AM | Last Updated on Mon, Oct 4 2021 1:34 PM

Toshitram placed in the International Book of Records - Sakshi

కలపాల తోషిత్‌రామ్‌

నూజివీడు: రెండున్నరేళ్ల వయస్సులో తన జ్ఞాపకశక్తితో అబ్బురపరుస్తున్నాడు కృష్ణా జిల్లా నూజివీడు పట్టణానికి చెందిన కలపాల తోషిత్‌రామ్‌. రెండున్నరేళ్లు అంటే మాటలుకూడా రాని వయస్సు. కానీ తోషిత్‌రామ్‌ మాత్రం తన ఐక్యూతో ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సాధించాడు.

ఈ ఏడాది జూలైలో నిర్వహించిన పోటీల్లో తోషిత్‌ ఇంగ్లిష్‌ అక్షరాలను ఏ నుంచి జెడ్‌ వరకు, తిరిగి రివర్స్‌ ఆర్డర్‌లో జెడ్‌ నుంచి ఏ వరకు కేవలం 22 సెకన్లలోనే టకటకా చెప్పేశాడు. దీంతో యంగెస్ట్‌ అండ్‌ ఫాస్టెస్ట్‌ కిడ్‌గా తోషిత్‌ ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సాధించాడు. గతంలో ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన ఈ బాలుడి తండ్రి కలపాల శ్రీరామ్‌ప్రసాద్‌ టీటీడీలో ఉద్యోగి, తల్లి భవ్యశ్రీ స్థానిక ఇంజనీరింగ్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.    
(చదవండి: పది కోళ్లను తిన్న కొండచిలువ )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement