బైక్‌పై డ్రైవింగ్ అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది. కార్లు, బస్సుల్లో ప్రయాణించినా.. బండిపై వెళ్లడం అదో సరాదాగా అస్తుంది. చిన్న దూరాలకే కాకుండా లాంగ్ డ్రైవింగ్‌లకు సైతం బైక్ రైడ్‌కే నేటి యువత సై అంటున్నారు. నేటి కాలంలో అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా లేకుండా అందరూ టూవీలర్‌పై రయ్‌మంటూ వెళ్తున్నారు.
అయితే బండి నడపాలంటే కచ్చితంగా మేజర్ అయి ఉండి, డ్రైవింగ్ వచ్చి ఉండాలన్న విషయం తెలిసిందే. అంతేగాక వాహనాన్ని బ్యాలెన్స్ చేయడం కూడా రావాలి. కానీ.. బండి నడిపే సమయంలో రెండు కాళ్లు సరిగా కింద అందకపోయినా బైక్‌పై ఎంచక్కా వెళ్లిపోవచ్చని. మీకు తెలుసా?.
తాజాగా ఇలాంటి ఓ వీడియో నెటిజన్ల కంటపడింది.. ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ.. బైక్ అంత పొడవున్న ఓ యువతి.. రహదారిపై దర్జాగా స్పోర్ట్స్ బైక్ డ్రైవ్ చేస్తూ వెళుతుంది. అయితే ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో ఆమెకు కాళ్లు అందక బండి ఆపేందుకు కష్టమవుతుంది. దీంతో తెలివిగా సిగ్నల్‌కు ముందే ఒకవైపుకు కాళ్లు తీసి చాలా స్టైల్‌గా టూవీలర్ ఆపింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్‌గా మారింది.
బైక్ నడిపేటప్పుడు
కాళ్ళు అందకపోతే ఏం చేయాలి?
pic.twitter.com/mW5nzBgAcu— వై.ఎస్.కాంత్ (@yskanth) August 15, 2024
దీనిని చూసిన నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తూనే.. అలా డ్రైవ్ చేయడం ప్రమాదకరమని సూచిస్తున్నారు. అన్నట్లు ఈ వీడియోలో యువతి చేసినట్లు మీరేమైనా ప్రయత్నించేరూ.. అలాంటి సాహసాలు మాత్రం చేయకండి.. ఇంకో విషయం.. బండిపై వెళ్లేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం మర్చిపోకండి.
Comments
Please login to add a commentAdd a comment