
గోవా రోడ్లపై సమంత బైక్ రైడింగ్
ఈ ఫొటో చూశారా.. పొట్టి నిక్కరు లాంటి డ్రెస్ వేసుకుని సమంత బైక్ రైడింగ్కు వెళుతూ తెగ ఎంజాయ్ చేస్తోంది కదూ! ఏ సినిమా కోసమే షూట్ చేసిన సీన్ కాదిది. ఈ టాలీవుడ్ బ్యూటీ గోవా రోడ్లపై సరదాగా రైడింగ్కు వెళ్లినప్పడు తీసిన ఫొటో ఇది. వేడుకల్లో నిండైన దుస్తుల్లో కనిపించే ఈ భామ.. తెలుగు సినిమాల్లో కూడా ఇంతగా ఎక్స్పోజ్ చేయని సమంతేనా ఇలాంటి డ్రెస్ వేసుకుని రోడ్లపై తిరుగుతోందని ఆశ్చర్యంగా ఉందా? నిజంగా సమంతాయే. సమంత తన డిజైనర్ కోనా నీరజను వెనుక కూర్చోబెట్టుకుని గోవాలో చక్కర్లు కొట్టారు. కోనా నీరజ ఈ ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
సమంత గతంలో హైదరాబాద్లో కూడా బైక్ రైడింగ్కు వెళ్లారు. తమిళ హీరో ఆర్యతో కలసి షికారుకు వెళ్లినట్టు గాసిప్స్ వచ్చాయి. అయితే తాను బైక్లో వెళ్లింది తన అసిస్టెంట్ ఆర్యతో అని.. తమిళ హీరో ఆర్యతో కాదంటూ సమంత సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు.